Nindu Noorella Saavasam  Serial Today  Episode:   పిల్లలు బలవంతం చేయడంతో అనామిక, భాగీకి కాల్ చేస్తుంది. రూంలోకి వెళ్తున్న భాగీ ఫోన్‌ సౌండ్ విని ఈ టైంలో ఎవరు చేస్తుంటారబ్బా అనుకుంటూ తిరిగి తన రూంలోకి వెళ్లి ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తుంది.

భాగీ: నిన్న కాల్‌ చేస్తే ఇవాళ కాల్‌ చేస్తారా..? పోనీలే ఇవాళైనా చేశారు

అనామిక: భాగీ ఒక్క నిమిషం నేను చెప్పేది విను

భాగీ: ఏమైంది అక్కా ఎందుకు అదోలా మాట్లాడుతున్నారు

అనామిక: నువ్వు ఇక మీదట ఈ నెంబర్‌కు కాల్ చేయకు

భాగీ: ఎందుకు అక్కా..? ఏమైంది

అనామిక: నువ్వు ఇక నా ఫోన్‌ కోసం వెయిట్‌ చేయకు భాగీ.. నేను కలిసే క్షణం కోసం ఎదురు చూడను. లైఫ్‌లో ఏం జరిగినా ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ముందుకు అడుగు వేయి.. నేను ఎక్కడున్నా..? నువ్వు సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను. బై

భాగీ: అక్కా ఒక్క నిమిషం కాల్‌ కట్‌ చేయకండి.. హలో

అమ్ము: అమ్మ చెప్పినట్టు నువ్వు డాడీతో హ్యాపీగా ఉండు భాగీ

అందరూ షాక్‌ అవుతారు. అమ్ము సారీ చెప్తుంది.

భాగీ: డాడీ ఏంటి.. మీరు ఏం మాట్లాడుతున్నారు

అనామిక:  నేను పిల్లలతో మీ డాడీతో హ్యాపీగా ఉండమని చెప్పాను

అని అనామిక కాల్‌ కట్ చేస్తుంది. అసలు ఏమైంది అక్కకు అంటూ భాగీ ఆలోచిస్తుంది. తర్వాత తన ఫ్రెండ్‌ హర్షకు కాల్ చేస్తుంది భాగీ.

భాగీ: హలో హర్ష ఎలా ఉన్నావు..

హర్ష: నేను బాగానే ఉన్నాను కానీ నువ్వేంటి కనీసం పెళ్లికి కూడా చెప్పలేదు.

భాగీ: నా పెళ్లి ఎలా జరిగిందో నాకే తెలియదు హర్ష నీకే కాదు ఎవ్వరికీ చెప్పలేకపోయాను సారీ..

హర్ష: సరేలే కానీ ఇంతకీ ఎదుకు కాల్‌ చేశావు..

భాగీ: ఏం లేదు హర్ష నాకొక హెల్ప్‌ కావాలి. నేను ఒక నెంబర్‌ ఇస్తాను అది ఎక్కడుందో లోకేషన్‌ ట్రేస్‌ చేయాలి.

హర్ష: అది మీ ఆయన్ని అడిగితే చేస్తాడు. కదా

భాగీ: అయ్యో ఆయన్ని అడిగితే రూల్స్‌ అంటూ లేట్‌ చేస్తాడు. నాకు అర్జెంట్‌ గా ఆ లోకేషన్‌ కావాలి.

హర్ష: సరే నెంబర్‌ పంపించు

అని హర్ష చెప్పగానే భాగీ నెంబర్‌ పంపిస్తుంది. లొకేషన్‌ ట్రేస్‌ చేశాక కాల్ చేస్తా అంటాడు హర్ష. సరే అంటుంది భాగీ. ఇంతలో అనామిక వచ్చి ఏంటి సంతోషంగా ఉన్నావు అని అడగ్గానే నిజం చెప్పబోయి ఆగిపోతుంది భాగీ. ఒక గంట తర్వాత నాకు ఓ క్లారిటీ వస్తుంది అప్పుడు చెప్తాను అంటూ వెళ్లిపోతుంది భాగీ. గంట తర్వాత హర్ష కాల్‌ చేస్తాడు.

భాగీ: చెప్పు హర్ష నెంబర్‌ ట్రేస్‌ చేశావా..? అది లోకేషన్‌ ఎక్కడ ఉంది..?

హర్ష: కనుక్కున్నాను భాగీ.. ఆ లోకేషన్‌ కొడైకెనాల్‌ లోనే చూపిస్తుంది.

భాగీ: అవునా.. కొడైకెనాల్‌ లో ఎక్కడుందో ఎగ్జాక్ట్‌ గా చెప్పగలవా..?

హర్ష: నువ్వు ఆలాగే లైన్‌ లో ఉండు నేను నీకు గైడ్‌ చేస్తాను.. ఎగ్జాక్ట్‌ లోకేషన్‌ కు వెళ్లొచ్చు

భాగీ: అయితే చెప్పు వెళ్తాను

అంటుంది భాగీ.. హర్ష డైరెక్షన్‌ ఇస్తుంటే భాగీ వెళ్తుంది. చివరకు భాగీ తాము ఉంటున్న ఇంటి ముందే వచ్చి ఆగిపోతుంది. హర్ష కూడా ఫోన్‌ లో అక్కడే నీ ఎడమ  పక్కన  ఇంట్లోనే ఉంది ఆ ఫోన్‌ అని చెప్తాడు. భాగీ షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!