Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీని చంపేందుకు ప్లాన్ చేసిన మనోహరి, రణవీర్ ఇంటికి వెళ్తుంది. మనోహరిని చూసిన రణవీర్ కాఫీ తీసుకుని వస్తాడు.
రణవీర్: కాఫీ తాగు మనోహరి
మను: నాకు కాఫీ తాగాలని లేదు
రణవీర్: ఏం విషం తాగాలని ఉందా..? దెబ్బ మీద దెబ్బ పడుతుంటే ఆశ చచ్చిపోతుందా..? ఆ ఆశతో పాటు నీ శ్వాస కూడా ఆపుకోవాలని ఉందా…?
మను: కాఫీ కప్పు తీసుకుని కింద వేసి పగులగొట్టి నా ఆశ ఎప్పటికీ చావదు. నేను బతికి ఉన్నంత వరకు నా ఆశ ఎప్పటికీ చావదు. నాకు అడ్డుగా ఉన్న భాగీని దాని కడుపులో ఉన్న బిడ్డను చంపే తీరతాను..
రణవీర్: కాఫీ కప్పు పగులగొట్టినంత ఈజీ కాదు ఆ భాగీని చంపడం
మను: మంచినీళ్లు తాగినంత ఈజీగా ఆ ఆరును చంపేశాను.. నాకు ఈ భాగీ ఓ లెక్కకాదు..
రణవీర్: అప్పుడు లెక్క వేరు ఇప్పుడు లెక్క వేరు మనోహరి
మను: ఎప్పటికీ నాది ఒక్కటే లెక్క రణవీర్. ఈరోజు భాగీ తనంతట తాను తన బిడ్డను చంపుకోవాలనుకుంది కాబట్టే అమర్ కాపాడాడు. కానీ రేపు భాగీని చంపడానికి నేను వేసే ప్లాన్ ఆ దేవుడు కూడా ఆపలేడు..
రణవీర్: నీకే ఇంకా అర్థం కావడం లేదు మనోహరి. నీ ఆశయం కోసం నువ్వే ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నీ ఆశ తీరలేదు. అంటే దాని అర్థం ఇక ఎప్పటికీ తీరదు అని నా మాట విను మనోహరి. కొన్ని అసాధ్యమైన పనులు ఉంటాయి. మనం వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఆల్ రెడీ నేను అమరేంద్రకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాను. అమరేంద్రను చంపాలని ప్రయత్నించి తన చేతిలో చావు దెబ్బలు తిన్నాను.. ఇప్పుడు నువ్వు నా వైఫ్ అని తెలిస్తే.. మనిద్దరిని కలిపి చంపేస్తాను.. అది జరగక ముందే మనం కోల్ కతా వెళ్లిపోదాం
మను: నేను నీలాగా పిరికిదాన్ని కాదు రణవీర్ నాకు చావంటే భయం లేదు.. నేను ఎక్కడికి పారిపోను.. చావైనా.. బతుకైనా అమర్ తోనే అని డిసైడ్ అయ్యాను. అది నెరవేరే వరకు పోరాడతాను. నువ్వు అన్నట్టు అది అసాధ్యం అయినా సరే చివరి క్షణం వరకు సాధ్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను
రణవీర్: పిరికితనం పెద్ద విషయం కాదు మనోహరి కొన్నింటికి భయపడి తీరాలి. ఒక్కసారి వెనకడుగు వేస్తేనే బతకగలం
మను: ఇంత దూరం వచ్చాక ఇంకా వెనకడుగు వేయడం ఏంటి రణవీర్… నా ఆశను నిరాశను చేసి ఆ అరుంధతి, అమరేంద్రకు భార్య అయి నలుగురు పిల్లలకు తల్లి అయింది. అది పోయింది అనుకుంటే ఆ స్థానంలోకి మళ్లీ ఈ భాగీ వచ్చింది. ఇప్పుడు ఇది కూడా తల్లి అవబోతుంది. దాని కడుపులో బిడ్డకు రోజు రోజుకు ఆయుష్సు పెరిగితే నా ఆయుష్సు తగ్గినట్టే.. భాగీని దాని బిడ్డను అంతం చేసి అమరేంద్రను నా సొంతం చేసుకునే వరకు నా అడుగు ముందుకే పడుతుంది. నీకు చేతనైతే నాకు సాయం చేయ్ అంతే కానీ చెత్త సలహాలు ఇవ్వకు.. చావు కబుర్లు చెప్పకు
అని మనోహరి వెళ్లిపోతుంది. నువ్వు మారవు మనోహరి నీ కర్మకు నీవు చావు మనోహరి అని రణవీర్ అనుకుంటాడు. తర్వాత మనోహరి ప్లాన్ చేసి చంభాను వేషం మార్పించి అమర్ ఇంట్లోకి భాగీకి కేర్ టేకర్ లా వచ్చేలా చేస్తుంది. అమర్ ఇంట్లోకి వచ్చిన చంభాను చూసి అంజు ఎక్కడో చూసినట్టు ఉందని అంటుంది. దీంతో చంభా భయంతో వణికిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!