Nindu Noorella Saavasam Serial Today Episode:  స్కూల్‌ కు వెళ్లడానికి పిల్లలందరూ రూంలో రెడీ అవుతుంటే అంజు మాత్రం ఏదో ఆలోచిస్తూ అలాగే ఉండిపోతుంది. దీంతో ముగ్గురు పిల్లలు అంజును ఆశ్చర్యంగా చూస్తుంటారు.

Continues below advertisement

ఆనంద్: ఏంటి అంజు స్కూల్‌కు టైం అవుతుంటే రెడీ కాకుండా కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు

అంజు: నేను ఈ రోజు స్కూల్ కు రావడం లేదు అన్నయ్య

Continues below advertisement

ఆకాష్‌: ఏ ఎందుకు రావు అంజు..

అంజు: రావాలనిపించడం లేదు

అమ్ము: ఏ ఇంట్లో ఉండి ఏం చేస్తావు

మను డోర్‌ దగ్గరకు వచ్చి పిల్లల మాటలు చాటు నుంచి వింటుంది.

అంజు: ఈ రోజు అంతా మిస్సమ్మకు తోడుగా ఉంటాను

మను షాక్‌

మను: ఇదేంటి మిస్సమ్మకు తోడుగా ఇంట్లోనే ఉంటానంటుంది

ఆనంద్‌: మిస్సమ్మకు తోడుగా కేర్‌ టేకర్‌ యాదమ్మ ఉంది కదా అంజు..

ఆకాష్‌: మనోహరి ఆంటీ కూడా ఇంట్లోనే ఉంటుంది కదా..? మళ్లీ మిస్సమ్మకు నీ తోడు ఎందుకు..?

అంజు: ఎందుకో తెలియదు ఈ రోజు మిస్సమ్మను వదిలి ఎక్కడికి రావాలనిపించడం లేదు

మను: ( మనసులో) ఎవరో చెప్పినట్టు ఇది ఇంట్లోనే ఉంటానంటుంది ఏంటి..? ఆరు పైకి వెళ్లిందా..? లేక దీని ఒంట్లో ఏమైనా దూరిందా..?

అమ్ము: మరి స్కూల్‌ లో మిస్‌ అడిగితే ఏం చెప్పాలి

అంజు: నాకు ఒంట్లో బాగా లేదు అందుకే స్కూల్‌కు రాలేదు అని చెప్పండి

ఆకాష్‌: మాకు నీలా అబద్దం చెప్పడం రాదే..

అమ్ము: మాకు నీలా ఉన్నవి లేనట్టు చెప్పడం రాదు

అంజు:  అలా చెప్పకపోతే నేను స్కూల్‌ మానేశానని చెప్పండి. నాకు టీసీ ఇస్తా అంటే ఇవ్వమని చెప్పండి.. అంతే కానీ నేను రానని చెప్పండి..

మను: ( మనసులో) ఏమైంది దీనికి ఎందుకు ఇంత కరాకండిగా మాట్లాడుతుంది.

ఆనంద్‌: ఏమైంది అంజు ఎందుకు రానంటున్నావు

అంజు: ఏమో తెలియదు అన్నయ్య ఉదయం నుంచి అమ్మే గుర్తుకు వస్తుంది. ఈ రోజంతా మిస్సమ్మ పక్కనే ఉండాలనిపిస్తుంది. ఫ్లీజ్‌ మీరు కూడా నాతో పాటు మిస్సమ్మకు తోడుగా ఉండండి.

మను: ( మనసులో) మీ అందరూ ఇంట్లో  ఎందుకే భాగీతో పాటు మీరు కూడా పైకి పోవడానికా..?

ఆనంద్‌: సారీ అంజు నాకు ఈ రోజు ఇంపార్టెంట్‌ క్లాసులు ఉన్నాయి. వెళ్లి తీరాలి

అమ్ము: నాకు ఎగ్జామ్‌ ఉంది అంజు నేను కూడా వెళ్లాలి..

ఆకాష్‌: నాకు ఇంపార్టెంట్‌ క్లాస్‌ ఉంది అంజు

ఆనంద్: సరే నేను మీ మిస్‌ ఏదో ఒకటి చెప్తానులే అంజు నువ్వు ఇంట్లోనే ఉండు మేము స్కూల్‌కు వెళ్లి వస్తాము..

అంజు: థాంక్యూ ఆనంద్‌.. సరే బై

పిల్లలు బయటకు వస్తుంటే.. మనోహరి పక్కకు వెళ్తుంది.

మను: ఎవరో చెప్పినట్టు ఈ అంజు స్కూల్‌కు వెళ్లకుండా ఆగిపోయింది. ఈ రోజు భాగీ దాని కడుపులో బిడ్డతో పాటు ఆరు కడుపును పుట్టిన బిడ్డ కూడా చావాలని రాసిపెట్టి ఉందేమో..? ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు

అని మనసులో అనుకుంటూ నవ్వుకుంటుంది మనోహరి. ఇంతలో పిల్లలు ముగ్గురే కిందకు దిగి రావడం కిచెన్‌ లోంచి భాగీ చూసి షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!