Nindu Noorella Saavasam Serial Today Episode: బయటకు వెళ్లున్ అమర్ అనుమానంగా రాథోడ్‌ను పిలిచి యాదమ్మ గురించి ఎక్వైరీ చేయమని చెప్తాడు. మీరే అపాయింట్ చేశారు కదా మళ్లీ ఎంక్వైరీ ఎందుకని రాథోడ్ అడగ్గానే..
అమర్: యాదమ్మను తీసుకొచ్చింది నేను కాదు మనోహరి
రాథోడ్: ఆవిడను మనోహరి గారు తీసుకొచ్చారా..?
అమర్: అవును ఆ యాదమ్మ ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది. తన గురించి పూర్తి డీటెయిల్స్ నాకు కావాలి
రాథోడ్: ఇప్పుడే కనుక్కుంటాను సార్
అమర్: రాథోడ్ యాదమ్మను అడిగి కాదు.. తనకు తెలియకుండా కనుక్కోవాలి. మనం ఇలా ఎంక్వైరీ చేస్తున్నట్టు మనోహరికి కూడా డౌటు రాకూడదు..
రాథోడ్: అయితే కేర్ టేకర్ కంన్సల్టెన్సీ ఆఫీసుకు వెళ్లి ఎంక్వైరీ చేయాలి సార్.. యాదమ్మ చెప్పింది కదా తను అక్కడి నుంచే వచ్చానని..
అమర్: సరే అక్కడికే వెళ్లి ఎంక్వైరీ చేద్దాం పద
అంటూ ఇద్దరూ కలిసి వెళ్తారు. కేర్ టేకర్ ఆఫీసులోకి వెళ్లి యాదమ్మ గురించి ఎక్వైరీ చేస్తాడు రాథోడ్.
కేర్ టేకర్: తను మంచి కేర్ టేకరే కదా సార్ కుకింగ్, హౌస్ కీపింగ్, నర్సింగ్ అన్ని పనులు చేస్తుంది. ఈ ఫీల్డ్ లో చాలా ఎక్స్‌ఫీరియెన్స్ ఉంది సార్ ఆమెకు
రాథోడ్: తన డాక్యుమెంట్స్ ఉంటే చూపిస్తారా…? మేడం..
ఒక ఫైల్ రాథోడ్ కు ఇస్తూ..
కేర్ టేకర్: ఇందులో ఆవిడ ఐడీ ఫ్రూప్స్, ఎక్స్‌పీరియెన్స్ అన్ని వివరాలు ఉన్నాయి సార్.. సార్ ఎందుకు ఇంత డీటెయిల్ గా అడుగుతున్నారు ఆవిడ వల్ల ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందా..?
రాథోడ్: అదేం లేదు ఊరికే తెలుసుకుందామని
అని చెప్పి ఫైల్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఆ కేర్ టేకర్ రాథోడ్ ను ఫాలో చేస్తుంది. రాథోడ్ బయట కారు దగ్గర నిలబడిన అమర్ దగ్గరకు వెళ్తాడు.
రాథోడ్: సార్ యాదమ్మ రికార్డ్స్ చెక్ చేశాను. అన్ని క్లియర్‌గా ఉన్నాయి సార్. డౌటు పడాల్సిన అవసరం లేదు సార్
అమర్: అలా అని రిలాక్స్ అవ్వకు రాథోడ్.. ఆవిడ గురించి గ్రౌండ్ లెవెల్ లో నాకు తెలియాలి. నేటివ్ ప్లేస్‌కు వెళ్లి చెక్ చేయాలి
రాథోడ్: ఓకే సార్ నేను వెళ్లి కనుక్కుంటాను
అనగానే ఇద్దరూ కారెక్కి వెళ్లిపోతారు. ఇద్దరిని గమనించిన కేర్ టేకర్ వెంటనే ఈ విషయం మనోహరికి చెప్పాలని లోపలికి వెళ్లి ఫోన్ చేస్తుంది.
మనోహరి: ఆ చెప్పు ఎందుకు ఇప్పుడు ఫోన్ చేశావు..
కేర్ టేకర్: మేడం మీ గెస్సింగే రైట్ అయింది. యాదమ్మ గురించి ఎంక్వైరీ చేయడానికి రాథోడ్ అనే ఒక పర్సన్ వచ్చాడు
మను: వాడితో ఏం చెప్పావు…?
కేర్ టేకర్: మీరు చెప్పమన్నదే చెప్పాను మేడం.. యాదమ్మ పేరుతో ఫేక్ డ్యాక్యుమెంట్స్, ఎక్స్‌ఫీరియెన్స్ సర్టిఫికెట్స్ ఇవ్వడం మంచిది అయింది మేడం.. వాటిని చూపించి అతన్ని నమ్మించాను.
మను: వాడు నమ్మాడా..?
కేర్ టేకర్: నమ్మినట్టే ఉన్నాడు మేడం
మను: ఎంక్వైరీకి అతను ఒక్కడే వచ్చాడా..?
కేర్ టేకర్: ఆహా లేదు మేడం ఒక మిలటరీ అతను కూడా వచ్చాడు.. కానీ ఆయన బయటే ఉన్నాడు..
అని చెప్పగానే.. మనోహరి షాక్ అవుతుంది. అమరేంద్ర కూడా వచ్చాడా..? అని మనసులో అనుకుంటుంది. రిసెప్షనిస్ట్ భయపడుతుంటే.. మనోహరి వార్నింగ్ ఇస్తుంది. దీంతో రిసెప్షనిస్ట్ మరింత భయపడుతుంది. తర్వాత భాగీకి యాక్సిడెంట్ మిస్సయింది అని తెలుసుకున్న అమర్.. పంతులు చెప్పనట్టు ఇంట్లో అమ్మవారి పూజ చేస్తుంటారు. అయితే మనోహరి మాత్రం భాగీ రూంలోకి వెళ్లి చీర తీసుకుంటుంది. పూజను ఎలాగైన డిస్టర్బ్ చేయాలనుకుంటుంది. మనోహరి వెనకే వెళ్లిన ఆరు అంతా గమనించి వచ్చి కింద అమర్‌కు చెప్తుంది. కానీ అమర్‌కు వినిపించదు.. అయినా కొద్ది సేపట్లో ఎవరో ఏదో చెబుతున్నట్టు అమర్ పూజలోంచి లేచి పైకి వెళ్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!