Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీ, ఆరు ఫోటో చూసిందని చెప్పడానికి మనోహరి, రణవీర్‌కు అర్ధ్రరాత్రి కాల్స్ చేస్తుంది. పుల్లు నిద్రలో ఉన్న రణవీర్ ఉదయం లేవగానే ఫోన్ చూసి మనోహరికి కాల్ చేస్తాడు.
మను: ఏంటి రణవీర్ ఇది.. ఎన్ని సార్లు ఫోన్ చేయాలి నీకు అసలు ఏం చేస్తున్నావు
రణవీర్: మనోహరి నిద్ర పోతున్నాను.. దెయ్యాలు తిరిగే టైంలో ఫోన్ చేస్తే ఎవరు మెలుకువగా ఉంటారు చెప్పు
మను: ఇప్పుడు దెయ్యం కథ మొదలవబోతుంది
రణవీర్: దెయ్యం కథా ఎమంటున్నావు మనోహరి..
మను: భాగీ, అరుంధతి ఫోటో చూసేసింది..
రణవీర్: ఏంటి..? ఎప్పుడు చూసింది
మను: నిన్న నైట్ చూసింది. అది చూడగానే.. స్పృహ తప్పి పడిపోయింది. ఇంకా నిద్ర లేవ లేదు
రణవీర్: ఇదేంటి వరుసగా అన్ని ఇలా జరగుతున్నాయి నిన్న భాగీకి నీ గురించి తెలిసిపోవడం.. నైట్ అరుంధతి ఫోటో చూడటం
మను: అదే నాకు అర్థం కావడం లేదు. అది లేవగానే… ఇన్నాళ్లు తను చూసింది, మాట్లాడుతుంది మనిషితో కాదు.. అరుంధతి ఆత్మతో అని అమర్‌తో చెప్తే..?
రణవీర్: కచ్చితంగా చెప్తుంది మనోహరి.. నీది చిన్న విషయం.. భాగీ అమరేంద్రతో నీ విషయం చెప్పకపోయినా ఈ విషయం చెప్పి తీరుతుంది.
మను: అమర్‌కు ఆ విషయం తెలిస్తే ఆ తర్వాత వన్ బై వన్ అన్ని విషయాలు తెలుస్తాయి. అప్పుడు ఏం చేయాలి రణవీర్
రణవీర్: వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేయ్ వాళ్లకు కనిపించకుండా ఎక్కడికైనా దూరంగా పారిపోవాలి.
మను: పారిపోవడానికా ఇన్ని చేసింది. ఏదైనా మంచి ఐడియా ఇస్తావని నిన్ను ఐడియా అడిగితే ఇలా చెప్తున్నావేంటి..?
రణవీర్: ఇంత కంటే బెటర్ ఐడియా లేదు మనోహరి. అమరేంద్రకు నిజం తెలిస్తే నిన్ను బతకనివ్వడు.. చంపేస్తాడు..
మను: రణవీర్ ఊరికే నన్ను బయపెట్టకు అసలే నేను టెన్షన్‌లో ఉన్నాను.
రణవీర్: బయపెట్టడం కాదు.. నీ మంచి కోరి చెప్తున్నాను.. ఇంక నువ్వు అక్కడ ఉండటం సేఫ్ కాదు మనోహరి
మను: అసలు అది ఆత్మ గురించి చెప్తుందో లేదో తెలియాలి కదా..? అప్పుడే నేనెందుకు బయటపడాలి.
రణవీర్: ఇన్ని జరుగుతునాయంటే.. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే మనోహరి.. నా మాట విని బయటకు వచ్చేయ్
మను: లేదు రణవీర్ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని ఆ తర్వాత తేల్చుకుంటాను..
రణవీర్: నేను చెప్పాల్సిన మాట చెప్పాను.. ఇక నీ ఇష్టం
మను: భాగీ స్పృహలోకి వచ్చాక ఏం జరుగుతుదో చూసి అప్పుడు డిసైడ్ అవుతాను
రణవీర్: ఓకే జాగ్రత్త
అంటూ రణవీర్ ఫోన్ కట్ చేస్తాడు. మరోవైపు బయట గార్డెన్‌లో ఉన్న ఆరు ఇంట్లోకి చూస్తుంది. గుప్త వస్తాడు.
గుప్త: ఏమైంది బాలిక ఉదయం నుంచి సింహ ద్వారం వైపే తీక్షణంగా చూస్తున్నావు..
ఆరు: భాగీ ఉదయమే లేచి గుమ్మం ముందు ముగ్గు పెట్టేది. ఈరోజు తను ఇంకా బయటకు రాలేదు గుప్త గారు.. ఏమై ఉంటుంది అంటారు.
గుప్త: ఏమున్నది బాలిక రాత్రి ఆలస్యముగా నిద్రించి ఉండవచ్చును అందులకే నిద్ర లేవలేదేమో..
ఆరు: నేను అదే అనుకున్నాను లేండి
అని చెబుతూనే కిటికీ దగ్గరకు వెళ్తుంది. అమర్ కిందకు వచ్చి పేపర్ చూస్తుంటాడు. రాథోడ్ వస్తాడు.
రాథోడ్: సార్ ఈరోజు ప్రోగ్రాం ఏంటంటే..
అమర్: వన్ మినిట్ రాథోడ్ ఈ రోజు అరగంట లేటుగా ఆఫీసుకు వెళ్దాం.
రాథోడ్: ఎందుకు సార్
అమర్: భాగీ ఇంకా నిద్ర లేవ లేదు.
రాథోడ్: ఎప్పుడూ అందరికన్నా ముందే నిద్ర లేచేది కదా సార్.
అమర్: రాత్రి భాగీ స్పృహ తప్పి పడిపోయింది. ఇంకా నిద్ర లేవలేదు..
రాథోడ్: ఎందుకు సార్ ఏమైంది..?
కిటికీ లోంచి వింటున్న ఆరు వెంటనే భాగీ రూం కిటికీ దగ్గరకు పరుగెడుతుంది. వెనకే గుప్త వెళ్తాడు. కంగారుగా భాగిని పిలుస్తుంది. కానీ భాగీ పుల్లు నిద్రలో ఉంటుంది. కింద రాత్రి ఆరు రూంలోకి వెళ్లి స్పృహ తప్పి పడిపోయింది భాగీ అని అమర్ చెప్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!