Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇలా ఒంటరిగా నిలబడి ఆకాశంలోకి చూస్తూ నా ఆరుతో మాట్లాడుతుంటాను. అని చెప్పి నవ్వెందుకు బయటకు వచ్చావు అని అంజును అడుగుతుంది మనోహరి. నేను స్కెచ్ వేసుకున్న అమ్మ ఫోటో మిస్సమ్మ తీసుకుని బయటకు వచ్చింది. అందుకే వచ్చానని అంజు చెప్పడంతో.. ఆ ఫోటో గురించి అడగొద్దని అమాయకంగా చెప్తుంది మనోహరి. నిజం తెలిస్తే నువ్వు మిస్సమ్మకు శాశ్వతంగా దూరం అవుతావని అంటుంది.
ఆరు: అంజు వద్దు అంజు దాని మాటలు అస్సలు వినకు. నువ్వు మోసపోతావు అంజు నువ్వు ముందు ఇంట్లోకి వెళ్లిపో నాన్నా..
అంజు: అంటీ అమ్మ ఫోటో గురించి మాట్లాడుతుంటే మీరెందుకు ఏదేదో మాట్లాడుతున్నారు. మిస్సమ్మ అమ్మ ఫోటో బయటకు ఎందుకు తెచ్చిందో చెప్పండి.
మనోహరి: నీకు నిజం చెప్పి నిన్ను బాధపెట్టలేను అంజు.. నిజాన్ని చూసి తట్టుకునే నిజం నీకు లేదు అంజు.. పద మనం లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం పద.. అంజు నువ్వేం చూడలేదు.. ఇక్కడే లేదు పద మనం లోపలికి వెళ్దాం.
అంజు: అమ్మ ఫోటోను ఇలా ఎవరు చేశారు ఆంటీ..
మనోహరి: నేను చెప్పలేను అంజు. చెప్పి నీ నమ్మకాన్ని నేను పాడు చేయలేను.
అంజు: చెప్పమని చెప్తున్నాను కదా ఆంటీ.. అమ్మ ఫోటోను ఇలా ఎవరు చేశారు.
మనోహరి: మిస్సమ్మ.. అంజు.. ఇందాక ఆరు ఫోటోను కాలితో తొక్కుతుంటే నేను ఆపబోయాను. నన్ను నోటికి వచ్చినట్టు తిట్టింది. ఆరు పేరు కూడా ఇంట్లో వినబడకుండా చేస్తానని అది నా మనసు విరిగిపోయింది తెలుసా..?
అంజు: ఆ మిస్సమ్మను వదిలేదు లేదు. అమ్మ విషయంలో మిస్సమ్మ చేసే పనులు ఎప్పటికీ మర్చిపోలేను.
అంటూ అంజు వెళ్లిపోతుంది.
మనోహరి: ఆరు చూశావా మొత్తం హమ్మయ్యా.. నా పని సగం పూర్తయింది ఆరు. నేను వెలిగించన చిచ్చుబుడ్డి ఎంత గట్టిగా పేలుతుందో ఏంటో..? నీకు ఏవో ప్లాన్స్ ఉంటాయి కదా ఆ ప్లాన్స్ అన్ని ఈ బుడ్డ చిచ్చు బుడ్డి ఎలా పాడు చేస్తుందో చూస్తూ ఉండు
అని చెప్పి మనోహరి వెళ్లిపోతుంది. తర్వాత రోజు ఇంట్లో సాంబ్రాణి వేసి వంట చేస్తుంది భాగీ. వాకింగ్ కు వెళ్లిన శివరాం ఇంటికి వచ్చి ఎంత ప్రశాంతంగా ఉంది ఇంట్లో అనుకుంటాడు. నిర్మల వస్తుంది. ఇద్దరికీ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది భాగీ.
నిర్మల: మనం ఏ పుణ్యం చేశామనండి మనకు ఇంత అదృష్టం దొరికింది.
శివరాం: నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నిర్మల.
నిర్మల: మిస్సమ్మ గురించి అండి.
శివరాం: మంచి అమ్మాయి నిర్మల. చక్కటి బుద్ది. గొప్ప సంస్కారం. శత్రువుకైనా మంచి జరగాలని కోరుకునే మంచి అమ్మాయి.
అని శివరాం చెప్పగానే నిర్మల ఏడుస్తూ.. పూజ చేసిన రోజు రాత్రి మిస్సమ్మ తనను కాపాడిన విషయం చెప్తుంది నిర్మల. దీంతో శివరాం షాక్ అవుతాడు. భాగీ దగ్గరకు వెళ్లి.. భాగీ చేతులు పట్టుకుని ఏడుస్తాడు. భాగీ ఏమైంది మామయ్యా అని అడుగుతుంది. నిర్మల వచ్చి ఆరోజు రాత్రి జరిగింది చెప్పాను అంటుంది. ఎవరికీ చెప్పొద్దని చెప్పాను కదా అత్తయ్య అంటుంది భాగీ. దీంతో శివరాం.. భాగీకి థాంక్స్ చెప్తాడు. ఇప్పుడే వెళ్లి అమర్ తో మాట్లాడతానని శివరాం అంటాడు. పైన కాఫీ తాగుతున్న అమర్ దగ్గరకు శివరాం వెళ్తాడు.
అమర్: గుడ్ మార్నింగ్ నాన్నా.. ఏమైనా మాట్లాడాలా నాన్నా..
శివరాం: మాట్లాడాలి అమర్.. చాలా మాట్లాడాలి. చాలా రోజుల ముందే మాట్లాడాల్సింది. ఇప్పటికైనా మాట్లాడదామని వచ్చాను. మిస్సమ్మ ఎవరు అమర్.
అమర్: అర్థం కాలేదు నాన్నా..
శివరాం: అర్థం అవుతుంది. కానీ మిస్సమ్మకు ఈ ఇంటికి సంబంధం ఏంటి..?
అమర్: అది.. ఈ ఇంటి కోడలు..
శివరాం: ఓ నీకు ఇంకా గుర్తు ఉందా..? అమర్.. నీకింకా నీ పిల్లలకు కేర్ టేకర్ అని గుర్తే ఉందనుకున్నాను. నువ్వు నీ భార్యను నువ్వు ప్రేమగా చూసుకున్నావు. కానీ మిస్సమ్మకు ఎందుకు అన్యాయం చేస్తున్నావు. మిస్సమ్మతో కొత్త జీవితం మొదలుపెట్టు.
అని చెప్పి శివరాం వెళ్లిపోతాడు. దీంతో అమర్ ఆలోచనలో పడిపోతాడు. దూరంగా వస్తున్న మిస్సమ్మను చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!