Nindu Noorella Saavasam Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో ఇక ఇవన్నీ పక్కన పక్కన పెట్టండి అని ఇంట్లో వాళ్ళందరికీ  చెప్పిన అమర్ రాథోడ్ తో నువ్వు ఇంట్లో ఉండు నేను పిల్లల్ని డ్రాప్ చేసి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంట్లో వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత


మిస్సమ్మ : మనోహరి దగ్గరికి వచ్చి కారణం తెలియదు కానీ నేను ఈ ఇంటికి రావడం మీకు ఇష్టం లేదు ఎప్పుడెప్పుడు నన్ను పంపించేద్దామని చూస్తున్నారు. నాకెందుకో ఈ పని మీరే చేశారనిపిస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను నేను ఈ ఇంట్లోంచి వెళ్ళేదే లేదు. ఇక్కడే ఉంటాను మీకు ఓపిక ఉన్నంతవరకు నన్ను ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయండి అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది.


నీల: అదేంటమ్మా మీకు అంత లా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది అంటుంది.


మనోహరి : నీల చెంప పగలగొడుతుంది ఐదు నిమిషాలు ఉంటే డబ్బు ఇంట్లోంచి బయటికి వెళ్లిపోయేది. నీనించె ఇదంతా జరిగింది అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.


తను గదిలోకి వెళ్ళిన తరువాత చేతికి వచ్చిన డబ్బు చేజారి పోయింది ఇప్పుడు ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటే హంతకుడు ఫోన్ చేస్తాడు.


మనోహరి : చిన్న ప్రాబ్లం అయింది అందుకే డబ్బు సర్దుబాటు కాలేదు, ఒకరోజు టైం ఇవ్వు నీకు డబ్బు పంపిస్తాను అని చెప్తుంది.


హంతకుడు: ఒకరోజు కాకపోతే రెండు రోజులు తీసుకోండి కానీ డబ్బు పంపించండి లేకపోతే ఈసారి ఫోన్ మీకు రాదు నేరుగా మిలిటరీ ఆయనకి వెళ్తుంది అని బెదిరించి ఫోన్ పెట్టేస్తాడు.


ఆ తర్వాత నీల మనోహరి దగ్గరికి వచ్చి మామూలుగా అయితే అయ్యగారు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. ఈరోజు బ్యాగ్ లో డబ్బు దొరికితే ఒక ప్రశ్న కూడా వేయలేదు అంటే ఆ డబ్బులు మీరే తీసారని ఆయనకి అనుమానం వచ్చి ఉంటుందా అంటుంది. మీరు చేసిన ఈ పని అంతా ఆత్మ రూపంలో ఉన్న అరుంధతి అమ్మగారు చూసే ఉంటారు అయ్యగారికి చెప్తారేమో అంటుంది.


మనోహరి : అప్పటికే భయంతో వణికిపోతున్న మనోహరి నువ్వు నన్ను టెన్షన్ పెట్టకు అని నీల మీద కేకలు వేస్తుంది.


మరోవైపు అమర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఎక్కడికో తీసుకు వెళుతూ ఉంటాడు. ఎక్కడికి తీసుకు వెళుతున్నావు అని అడుగుతారు అమర్ తల్లిదండ్రులు.


మిస్సమ్మ : చెప్పేస్తే  త్రిల్ ఏముంటుంది అంటుంది.


అమర్ తల్లిదండ్రులు ఎమోషనల్ అవుతారు.


అమర్ తండ్రి: అచ్చం మా కోడలు మాట్లాడినట్టే మాట్లాడావు అంటాడు.


అమర్ తల్లి: ఈ విషయంలోనే కాదు చాలా విషయాలలో ఈ అమ్మాయి మన కోడలిలాగా ప్రవర్తిస్తుంది, కోడలిలాగా ఆలోచిస్తుంది అంటుంది.


ఆ తర్వాత అమర్ ఒక ఫంక్షన్ దగ్గరికి తీసుకు వెళ్తాడు.  అక్కడ కవర్ చేసి ఉన్న క్లాత్ ని తీసివేయటంతో తన తల్లిదండ్రులకి షష్టిపూర్తి శుభాకాంక్షలు చెప్తున్న పోస్టర్ కనిపిస్తుంది.


అమర్ తల్లిదండ్రులు బాగా ఎమోషనల్ అవుతారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న అంటారు.


అమర్: ఇది నా బాధ్యత నాన్న. మీ షష్టిపూర్తి నా చేతుల మీదుగా చేయాలని మీ కోడలు చెప్పేది అంటాడు.


ఆ మాటలకి అరుంధతి ఎప్పుడో చెప్పిన మాటని గుర్తుపెట్టుకున్నారు అని ఎమోషనల్ అవుతుంది.


ఆ తర్వాత అమర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ  మిస్సమ్మతో  బట్టలు ఇప్పించి త్వరగా వేసుకుని రండి అందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్తాడు. మిస్సమ్మ బట్టల బ్యాగులు అందరికీ ఇచ్చేసి ఇంకా రెండు బ్యాగులు మిగిలాయని అమర్ చేతికి ఇస్తుంది.


అమర్: ఒక బ్యాగ్ మిస్సమ్మకు ఇచ్చి ఇది నీకు అని చెప్పి మరొక బ్యాగ్ నా భార్యకి అని చెప్పి పక్కన పెడతాడు. అప్పుడు అరుంధతి మరింత ఎమోషనల్ అవుతుంది.


బట్టలు మార్చుకోవటానికి వెళ్లిన మనోహరి మనం ఎక్కడున్నామో ఘోర కి ఫోన్ చేసి చెప్పు అరుంధతిని బంధించి తీసుకెళ్ళిపోతాడు అని చెప్తుంది.


మరోవైపు ఫంక్షన్ దగ్గరికి వచ్చిన కాళీ. మా బావ బ్రతికుండగా భాగి నిచ్చి పెళ్లి చేయడు మా అక్కతో పెట్టుకుంటే ఇప్పట్లో జరిగేలాగ లేదు అందుకే భాగిని లొంగ తీసుకుంటే చచ్చినట్లు పెళ్లి చేసుకుని  తీరుతుంది అనుకొని భాగి బట్టలు మార్చుకుంటున్న గది దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేయబోతాడు.


అమర్: కాళీ డోర్ ఓపెన్ చేయడం గమనిస్తాడు. కాళీ ని గుర్తుపట్టి ఆరోజు మా ఇంటికి వచ్చింది,  ఎగ్జిబిషన్ దగ్గర మమ్మల్ని ఫాలో అయింది నువ్వే కదా ఎందుకు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు అంటాడు.


అమర్ ని చూసిన కాళీ అతనికి అందకుండా పరిగెడతాడు. కాళీని వెంబడిస్తాడు అమర్. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.