Nindu Noorella Saavasam Serial Today Episode: గార్డెన్‌లో భాగీ, ఆరు ఆత్మతో మాట్లాడుతుంది. పిల్లలు కిటికీలోంచి భాగీని చూసి ఎవరితో మాట్లాడుతుంది.. అక్కడ ఎవ్వరూ లేరు కదా అనుకుంటారు.

Continues below advertisement

అంజు: అక్కడ ఆత్మ ఉంది

ఆనంద్‌: అత్మ ఉండటం ఏంటి అంజు

Continues below advertisement

అంజు: మన ఇంటి లాన్ లో ఒక ఆత్మ ఉంది. మిస్సమ్మ ఆ ఆత్మతోనే మాట్లాడుతుంది

ఆకాష్‌: నీకేమైనా పిచ్చా..?  మిస్సమ్మ ఆత్మతో మాట్లాడటమేంటి..?

అంజు: ఒకసారి చూడండి మరి మిస్సమ్మ ఎవరితో మాట్లాడుతుందో ఇప్పుడు చెప్పండి.. ఆత్మతో మాట్లాడుతుంది. అది కూడా మన అమ్మ ఆత్మ..

పిల్లలు: అమ్మ ఆత్మా..?

అంజు: అవును మన అమ్మ ఆత్మతోనే మిస్సమ్మ మాట్లాడుతుంది

అమ్ము: మనకు కనిపించని అమ్మ ఆత్మ మిస్సమ్మకు ఎలా కనిపిస్తుందే..

అంజు: అది కిందకు వెళ్లి అమ్మనే అడగాలి పదండి.. ఏంటి అమ్మను చూడాలని అమ్మతో మాట్లాడాలని మీకు లేదా..?

పిల్లలు: ఉంది

అంజు: అయితే త్వరగా పదండి మళ్లీ అమ్మ వెళ్లిపోతుంది

అంటూ అందరూ కిందకు వెళ్తారు. హాల్లో ఉన్న అమర్‌ పిల్లలను చూసి ఆపేస్తాడు.

అమర్: ఆగండి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు..?

అంజు: బయట లాన్‌లోకి వెళ్తున్నాము డాడ్‌

అమర్‌: ఈ టైంలోనా ఎందుకు

అంజు: అమ్మను చూడ్డానికి డాడ్‌.. అమ్మతో మాట్లాడటానికి

అమర్‌ షాక్‌

అమర్‌: ఏంటి అమ్మను చూడ్డానికా..?

అంజు: అమ్మ లాన్‌లో ఉంది డాడ్‌ మిస్సమ్మతో మాట్లాడుతుంది

అమర్‌: ఎవరు చెప్పారు నీకు

అంజు: మేము చూశాము లాన్‌లో మిస్సమ్మ మాట్లాడుతుంది. అది అమ్మతోనే..

అమర్‌: ఆ విషయం నీకెలా తెలుసు

అంజు: ఆత్మలున్నాయని అమ్మ ఆత్మ ఇంటి బయటే ఉందని రాత్రి నువ్వే కదా చెప్పావు డాడ్‌.. ( అమర్‌ చెప్పిది గుర్తు చేసుకుంటాడు) రండి డాడ్‌.. అమ్మను చూద్దాం

అని అమర్‌ను తీసుకుని బయటకు వెళ్తుంది అంజు మిగతా పిల్లలు. అమర్‌ రావడం రాథోడ్‌ చూస్తాడు.

రాథోడ్‌:  అమ్మో సార్‌ వచ్చారేంటి..? మిస్సమ్మ, మేడంతో మాట్లాడటం చూస్తారా..?

అప్పుడే బయటి నుంచి మనోహరి వస్తుంది. లాన్‌లో భాగీ మాట్లాడటం చూసి షాక్‌ అవుతుంది. అమర్‌ బయటకు రావడం చూసి భయపడుతుంది.

మను: భాగీ, ఆరు ఆత్మతో మాట్లాడుతున్నట్టు అమర్‌కు తెలిసిపోయిందా..? అది ఆరు ఆత్మ ఉన్నట్టు భాగీ అమరేంద్రతో చెప్పేసిందా..?

రాథోడ్‌: ఈ టైంలో పిల్లలను తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు సార్‌

అంజు: మా అమ్మను చూడటానికి

అని అంజు చెప్పగానే రాథోడ్‌ ఇరిటేటింగ్‌ గా ఫీలవుతాడు. ఆరు, భాగీ ఎవరినీ గమనించకుండా మాట్లాడుకుంటుంటారు. అమర్‌ రావడం గుప్త చూస్తాడు.

గుప్త: బాలిక నీ పతి దేవుడు నీ పిల్ల పిచ్చుకలు వస్తున్నారు..?

అంటూ గుప్త చెప్పగానే అమర్ ను చూస్తుంది ఆరు. వెంటనే షాకింగ్‌ గా అలాగే నిలబడిపోతుంది.

భాగీ: ఏంటక్కా ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయారు..? మాట్లాడు అక్కా

అమర్‌: భాగీ

భాగీ షాక్‌.. తిరిగి చూసి భయపడుతుంది.

అమర్: భాగీ ఎవరితో మాట్లాడుతున్నావు.. ఎవరున్నారు ఇక్కడ

భాగీ: ఎవ్వరూ లేరు నాలో నేనే మాట్లాడుకుంటున్నాను..

అమర్‌: నీలో నువ్వు మాట్లాడుకోవడం ఏంటి..? ఇదెప్పటి నుంచి

అంజు: నిజం చెప్పు మిస్సమ్మ నువ్వు అమ్మ ఆత్మతో మాట్లాడుతున్నావు కదా..? అమ్మ ఆత్మ ఇప్పుడు ఇక్కడే ఉంది కదా..?

భాగీ: లేదు అంజు నేను ఎవ్వరితోనూ మాట్లాడటం లేదు. నాలో నేనే మాట్లాడుకుంటున్నాను అదే నిజం

అమర్‌: భాగీ ఆర్‌ యూ ఓకే

భాగీ: ఐ యామ్‌ ఆల్‌వేస్‌ ఓకే అండి

అమర్‌: ఈ టైంలో ఇక్కడ ఉండటం మంచిది కాదు లోపలికి వెళ్దాం పదండి

అనగానే అందరూ లోపలికి వెళ్లిపోతారు. మనోహరి రిలాక్స్ అవుతుంది. భాగీ, అమర్‌కు నిజం చెప్పలేదని రిలీఫ్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!