Nindu Noorella Saavasam Serial Today Episode: గార్డెన్‌లో పుట్ బాల్ అడుతున్న అంజు అక్కడే కూర్చున్న భాగీ దగ్గరకు వెళ్తుంది. ఎందుకు అంజు నువ్వు గేమ్ ఆడవా అని భాగీ అడిగితే.. ఆడనని నా చెల్లితో ఆడుకుంటానని చెప్తుంది. ఎలా ఆడుకుంటావని భాగీ అడగ్గానే.
అంజు: మిస్సమ్మ నీ కడుపులో చెల్లి నాకు హాయ్ చెప్పింది తెలుసా..?
భాగీ: నాక్కూడా నిన్న జాగ్రత్త అని చెప్పినట్టు వినిపించింది అది భ్రమ అంటావా..?
అంజు: భ్రమ కాదు నేను హయ్ బుజ్జి అని చెప్పగానే.. హాయ్ అక్కా అని నాకు చెప్పింది
భాగీ: నిజమా.. అయితే ఇప్పుడు పిలువు చూద్దాం
అంజు: నువ్వు పిలువు ఎవరికి పలుకుతుందో చూద్దాం
భాగీ: హాయ్ బంగారు తల్లి..(బేబీ పలకదు)
అంజు: ఇప్పుడు నేను పిలుస్తాను హాయ్ బంగారం (బేబీ పలకదు)
భాగీ: ఇది నీ కన్నా అల్లరి పిల్లలా ఉంది
అంజు: ఏం కాదు నా చెల్లి చాలా మంచిది
అనంద్ బాల్‌ను గట్టిగా కిక్ కొట్టగానే.. ఆ బాల్ మిస్సమ్మ వైపు వస్తుంది. కడుపులో బేబీ అమ్మా బాల్ అంటుంది. అది అంజు, భాగీ వింటారు. ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇంతలో బాల్ దగ్గరకు రాగానే అంజు పట్టుకుంటుంది. అది చూసిన పిల్లలు పరుగెత్తకుంటూ భాగీ దగ్గరుక వస్తారు.
భాగీ: విన్నావా అంజు
అంజు: నీకు వినిపించిందా..?
ఆనంద్: సారీ మిస్సమ్మ నీకు బాల్ తగల్లేదు కదా
భాగీ: లేదు అనంద్
అమ్ము: చూసుకోవాలి కదరా..? బాల్ తగిలి ఉంటే మిస్సమ్మకు ఎంత ప్రాబ్లమ్ అయ్యుండేది..
ఆకాష్: నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను.. ఇటువైపు బాల్ కిక్ చేయకురా
అంజు: గొడవ పడకండి మిస్సమ్మకు ఏం కాదు పైగా మాకు ఒక క్లారిటీ వచ్చింది.
అమ్ము: క్లారిటీ ఏంటి
అంజు: అది..
భాగీ: అంజు చెప్పొద్దు
అంజు: ఎందుకు చెప్పొద్దు మిస్సమ్మ
భాగీ: నువ్వు ఇలా చెప్తే వాళ్లు నమ్మరు.. మనల్ని ఆట పట్టిస్తారు.
ఆనంద్: ఏంటి ఆ గుసగుసలు మీరు మాతో ఏంటో దాచేస్తున్నారు
ఆకాష్: ఏంటో చెప్పొచ్చు కదా అంజు
అంజు: ఏం లేదు మీకు చెప్పేది కాదులే.. ఇదిగో బాల్.. మిస్సమ్మ నువ్వు ఇంట్లోకి వెళ్లు
అమ్ము: అవును మిస్సమ్మ మళ్లీ పొరపాటున బాల్ తగులొచ్చు.. పైగా డాక్టర్ వచ్చే టైం అయింది కదా..?
అని చెప్పగానే అందరూ కలిసి లోపలిక వెళ్లిపోతారు.
అని చెప్పగానే.. మిస్సమ్మ వెళ్లబోతూ కింద పడబోతుంటే.. పిల్లలు నలుగురు కలిసి మిస్సమ్మను లోపలికి తీసుకెళ్తాడు. తర్వాత డాక్టర్ వస్తుంది. భాగీని హాల్లో కూర్చోబెట్టి టెస్ట్ చేస్తుంది.
డాక్టర్: ఇక్కడ బిడ్డ తగులుతున్నట్టు ఏమైనా అనిపిస్తుందా..?
భాగీ: లేదు డాక్టర్..
డాక్టర్: ఇక్కడ ఏమైనా తన్నుతున్నట్టుగా ఉందా..?
భాగీ: లేదు డాక్టర్..
అంజు: తగులుతున్నట్టు ఏమీ ఉండదు మాట్లాడుతున్నట్టు ఉంటుంది..
డాక్టర్: ఏంటి మాట్లాడుతున్నట్టా..?
అంజు: అవును డాక్టర్ ఒకసారి మీ స్టతస్కోప్ ఇవ్వండి.. మిస్సమ్మ ఇది తీసుకో.. నీ చెవుల్లో పెట్టుకుని బేబీ సౌండ్ విను
అని చెప్తూ అంజు స్టెతస్కోప్ ఇవ్వగానే.. భాగీ తన చెవుల్లో స్టెతస్కోప్ పెట్టుకుని పొట్ట మీద ఉంచుతుంది. లోపల బేబీ మాట్లాడుతుంది. అమ్మా నేను ఉండగా నీకు ఏమీ కానివ్వను నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను అమ్మా అని చెప్తుంది. ఆ మాటలు విన్న భాగీ ఎమోషనల్ అవుతుంది. డాక్టర్ షాకింగ్ గా చూస్తుంది. మరోవైపు యమలోకంలో మాయాదర్పణంలో అంతా చూస్తున్న ఆరు దగ్గరకు యముడు వచ్చి భాగీకి పుట్టబోయే బిడ్డ పురిట్లోనే చనిపోతుందని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో ఆరు ఏడుస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!