Nindu Noorella Saavasam Serial Today Episode: యమలోకంలో మాయాదర్పణంలో కింద హాస్పిటల్‌లో ఏం జరుగుతుందో చూడమని ఆరుకు చెప్తాడు గుప్త. అక్కడ నా వాళ్లు బాధపడటం తప్పా ఇంకేం ఉంది గుప్త గారు అంటుంది ఆరు.
గుప్త: సరిగ్గా చూడుము బాలిక అక్కడ నీ పిల్ల పిచ్చుకలు కనిపిస్తున్నారా..?
ఆరు: అవును కనిపించడం లేదు ఇంతకీ నా పిల్లలు ఎక్కడ గుప్త గారు
అని అడగ్గానే.. గుప్త వెంటనే గుడిలో హోమం చేస్తున్న పిల్లలను చూపిస్తాడు.
గుప్త: నీ పిల్ల పిచ్చుకలు హోమం చేస్తున్నారు..
ఆరు: మా పిల్లుల సరే పక్కనే ఉన్న ఆ పిల్లలు ఎవరు గుప్త గారు
గుప్త: వాళ్లు నీవు పెరిగిన అనాథ ఆశ్రమం పిల్లలు
ఆరు: వాళ్లేం చేస్తున్నారు అక్కడ
గుప్త: నీ సోదరి రుణం తీర్చుకుంటున్నారు.. అర్థం కాలేదా బాలిక. దైవం మానుష రూపేణా అంటారు. ఆ పిల్లల ఆకలి దప్పికలు తీర్చుటకు నీ సోదరి సహాయం చేసినది. అమ్మలా అన్నం పెట్టిన నీ సోదరికి తమ వంతు దైవ సహాయం చేస్తున్నారు. నీ కన్నబిడ్డలతో పాటు ఆ పిల్ల పిచ్చుకలు కూడా నీ సహోదరి కోసం ప్రార్థిస్తున్నారు
ఆరు: వాళ్ల ప్రయత్నం ఫలిస్తుందా
గుప్త: రావణుడి కోసం రాముడు వచ్చినప్పుడు కంసుడి కొరకు కృష్ణుడు వచ్చినప్పుడు మానవుడి కొరకు మాధవుడు రాడా తల్లి.. మానవ సంకల్పానికి దైవ సహాయం తోడైనప్పుడు ఎటుల ఉండునో ఇప్పుడు వీక్షించుము బాలిక. జరగబోయే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చూడుము బాలిక
అనగానే ఆరు చూస్తుంటుంది. స్పృహలో ఉన్న భాగీ కదులుతుంది. డాక్టర్ వచ్చి చూసి ట్రీట్‌మెంట్ ఇస్తాడు. గుడి నుంచి వచ్చిన పిల్లలు భాగీకి బొట్టు పెడతారు. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అప్పుడే రామ్మూర్తి ఇంట్లో ఉన్న మనోహరి, యాదమ్మకు ఏం కాలేదా..? అని అనుమానంగా అడుగుతాడు.
ఆనంద్: డాడ్ వచ్చి మిమ్మల్ని సేవ్ చేసే వరకు వాళ్లు ఎక్కడున్నారు..?
ఆకాష్: వాళ్లు ఇంట్లోనే ఎక్కడో ఉండి పాయిజన్ గ్యాస్ పీల్చుకోకుండా ముక్కు నోరు మూసుకున్నారేమో
అంజు: అయితే మనోహరి ఆంటీ, యాదమ్మ మాతో పాటు ఇంట్లోనే ఉన్నా మమ్మల్ని సేవ్ చేయడానికి ఎందుకు ట్రై చేయలేదు
రామ్మూర్తి: ఇందులో ఏదో మర్మం ఉంది. బ్లాక్ మ్యాన్ పేరును అడ్డం పెట్టుకుని ఇది ఎవరో చేసిన దాడిలా అనిపిస్తుంది
అమర్ బయటకు వెళ్లి మనోహరి ని ఎక్కడికి వెళ్లిపోతున్నావు అని అడుగుతాడు.
మను: మిస్సమ్మకు బాగయింది కదా అమర్ అందుకే గుడికి వెళ్లి దండం పెటుకుందామని వెళ్తున్నాము
అమర్: అయితే సరే కానీ ఇంట్లో గ్యాస్ వస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు.?
మను: అమర్ నేను ఆ టైంలో రూంలో ఉన్నాను అమర్. రూం క్లోజ్‌గా ఉండటంతో స్మోక్ నా రూంలోకి రాలేదు. ఆ తర్వాత భాగీ అరుపులు వినిపించాయి. ఏంటా అని రూం తెరచి చూస్తే.. అప్పటికే స్మోక్ అంతా నిండిపోయింది. అదేదో ప్రమాదకరమైన స్మోక్ లా ఉందని నేను నోరు ముక్కు మూసుకున్నాను.. ఆ స్మోక్ లో భాగీ అంజు ఎక్కడున్నారో అసలు నాకు కనిపించలేదు అమర్.. అంతే..
అమర్: ఆ టైంలో నువ్వు ఎక్కడున్నావు యాదమ్మ
చంభా: నేను మేడ పైన ఉన్నాను సార్
అమర్: నువ్వు భాగీకి కేర్ టేకర్‌గా వచ్చావు తన పక్కన ఉండకుండా టెర్రస్ పైన ఏం చేస్తున్నావు..
చంభా: బట్టలు ఆరేయడానికి వెళ్లాను సార్.. అప్పటికే ఇంట్లోంచి పొగలు వస్తున్నాయని చూసి కిందకు వచ్చాను ఆ పొగల్లో నాకు ఏవీ కనిపించ లేదు సార్..
అమర్: నిన్ను ఎప్పుడూ భాగీ పక్కనే ఉండమని చెప్పాను. కానీ నువ్వు ఆ పని తప్పా మిగతా పనులన్నీ చూస్తున్నావు..
చంభా: క్షమించండి సార్ నేను అప్పుడే పైకి వెళ్లాను.. నేను కింద ఉంటే ఇలా జరగనిచ్చేదాన్నే కాదు
అమర్: నీకు శాలరీ ఇస్తుంది భాగీని సేఫ్‌గా చూసుకుంటావని ఇంకొకసారి తనని వదిలి ఎటూ వెళ్లకు
చంభా: అలాగే సార్ ఎటూ వెళ్లను
అమర్ వెళ్లిపోతాడు.
మను: చంభా ఆ చూపులకు అర్థం ఏంటి..?
చంభా: ఇంకా అర్థం కాలేదా..? అమ్మా మనం చెప్పింది తను నమ్మలేదు. మన మీద డౌటు వచ్చింది.
అంటూ మనోహరిని కొద్ది రోజులు భాగీని చంపే ప్రయత్నాన్న పక్కకు పెట్టమని ఆ బ్లాక్ మ్యాన్ సంగతి చూడమని చెప్తుంది. అయితే బ్లాక్ మ్యాన్ సంగతి అమర్ చూస్తాడని మనోహరి ఆలోచిస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!