Nindu Noorella Saavasam Serial Today Episode:  బాగీ కోసం అమర్‌ ఇంటికి వస్తాడు రామ్మూర్తి. అమర్‌ ఇంటి గేటు తెరుచుని అనుమనంగా గార్డెన్‌ వైపు చూస్తూ లోపలికి నడుస్తుంటాడు. ఇంతలో అంజు వచ్చి చేయి పట్టుకుంటుంది.

Continues below advertisement


అంజు: హాయ్‌ తాతయ్య ఎలా ఉన్నారు.


రామ్మూర్తి: నేను బాగానే ఉన్నాను అమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది తల్లి


అంజు: నేను బాగున్నాను.. ప్రియమైన తాతయ్య మిస్సమ్మ కోసం వచ్చావు కదా..?


రామ్మూర్తి: అవునమ్మా తను ఇంట్లోనే ఉందమ్మా..?


అంజు: ఉంది కానీ మిస్సమ్మ గురించి నీకొక విషయం చెప్పాలి తాతయ్య


రామ్మూర్తి: ఏ విషయం అమ్మా చెప్పు..


అంజు: లాన్‌ ఉంది కదా..? తాతయ్య లాన్‌లో మిస్సమ్మ రోజూ అక్కడ నిల్చుని ఒకరితో మాట్లాడుతూ ఉంటుంది


రామ్మూర్తి షాక్‌


రామ్మూర్తి: ఎవరితో మాట్లాడుతుంది తల్లి


అంజు: ఆత్మతో..  మా అమ్మ ఆత్మతో మాట్లాడుతూ ఉంటుంది. (రామ్మూర్తి మరింత షాక్‌  అవుతూ గార్డెన్ వైపు చూస్తుంటాడు.) ఈ విషయం ఎవరికి చెప్పినా నమ్మడం లేదు తాతయ్య.. డాడీ అమ్ము ఆకాష్‌, ఆనంద్‌ లకు చెప్పాను. మనోహరి ఆంటీకి కూడా చెప్పాను కానీ ఎవ్వరూ నమ్మడం లేదు.. అందరూ నా మాట కొట్టిపారేస్తున్నారు. మిస్సమ్మేమో తనలో తానే మాట్లాడుకుంటున్నానని అబద్దంచెప్తుంది. మిస్సమ్మ మాట్లాడుతుంది మా అమ్మతోనే తాతయ్య. కనీసం మీరైనా నమ్మండి తాతయ్య. నేను చెప్పేది నిజం తాతయ్య ఇప్పుడు కూడా మిస్సమ్మ, మా అమ్మ పైన మాట్లాడుకుంటున్నారు. కావాలంటే మీరే వెళ్లి చూడండి


రామ్మూర్తి: భాగీ పైన ఉందా అమ్మా


అంజు: మా అమ్మ కూడా ఉంది తాతయ్య


రామ్మూర్తి ఇంట్లోకి వెల్లి పైకి వెల్తుంటాడు. అక్కడే ఉన్న మనోహరిని పట్టించుకోకుండా వెల్లిపోతాడు. దీంతో మనోహరి షాక్‌ అవుతుంది.


మను: ఇతను ఇప్పుడొచ్చాడేంటి.. పైగా నన్ను పట్టించుకోకుండా పైకి వెళ్తున్నాడు. కొంపదీసి అందరూ కలిసి పైన ఏమైనా మీటింగ్‌ పెట్టుకున్నారా..?


ఇంతలో  అమర్‌ వస్తాడు. అమర్‌ ను చూసిన మనోహరి తన రూం డోర్ దగ్గరకు వెళ్లి గమనిస్తుంది. అమర్‌, భాగీని పిలుస్తాడు. భాగీ, ఆరు, రామ్మూర్తి కిందకు వస్తారు. రామ్మూర్తిని చూసిన అమర్‌ పలకరిస్తాడు.


అమర్‌: మీరెప్పుడొచ్చారు.. ఇద్దరూ వచ్చుంటే బాగుండు కదండి.


రామ్మూర్తి: ఇందాకే వచ్చాను బాబు.. అమ్మాయిని చూడాలనిపిస్తేనూ వచ్చాను..  ఇప్పుడే భాగీ దగ్గరకు పైకి వెళ్లాను.. ఇంతలోనే మీరు వచ్చి పిలుస్తున్నారు..


అమర్‌: అవునా భోజనం చేశారా..?


రామ్మూర్తి: లేదు బాబు ఇంటి దగ్గరే చేసి వచ్చాను. అమ్మాయిని ఓ సారి చూడాలనిపించి చూసి మళ్లీ  వెళ్దామని వచ్చాను.


భాగీ: ఏంటండి పిలిచారంటా..? నాతో ఏదైనా పనుందా..? లేదా మీకు ఏమైనా కావాలా..?


అమర్‌: ఏం లేదు భాగీ నాకేం అవసరం లేదు.. నాకు కాస్త పని ఉంది. అందుకే నేను బయటకు వెళ్తున్నాను.. అది చెబుదామనే పిలిచాను..


రామ్మూర్తి: ఆ బాబు నేను కాస్తైయ్యాక వెల్లిపోతాను..


అమర్‌: అయ్యో ఇప్పుడే వచ్చారు అప్పుడే వెళ్తారా..? ఉండండి మెల్లగా వెళ్లొచ్చు.. భాగీ మీ నాన్నకు ఏం కావాలో చూసుకో..? ఇవాళేం వెళ్లనీయోద్దు


అని చెప్పి అమర్‌ వెళ్లబోతుంటే..


ఆరు: క్షేమంగా వెళ్లి  లాభంగా రండి


అంటూ సంతోషంగా సెండాఫ్‌ ఇస్తుంది. అప్పుడే అమర్‌ కాలుకు సోపా తగిలి కింద పడబోతాడు. వెంటనే ఆరు అమర్‌ను పట్టకుని కింద పడకుండా ఆపేస్తుంది. అది చూసిన అందరూ షాక్‌ అవుతారు. అమర్‌ మాత్రం ఆ స్పర్శ ఆరుదే అన్నట్టు ఫీలవుతాడు. ఇక దూరం నుంచి చూస్తున్న మనోహరి షాక్‌ అవుతుంది.


మను: కింద పడబోయిన అమరేంద్ర గాలిలోనే ఉన్నాడేంటి..?  ఆరు పట్టుకుందా..? ఇప్పుడు ఆరు గురించి అందరికీ తెలిసిపోతుందా..?


అని మనసులో అనుకుంటూ భయపడుతుంది. మరోవైపు అమర్‌ తిరిగి వెనక్కి చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించరు.. కానీ తనను ఎవరో పట్టుకున్న అనిపిస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!