Nindu Noorella Saavasam Serial Today Episode: ఎలాగైనా భాగీ ప్లాన్ తెలుసుకోవాలనుకున్న చిత్ర, మను ఇద్దరూ కలసి భాగీని ఫాలో అవుతుంటారు. ఇంతలో వారిని డైవర్ట్ చేయాలని ఆరు అనుకుంటుంది. అందుకోసం మను వాళ్ల కారు పంక్చర్ అయ్యేలా చేస్తుంది. దీంతో కారు పంక్చర్ అవుతుంది. ఇక స్టెపినీ మార్చడానికి మను ప్రయత్నిస్తుంది. చిత్ర ఫోన్ చూస్తూ ఉంటుంది. ఆరు నవ్వుకుంటుంది.
చిత్ర: సూపర్.. సూపర్
మను: చిత్ర నేను ఒక్కదాన్ని ఇక్కడ కష్టపడుతుంటే.. నువ్వు హెల్ప్ చేయకుండా ఏం చేస్తున్నావు..
చిత్ర: నా షాపు సీసీ కెమెరా లాగిన్ చేసి లైవ్ చూస్తున్నాను మను. షాపుకు జనం కుప్పలు కుప్పలుగా వస్తున్నారు మను.
మను: మనం వచ్చిన పనేంటి నువ్వు చేస్తున్న పనేంటి..? షాపును చూసుకోవడానికి వినోద్ ఉన్నాడు కదా..? నువ్వు వచ్చి హెల్ప్ చేయోచ్చు కదా..?
చిత్ర: ఆల్‌రెడీ టైర్ మార్చేశావు కదా..? ఇంక నేనేం చేయాలి
మను: ఏం చేయాలి నేనేదో డ్రైవర్ లాగా నువ్వేదో ఓనర్ లాగా మాట్లాడుతున్నావు.
ఆరు: ఫ్రెండ్స్ ను ఫ్రెండ్స్ లాగా కాకుండా శత్రువులా చూస్తే ఇలాగే ఉంటుంది. నా లాంటి మంచిదాన్ని కాదని ఈ చిత్రతో ఫ్రెండ్షిప్ చేశావు కదా నీకు ఇలాగే ఉంటుంది అనుభవించు
చిత్ర: అది కాదు మను ఇప్పటికే నీ చేతులకు అదిగో అక్కడున్న మట్టి, గ్రీసు అన్ని పూసుకున్నావు మళ్లీ నా చేతులకు ఎందుకు అంటించుకోవడం అని
మను: అంతా నీ దరిద్రపు గొట్టు గొంతు వల్లే వచ్చింది. లేదంటే హాయిగా వెళ్లిపోయేవాళ్లం..
చిత్ర: నా వల్ల కాదు మను అంతా ఆదిగో ఆ ఆత్మ వల్ల వచ్చింది. ఒసేయ్ అరుంధతి నువ్వసలు ఫ్రెండువేనా..? ఫ్రెండ్స్‌ను ఇంతలా ఇబ్బంది పెడతావా..? ఇందుకేనా నువ్వు తొందరగా చచ్చావు.. ఇంకా ఇక్కడే నువ్వు దెయ్యంలా తిరగుతున్నావా..? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు.. నీ భర్త, భాగీ, పిల్లలు సంతోషంగా ఉండటం చూసి హ్యాపీగా ఉన్నావేంటి..? చెప్పు.. అది మూణ్నాళ్ల ముచ్చటే అమ్మ అతి త్వరలో మను నీ చెల్లెలు భాగీని కూడా నీ దగ్గరకు పంపించేస్తుంది. ఆ తర్వాత అమరేంద్రను పెళ్లి చేసుకుని మను హ్యాపీగా ఉంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావు.. కుళ్లి కుళ్లి చచ్చిపోతావా..? ఆల్ రెడీ నువ్వు చచ్చిపోయావు కదా..? ఇంకెందుకు నీకు ఈ కుళ్లు అసూయ చెప్పు
మను: ఆపవే ఆరు నిజంగా ఇక్కడే ఉంటే ఈసారి పంక్చర్ కాదు.. ఏకంగా పెద్ద యాక్సిడెంటే చేయిస్తుంది. ఈ కారుతో పాటు మనం కూడా ముక్కలు ముక్కలు అయిపోతాం
చిత్ర: ఆత్మకు అంత శక్తి ఉంటుందా..?
మను: ఎంత శక్తి ఉంటుందో నీకు తెలియదులే.. నాకు బాగా తెలుసు..పద వెళ్దాం..
అని ఇద్దరూ కారు స్టార్ట్ చేసుకుని బయలుదేరుతారు. ఇక భాగీ, రాథోడ్ తో కలిసి అమర్, రణవీర్ ఇంటికి వెళ్తాడు.
రణవీర్: అమరేంద్ర గారు మీరే వచ్చారు. నా పాప ఎక్కడండి..?
అమర్: అదిగో మీ పాప
ఆశ్రమం కేర్ టేకర్ పాపను తీసుకుని ఇంట్లోకి వస్తుంది.
రణవీర్: థాంక్స్ అమరేంద్ర గారు..
పాప: డాడీ.. డాడీ..
రణవీర్ పాపను హగ్ చేసుకుని ముద్దాడుతూ ఎమోషనల్ అవుతాడు.
అమర్: ఓకే రణవీర్ నీ పాపను నీ దగ్గరకు చేర్చేశాము ఇక మేము బయలుదేరుతాం.
అని చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చి కారులో రణవీర్ ఇంటిని అబ్జర్వ్ చేస్తుంటారు. ఇంతలో ముస్లీం వేషంలో మను రణవీర్ ఇంటికి వస్తుంది. లోపలికి వెళ్లి పాప గురించి ఎక్వైరీ చేస్తుంది. ఇంతలో బయట చూస్తూ ఉన్న అమర్ వాళ్లు ఇంట్లోకి వెళ్తారు. అమర్ వాళ్లను చూసిన రణవీర్, మను షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!