Nindu Noorella Saavasam Serial Today Episode:  రణవీర్‌ గురించి అమర్‌ ఆలోచిస్తుంటాడు. రణవీర్‌ నోటి వెంటే నిజం రాబట్టాలని కానీ ఎలా చేయాలని అమర్‌ ఆలోచనలో ఉండగా అక్కడికి భాగీ వస్తుంది.

భాగీ: ఏంటండి ఈ టైంలో ఏం  ఆలోచిస్తున్నారు అక్క గుర్తుకు వచ్చిందా..? ( అమర్‌ లేదన్నట్టు సైగ చేస్తాడు.) మరి దేని గురించి ఆలోచిస్తున్నారు

అమర్‌: రణవీర్‌ గురించి

భాగీ: ఇప్పుడు రణవీర్‌ గురించి ఆలోచించడం ఏంటి

అమర్‌: రణవీర్‌ చెప్పిన దాన్ని బట్టి తన వైఫ్‌, డాటర్‌ ఒకేసారి మిస్‌ అయ్యారు.. కానీ రణవీర్‌ వైఫ్‌ను వెతకడం మానేసి కూతురును మాత్రమే వెతుకుతున్నాడు. రణవీర్‌ తన వైఫ్‌ను స్కిప్ చేస్తున్నాడు అంటే రణవీర్‌ వైఫ్‌ పక్కనే ఉండి ఉంటుంది. లేదా తను ఎక్కడ ఉందో తెలిసి ఉంటుంది.

భాగీ: మీరు రణవీర్‌ వైఫ్‌ గురించి సర్చ్‌ చేశారు.. కదా ఏమైంది..?

అమర్‌: ఒక్కసారి కాదు రెండు సార్లు ట్రై చేశాం కానీ తను ఎవరో తెలియలేదు ఎలాగైనా తను ఎవరో కనిపెట్టాలి.

కింద తన రూంలోంచి బయటకు వచ్చిన మనోహరి అటూ ఇటూ చూస్తుంది. ఎవ్వరూ కనిపించరు.

మను: చాలా రోజుల తర్వాత అర్ధ్రరాత్రి పూట ఇల్లు చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. కచ్చితంగా ఆరు ఆ చంభా బంధీ నుంచి బయట పడే ఉంటుంది. వెంటనే చంభా దగ్గరకు వెళ్లాలి. ఈ సారి చిత్రను కూడా తీసుకెళ్తాను

అనుకుని పైకి వెళ్తుంది.

భాగీ: అది చాలా సింపుల్‌ అండి అంజును రణవీర్‌కు ఇచ్చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ గా అతని వైప్‌ ఎవరో బయటకు వచ్చేస్తుంది

అమర్‌: ఏం మాట్లాడుతున్నావు భాగీ పిచ్చేమైన పట్టిందా..? భాగీ.. అంజును ఇచ్చేయమంటున్నావా..? పుట్టగానే కన్న బిడ్డను అనాథ శరణాలయంలో వదిలేసిన అలాంటి దయలేని తల్లి చేతుల్లో అంజును పెట్టమంటున్నావా..? ఆస్థి కోసం కన్న బిడ్డను అడ్డు పెట్టుకోవాలని చూస్తున్న  రణవీర్‌ లాంటి స్వార్థ పరుడుకి అంజును అప్పగించమంటున్నావా..? సెన్స్‌ ఉండే మాట్లాడుతున్నావా..? భాగీ

భాగీ: నేను అంజును అంటే అంజును కాదండి ఒక ఫేక్‌ కూతురును ఇద్దామంటున్నాను.

అమర్‌: అబద్దపు కూతురా.?

భాగీ: అవునండి అనాథ శరణాలయంలో నేను ఒక పాపను చూశాను. చాలా యాక్టివ్‌ గా ఉంది. తనని రణవీర్‌ కూతురుగా ఎంటర్‌ చేయిద్దాం. తనే నీ కూతురు అని మీరు ఆ పాపని రణవీర్‌ దగ్గరకు చేరేలా చేయాలి. పాపను తీసుకుని రణవీర్‌ కోల్‌కతా బయలుదేరుతాడు. అప్పుడు రణవీర్‌ వైఫ్‌ బయటకు వస్తుంది.

అమర్‌: ఎవరో పాప తన పాప అని రణవీర్‌ ఎలా నమ్ముతాడు

భాగీ: అంజును తన పాప అని ఎలా నమ్మించారో ఈ పాపను కూడా తన కూతురని నమ్మించాలి. పాప బయలాజికల్‌ ఎవిడెన్స్‌ అన్ని రణవీర్‌కు మ్యాచ్‌ అయితే సరిపోతుంది కదా..?

అమర్‌: అలా చేయోచ్చు భాగీ కానీ ఆ పాప రణవీర్‌ దగ్గర ఉండటం పాపకు సేఫ్ కాదు. ఆస్థి తన చేతికి వచ్చిన మరుక్షణం రణవీర్‌ వల్ల పాపకు చాలా ప్రమాదం.

భాగీ: మనం అంతదూరం ఎందుకు వెళ్లనిస్తామండి.. పాప తన కూతురు అని రణవీర్‌ కన్ఫం అయిన మరుక్షణం రణవీర్‌ వైప్‌ తెర మీదకు వస్తుంది.

అమర్‌: ఇంత రిస్క్‌ అవసరమా..?

భాగీ: వేరే వాళ్లకు అయితే రిస్క్‌ మీకు కాదు కదా

అంటూ భాగీ, అమర్‌ మాట్లాడుకోవడం చాటు నుంచి మనోహరి వింటుంది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత అమర్‌ ఆఫీసులో రణవీర్‌ కూర్చుని ఉంటాడు. ఇంతలో అమర్‌ వస్తాడు.

రణవీర్: అసలు నన్ను ఎందుకు రమ్మన్నారు అమరేంద్రగారు.

అమర్‌: మీ అమ్మాయి దొరికింది రణవీర్‌

రణవీర్‌: నిజమా అమర్‌ నా కూతురు దొరికిందా..?

అమర్‌: ఎస్‌ దొరికింది నిజమే..

రణవీర్‌: థాంక్స్‌ అమరేంద్ర గారు..

అమర్‌: ఇంతకీ మీ పాప దొరికిన విషయం మీ వైఫ్‌కు చెప్పరా..?

రణవీర్‌: యా కచ్చితంగా చెప్తాను.. ఇప్పుడే ఫోన్‌ చేస్తాను

అని రణవీర్‌ ఫోన్‌ తీసి మనోహరికి కాల్‌ చేయబోయి ఆగిపోతాడు. దీంతో అమర్‌ కోపంగా చూస్తూ మీ వైఫ్‌ ఎక్కడుందో మీకు తెలుసన్న మాట అంటాడు. దీంతో రణవీర్‌ షాక్‌ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!