Nindu Noorella Saavasam Serial Today Episode:  అమర్‌ను కిడ్నాప్‌ చేసిన రణవీర్‌.. చంపడానికి ప్రయత్నిస్తుంటే.. అప్పుడే అమర్‌లోకి ప్రవేశిస్తుంది ఆరు ఆత్మ. వెంటనే రణవీర్‌ తీసుకొచ్చిన రౌడీలను కొడుతుంది. ఆరు ఆత్మ అమర్‌లోకి ప్రవేశించిదని గుప్తు తెలుసుకుంటాడు.

Continues below advertisement

గుప్త: మనోహరిని పట్టుకోవాలని అమరేంద్ర వేసిన పథకాన్ని అరుంధతి తన చేజేతులారా పాడు చేయుచున్నది

ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మనోహరి అమర్‌ బాడీలోకి వెళ్లిన ఆరును చూసి భయంతో వణికిపోతుంది. ఆరు రౌడీలను కొడుతుంటే చంభా అక్కడి నుంచి పారిపోతుంది. రణవీర్‌ కత్తి తీసుకుని వెనక నుంచి పొడవటానికి వెళితే ఆరు, రణవీర్‌ను కొట్టి కత్తి లాక్కుని రణవీర్‌ను చంపబోతుంది. అప్పుడే గుప్త వస్తాడు. తన మంత్ర శక్తితో ఆరును ఆపేస్తాడు.

Continues below advertisement

ఆరు: గుప్త గారు వదలండి నన్ను..

గుప్త: బాలిక ఆగుము.. నీ పతి దేవుని శరీరము వదిలి బయటకు వచ్చేయుము..

ఆరు: గుప్తగారు వదలండి.. ఒక్కసారి వదిలేయండి ఫ్లీజ్‌..

అంటూ బతిమాలినా గుప్త వదలడు..

గుప్త: బాలిక మేము చెప్పేది వినుమ.. నువ్వు అతగాణ్ని చంపి ఆ కర్మను మూటగట్టుకోకుము.. నీ కర్మలన్నీ తీరి ఇప్పుడే నీవు కొత్త జన్మ ఎత్తడానికి రెడీ అయ్యావు.. ఈ సమయంలో మరో తప్పిదము చేయకుము బాలిక.

అంటూ గుప్త చెప్పగానే… ఆరు అమర్‌ బాడీలోంచి బయటకు వస్తుంది. ఇంతలో రణవీర్‌ అక్కడి నుంచి పారిపోతాడు. కట్‌ చేస్తే .. గార్డెన్‌ లో ఉన్న ఆరు ఎమోషనల్‌ అవుతూ.. భాగీని పిలుస్తుంది. ఆరు దగ్గరకు వచ్చిన భాగీ కూడా నిరాశగా ఆరును చూస్తుంది.

భాగీ: ఎందుక అక్కా నువ్వు అలా చేశావు.. నువ్వు తొందరపడ్డావు అక్కా.. నువ్వు ఆయనలోకి వెళ్లకుండా ఉండి ఉంటే ఆయనకు నిజం తెలిసి ఉండేది.. ఈ పాటికి మనోహరి గురించి ఆయనకు నిజం తెలిసి ఉండేది. ఆయనే మనోహరిని ఇంట్లోంచి వెళ్లగొట్టేవారు. ఈ ఇంటికి పట్టిన పీడ విరగడయ్యేది.. నువ్వు తొందరపడ్డావు అక్కా.. ఆయనను కిడ్నాప్‌ చేయడానికి ఆయనేం మామూలు వ్యక్తి కాదు కదా అక్కా.. ఆయన ప్లాన్‌ ప్రకారమే రణవీర్ కు దొరికారు. రణవీర్‌ కిడ్నాప్‌ చేస్తాడని ఆయనకు ముందే తెలుసు.. కిడ్నాప్‌ చేశాక అక్కడికి రణవీర్ వైఫ్‌ మనోహరి వెళ్లేది. ఆ నిజం ఆయనకు తెలిసేది.. ఇప్పుడు ఆయనకు నిజం తెలియకుండా అయిపోయింది

ఆరు:  సరే భాగీ ఆ విషయం వదిలేయ్‌.. నువ్వు నాకో సాయం చేయాలి. ఇది ఎవ్వరికీ చెప్పకూడదు.. చెప్పకుండా చేయాలి.. చేస్తావా..? చెల్లి..

భాగీ: ఏంటో చెప్పు అక్కా.. నేను ఎవ్వరికీ చెప్పను..

ఆరు: ఆయనకు కూడా ఈ విషయం తెలియకూడదు భాగీ… తెలిస్తే ఆయన నిన్ను ఈ పని చేయనివ్వడు

భాగీ: ఆయనకు చెప్పకుండా చేయాలా… ఇంతకీ ఏం చేయాలో చెప్పు అక్క..

ఆరు: రేపు ఉదయం తొమ్మిది గంటల  నుంచి పదకొండు గంటల మధ్య మంచి ఘడియలు ఉన్నాయి.. ఆ గడియల్లో నా ఆస్థికలు నదిలో నిమజ్జనం చేయాలి. అలా చేస్తేనే నాకు పునర్జన్మ ఉంటుందని గుప్త గారు చెప్తున్నారు.

భాగీ: నేను ఆ పని చేయలేను అక్కా.. అది కూడా ఆయనకు తెలియకుండా చేయాలంటే.. నా వల్ల కాదు అక్క.. సారీ అక్క నన్ను క్షమించు ఈ విషయంలో నేను నీకు హెల్ప్‌ చేయలేను..

ఆరు: అది కాదు భాగీ.. నేను చెప్పేది విను.. నేను మళ్లీ జన్మించాలి అంటే నా ఆస్థికలు నిమజ్జనం చేయాలి. ఆయనకు ఆస్తికలు గంగలో కలపడం ఇష్టం లేదు.. నువ్వే ఎలాగైనా కలపాలి భాగీ..

భాగీ: నా వల్ల కాదు అక్క

అనగానే భాగీ చేయి తన తల మీద పెట్టుకుని నువ్వు ఆస్థికలు గంగలో కలపకపోతే నా మీద ఒట్టే అంటుంది. దీంతో భాగీ షాక్‌ అవుతుంది. ఏడుస్తూ ఆరును హగ్ చేసుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!