Nindu Noorella Saavasam Serial Today November 2nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: మనుకు భాగీ వార్నింగ్ - రణవీర్ దగ్గరకు వెళ్లిన మను
Nindu Noorella Saavasam serial Today Episode November 2nd: మరోసారి కూడా మనోహరి, అమర్ నుంచి తప్పించుకోవడంతో భాగీ వార్నింగ్ ఇస్తుంది.

Nindu Noorella Saavasam Serial Today Episode: అక్కడే ఉంటే మిమ్మల్ని అమరేంద్ర చంపేస్తాడని వెంటనే పెట్టాబేడా సర్దుకుని వచ్చేయమని రణవీర్ చెప్పగానే మనోహరి, చంభా ఆలోచిస్తారు. బాల్కనీలోంచి తప్పించుకుని ఎవరి కంటా పడకుండా వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తారు. అనుకున్నట్టుగానే.. చీర పట్టుకుని చంభా కిందకు దిగుతుంది. మనోహరి దిగబోతుంటే అక్కడికి అమర్, భాగీ వస్తారు. వాళ్లను చూసిన మనోహరి భయంతో ఆగిపోతుంది.
భాగీ: (మనసులో) ఇన్నాళ్లకు నీ పాపం పండిందే.. ఇక నీ పని అయిపోయినట్టే
అమర్: ఏం చేశావు మనోహరి నువ్వు
భాగీ: (మనసులో) చాలా చేసిందండి లెక్కకు మించిన తప్పులు చేసింది.
అమర్: ఏం చేశావు మనోహరి నువ్వు మాకు తెలియకుండా మాకు చెప్పకుండా నువ్వేం చేశావు
భాగీ: (మనసులో) అక్కను చంపిందండి నన్ను కూడా చంపాలనుకుంది. చివరికి పిల్లలను కూడా పొల్యూట్ చేసింది
అమర్: ఆరు చెప్పిందని నిన్ను ఇంట్లో పెట్టుకున్నాను.. ఆరు స్నేహితురాలివి అని నిన్ను అతిథిలా కాకుండా మా ఇంటి సభ్యురాలిగా చూసుకున్నాను
భాగీ: (మనసులో) ఇంకా మాట్లాడతారేంటండి.. దాని చెంప పగులగొట్టకుండా
అమర్: కానీ నువ్వే చేశావు.. నీ శత్రువులెవరు..? నీ స్నేహితులెవరు.? నీ వెనక ఉన్నది ఎవరు..? నీకు ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి.? నీకు ఎవరెవరితో గొడవలు ఉన్నాయి.. అసలు ఎవరు నువ్వు
భాగీ: (మనసులో) ఇది హంతకురాలు అండి ఇది నీచమైన దుర్మార్గురాలు దీన్ని చంపినా పాపం లేదు
మనోహరి: అమర్ అది…
అమర్: మనోహరి నువ్వు నా దగ్గర ఏం దాస్తున్నావు..? నాకు నువ్వు చెప్పని విషయం ఏంటి..? ఏం చేశావు నువ్వు..
మను: అది అమర్..
భాగీ: (మనసులో) చెప్పవే రాక్షసి నువ్వు చేసిన పాపాలన్నీ ఒక్కోక్కటి చెప్పు
అమర్: రాథోడ్ తీసుకెళ్లిన ఎవిడెన్సులు అన్ని ఎవరో కాల్చేశారు.. ల్యాబ్‌ను ధ్వంసం చేశారు.. అక్కడ నీ ఫోటో ఉందట. అవన్నీ చేసింది ఎవరు..? ఎవరు నీ మీద పగ బట్టారు మనోహరి. ఎవరి నుంచో నీకు థ్రెట్ ఉంది. నువ్వు చేసిన పని ఏదో ఎవరికో ఎఫెక్ట్ అయింది. వాళ్లు నిన్ను చంపాలనుకుంటున్నారు.. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి.
భాగీ: (మనసులో) మనోహరికి ఈయన జాగ్రత్తలు చెప్తున్నారేంటి..?
అమర్: నా ఇంట్లో ఉన్నంతసేపు నువ్వు సేఫే మనోహరి ఇక్కడ నీకేం కాదు.. ల్యాబ్‌ను కాల్చేసింది ఎవరో..? వెళ్లి తెలుసుకుని వస్తాను భాగీ, మనోహరి జాగ్రత్త
అంటూ అమర్ వెళ్లిపోతాడు. మనోహరి హమ్మయ్య అని మనసులో అనుకుంటుంది.
మను: ( మనసులో) ఇదంతా రణవీర్ చేసి ఉంటాడా..? నన్ను కాపాడటానికి రణవీరే చేసి ఉంటాడు
భాగీ: మనోహరి నువ్వు మళ్లీ ఏదో చేసి తప్పించుకున్నావు అన్న మాట.. ఈసారి నువ్వు దొరికిపోతావు అనుకున్నాను మనోహరి.. కానీ దొరక్కుండా ఎవిడెన్స్ నాశనం చేశావన్న మాట. ఇంకెన్నాళ్లు ఇలా తప్పించుకుంటావు.. నీ పాపాలను పంచుకుంటున్న నీ పార్ట్ నర్ నిన్ను ఎన్నాళ్లిలా కాపాడతాడు. ప్రతిసారి నీ టైమే నడుస్తుంది అనుకోకు.. నీకు బ్యాడ్ టైం వస్తుంది. తప్పకుండా వస్తుంది
అని తిట్టి భాగీ వెళ్లిపోతుంది. కింద నుంచి చంభా పిలవగానే.. మనోహరి నేను అటు ఉంచి వస్తాను ఉండు వెంటనే మనం రణవీర్ దగ్గరకు వెళ్లాలి అంటూ మనోహరి కిందకు వెళ్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















