Nindu noorella savaasam Serial weekly Episode: బిజినెస్ కోసం మీ అన్నయ్యను డబ్బులు నువ్వు అడుగుతావా..? నన్నే అడగమంటావా అంటూ చిత్ర కోపంగా వినోద్ మీద అరుస్తుంది. అప్పుడే బయటకు వెళ్లిన అమర్, భాగీ వస్తుంటే వాళ్లను చూసి కొంచెంసేపు సైలెంట్‌గా ఉండు తర్వాత మాట్లాడుకుందాం అంటాడు వినోద్. దీంతో అమర లోపలికి రాగానే చిత్ర బిజినెస్ కోసం డబ్బులు ఇస్తారా..? ఇవ్వరా..? అంటూ డిమాండ్ చేస్తుంది. దీంతో అమర్ ముందే భాగీ, చిత్ర గొడవ పడతారు. మనోహరి చిత్రకు సపోర్టుగా మాట్లాడుతుంది. అమర్ కోపంగా భాగీని తిట్టి ఈవినింగ్ వరకు డబ్బులు అరెంజ్ చేస్తానని అమర వెళ్లిపోతాడు.
రూంలో కూర్చుని బాధపడుతున్న భాగీ దగ్గరకు వెళ్లిన అమర్. చిత్రకు ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే వేరు కాపురం పెట్టడానికి వినోద్‌ను రెచ్చగొడుతుంది. అందుకే ఇవ్వాల్సి వస్తుంది అని చెప్తాడు. దీంతో భాగీ కూడా ఇప్పటికిప్పుడు అన్ని డబ్బులు ఎలా తీసుకొస్తారని అడుగుతుంది ఎలాగైనా తీసుకొస్తానని చెప్తాడు అమర్.
రణవీర్ కోల్‌కతా నుంచి పిలిపించిన చంభా నేరుగా అమర్ ఇంటికి వెళ్తుంది. గార్డెన్‌లో ఉన్న ఆరును చూసి బెదిరిస్తుంది. తన శక్తిని ఆరు మీదకు ఉసిగొల్పుతుంది. దీంతో ఆరు కూడా గుప్త ఇచ్చిన శక్తితో చంభా శక్తిని అడ్డగిస్తుంది. దీంతో కోపంగా మరో శక్తిని ప్రయోగిస్తుంటే అప్పుడే అమర్ వస్తాడు. రాథోడ్ చూసి చంభాను బయటకు వెళ్లగొడతాడు.
రణవీర్ ఇంటికి వెళ్లిన చంభా తన శక్తిలో ఉన్న కాలా అనే భయంకరమైన పామును అమర్ ఇంటికి పంపించి ఆరు ఫోటో ముందు ఉన్న పూలు వాడిపోయేలా చేయాలనుకుంటుంది. అందుకోసం ఆ పాము అమర్ ఇంట్లోకి వెళ్లేలా ఏర్పాటు చేయాలని మనోహరికి చెప్పమంటుంది. సరే అంటూ రణవీర్ మనోహరికి ఫోన్ చేసి చెప్తాడు. తర్వాత చంభా మంత్రం చేసి కాలాను అమర్ ఇంటికి పంపిస్తుంది. పాము నేరుగా ఆరు రూంలోకి వెళ్తుంది. అది చూసిన గుప్త ఆరుకు విషయం చెప్తాడు. ఆరు వెంటనే ముంగిసలా మారిపోయి రూంలోకి వెళ్లి పాము రూపంలో వచ్చిన కాలాను చంపేస్తుంది. దీంతో చంభా మరింత కోపంగా ఆరును ఎలాగైనా బంధించాలని ప్రయత్నం చేస్తుంది. రణవీర్ అనుమానంగా అసలు ఆరును బంధించడం నీవల్ల అవుతుందా అని అడుగుతాడు. దీంతో అమావాస్య వరకు ఆగాలని చెప్తుంది.
ఇక బిజినెస్ ప్రమోషన్ కోసం యాడ్ ఫిల్మ్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుతుంది చిత్ర. మా బిజినెస్ కోట్లల్లో టర్నోవర్ కావాలంటే ఏం చేయాలని అడుగుతుంది. దీంతో ఓ టాప్ హీరోయిన్ కానీ మోడల్ కానీ మీకు అంబాసిడర్‌గా ఉండాలని చెప్తారు. వాళ్లెందుకు నేను ఉన్నాను కదా నేను యాడ్ చేస్తాను అని చెప్తుంది చిత్ర. చిత్ర చెప్పినట్టు గానే.. ఆమెతోనే యాడ్ షూటింగ్ ఇంట్లోనే చేస్తుంటారు. అయితే డైరెక్టర్ ఎన్ని సార్లు చెప్పినా చిత్ర కరెక్టు చేయదు. దీంతో డైరెక్టర్ విసుగ్గా ఉంటాడు. ఇంతలో కెమెరామెన్ అక్కడే ఉన్న భాగీని చూపిస్తూ ఆమెను యాక్ట్ చేయిద్దాం సార్ అంటాడు. డైరెక్టర్ కూడా భాగీని చూసి ఫేస్ చాలా ఫెయిర్‌గా ఉంది. కెమెరాకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అని రాథోడ్‌ను పిలిచి చెప్తారు. రాథోడ్ వెళ్లి భాగీకి చెప్పగానే భాగీ సిగ్గు పడుతుంది. అంతా గమనిస్తున్న చిత్ర ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది. దీంతో ఈ వారం నిండు నూరేళ్ల సావాసం అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!