Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ ఇంటికి రాజు వస్తాడు. రాజును చూసిన ఆరు హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో మనోహరి బయటకు వస్తుంది. మనోహరిని చూసి రాజు పక్కకు వెళ్తాడు. మనోహరి కారులో వెళ్లిపోతుంది.

Continues below advertisement

రాజు:  హమ్మయ్యా ఈ రాక్షసి వెళ్లిపోయింది. వెంటనే లోపలికి వెళ్లి భాగీ గారికి నిజం చెప్పాలి

ఆరు: ఈ విషయం వెంటనే గుప్త గారికి చెప్పాలి.. గుప్త గారేంటి కనిపించడం లేదు.. (గుప్త వస్తాడు.) గుప్త గారు ఎక్కడికి వెళ్లిపోయారు..?

Continues below advertisement

గుప్త: ( మనసులో)  విషాదముతో చిన్న విరామం తీసుకుంటిని బాలిక

ఆరు:  గుప్త గారు మీకు ఒక విషయం చెప్పాలి అనాథ ఆశ్రమం నుంచి ఒక మనిషి వచ్చారు. మా చిన్ననాటి మనోహరి గురించి నిజం చెప్పడానికి ఇప్పుడే ఇంట్లోకి వెళ్లారు. మనోహరికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి గుప్తగారు. దాని చాప్టర్‌ క్లోజ్‌

గుప్త: ( మనసులో) సమాప్తం కాబోతున్నది ఆ దుష్ట బాలిక కాదు బాలిక. నీ చరిత్ర

ఆరు: అవును ఇందాక మీరు మీ పెట్టెలో చూసింది ఇదేనా..?

గుప్త అవును అన్నట్టు గుప్త తలూపుతాడు.

ఆరు: ఓహో దీనికే ఎందుకు అంత ఇదై పోయారు.. ఎందుకు అంత కంగారు పడ్డారు. అయినా ఇది ఆనందించాల్సిన విషయం కదా ఎందుకు అంత ఫీల్‌ అయ్యారు

అంటూ ఆరు చెప్తున్నా గుప్త పలకడు. ఇక రాజు ఇంట్లోకి వెళ్లగానే అప్పుడే పై నుంచి కిందకు వస్తున్న  పిల్లలు నవ్వుతూ రాజు దగ్గరకు వస్తారు.

అంజు: ఎలా ఉన్నావు తాతయ్యా

రాజు: నేను బాగానే ఉన్నాను అమ్మా.. నువ్వెలా ఉన్నావు.. నువ్వు త్వరగా కోలుకోవాలని ఆశ్రమంలోని పిల్లలు అందరూ ప్రేయర్‌ చేశారు..

అంజు: నేను బాగానే ఉన్నాను తాతయ్య.. థాంక్యూ

రాజు: మీ నాన్నగారు ఉన్నారా?

అమ్ము: లేరు తాతయ్యా ఆఫీసుకు వెళ్లారు

రాజు: మరి భాగీ గారు ఉన్నారా అమ్మా

ఆనంద్‌: మిస్సమ్మ ఇంట్లోనే ఉంది తాతయ్యా

ఆకాష్‌: మిస్సమ్మా మిస్సమ్మా తాతయ్య వచ్చారు

భాగీ కిందకు వస్తుంది.

భాగీ: ఏంటి రాజు గారు ఇలా వచ్చారు..

రాజు: మీతో ఒక విషయం చెప్పాలమ్మా

భాగీ: చెప్పండి రాజు గారు

రాజు: నేను కాదు సరస్వతి మేడం మీతో మాట్లాడతామన్నారు

భాగీ: ఆవిడ ఎక్కడున్నారు ఇంతకీ ఆవిడకు ఇప్పుడు ఎలా ఉంది..?

రాజు: పర్వాలేదమ్మా.. మీరు ఒకసారి ఆశ్రమానికి వస్తే మీకు అన్ని విషయాలు చెప్తారు.  

అనగానే తర్వాత టైం చూసుకుని వస్తానని భాగీ చెప్పగానే రాజు వెళ్లిపోతాడు. తర్వాత భాగీ, రాథోడ్‌తో కలిసి ఆశ్రమానికి వెళ్తుంది. అక్కడ సరస్వతి మేడంను కలుస్తుంది.  

సరస్వతి: నమస్తే మేడం కూర్చోండి..

భాగీ: పర్వా లేదు మేడం.. మీరు ఏదో విషయం చెప్పాలి అన్నారట కదా ఏంటి మేడం చెప్పండి

సరస్వతి: అవును మేడం.. మీ ఇంట్లో ఉన్న అరుంధతి ఫ్రెండ్‌ మనోహరి గురించి మీకు కొన్ని విషయాలు తెలియాలి. అందుకే చాలా రోజులుగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. కానీ అన్ని అడ్డంకులే వస్తున్నాయి..

రాథోడ్‌: ఇంతకీ మనోహరి గురించి ఏం చెప్పాలి మేడం.

సరస్వతి: ఆ మనోహరి అసలు మనిషి కాదు. నరరూప రాక్షసురాలు.. అది ఏం చేసిందో తెలుసా అమ్మా అమాయకురాలైన అరుంధతిని స్నేహితురాలిగా నటించి నమ్మించి మోసం చేసింది. అరుంధతిని పొట్టన పెట్టుకుంది. అరుంధతిని చంపిన హంతకురాలు అదేనమ్మా..?

అని వార్డెన్‌ చెప్తూ ఎమోషనల్‌ అవుతుంది. వార్డెన్‌ నిజం చెప్పడంతో బాగీ, రాథోడ్‌ షాక్‌ అవుతారు.. ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్లిపోతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!