Nindu Noorella Saavasam Serial Today Episode:  పోలీస్‌ కేసు వద్దని చెప్పిన రణవీర్‌ను అమర్‌ తిడతాడు. ఈ సారి తన సత్తా ఏంటో వాళ్లకు తెలిసేలా చేస్తానంటాడు. దీంతో రణవీర్‌ బయపడుతుంటాడు. ఇంతలో శివరాం వాళ్లను ఎలా పట్టుకుంటావని అడుగుతాడు. వాళ్లు కాదు ఈసారి ఆట నేను మొదలు పెడతాను అని చెప్తాడు అమర్‌. తర్వాత అనామిక కిచెన్‌లోకి వెళ్లి పాలు గ్లాసులో పోస్తుంటే కళ్లు బ్లర్‌గా కనబడతాయి. దీంతో పాలు కిందపోతుంటాయి. నిర్మల వస్తుంది.     

నిర్మల: అనామిక ఏం చేస్తున్నావు పాలు అన్ని కింద పోతున్నాయి

అనామిక: ఆంటీ చూసుకోలేదు.

నిర్మల:  అనామిక ఏమైందమ్మా..? ఏంటి అలా చూస్తున్నావు

అనామిక: ఏం లేదు ఆంటీ.. అది..

నిర్మల: వాటర్‌ వరల్డ్‌ లో జరిగిన దానికి బాగా హడలి పోయినట్టు ఉన్నావు కదా.. సరే నువ్వు వెళ్లి కూర్చోపో అంజు పాపకు పాలు నేను ఇస్తానులే

అనామిక: అలాగే ఆంటీ

అని చెప్పి అనామిక బయటకు వెళ్తుంది. కళ్లు బ్లర్‌గానే ఉంటాయి. ఇంతలో గుప్త వస్తాడు. గుప్తా కూడా బ్లర్‌గానే కనిపిస్తుంటాడు.

అనామిక: గుప్త గారు మీరేనా..?

గుప్త:  నేనే బాలిక

అనామిక:  ఏం జరుగుతుంది గుప్త గారు నా కళ్లు ఎందుకు బ్లర్‌ గా కనిపిస్తున్నాయి

గుప్త:  నువ్వు ఈ లోకం విడిచే సమయం ఆసన్నమైంది బాలిక

అనామిక:  ఏం మాట్లాడుతున్నారు గుప్త గారు

గుప్త:  పౌర్ణమి రాబోతుంది బాలిక. నువ్వు ఈ బాలిక దేహము నందు ఉండటం వల్లన ముందు దృష్టి తగ్గును.. తదుపరి వినికిడి తగ్గును. అటు పిమ్మట గాత్రము పోవును

అనామిక:  మీరు నాకు కనిపిస్తున్నారు గుప్త గారు.. నాకు మళ్లీ చూపు వచ్చింది.

గుప్త:  నీ ఆత్మ ఈ దేహము నందు ఉండుట వల్లన వచ్చు మార్పులు ఇప్పుడే మొదలైనవి బాలిక. అందులకే నీకు మరలా దృష్టి వచ్చినది. కానీ పౌర్ణమి దగ్గర పడిన కొలది నీ దృష్టి, నీ వినికిడి, నీ గాత్రము శాశ్వతంగా పోవును

అనామిక: గుప్తు గారు ఏంటి మీరు చెప్తున్నది. నిజమా..

గుప్త:  అవును బాలిక పౌర్ణమి రోజున నువ్వు ఈ దేహమును విడవకున్నచో.. ఈ బాలిక ప్రాణములు పోవును.. నీవు కాపాడిన ప్రాణము పోవుటకు నువ్వే కారణం అయ్యెదవు

అనామిక: లేదు గుప్త గారు లేదు.. అలా జరగడానికి వీల్లేదు.. నేను అలా జరగనివ్వను.. నా స్వార్థం కోసం అనామిక భవిష్యత్తును నేను పణంగా పెట్టలేను.

గుప్త: అయితే పౌర్ణమికి మునుపే నువ్వు ఈ దేహము విడవవలెను. నువ్వు చేయదలుచుకున్న కార్యములను అంతకు మునుపే ముగించుకొనుము

అంటూ గుప్త అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత అమర్‌ లాన్‌ లో నిలబడి రణవీర్‌తో మాట్లాడుతుంటే.. మనోహరి వచ్చి చూస్తుంది. రణవీర్‌ ఇంకా వెళ్లలేదా..? అనుకుంటుండగా అమర్‌, మనోహరిని పిలుస్తాడు. మనోహరి రాగానే ఇద్దరితో అమర్‌ మాట్లాడతాడు. దీంతో అమర్‌కు రణవీర్‌ మీద అనుమానం వస్తుంది. వెంటనే భాగీని పక్కకు తీసుకెళ్లి రణవీర్‌ గురించి అడుగుతాడు.

అమర్‌: నాకో విషయం చెప్పు ఆరోజు అంజును రణవీర్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు అని చెప్పావు కదా..?

భాగీ: అవునండి తీసుకెళ్లారు.

అమర్‌:  ఆ హాస్పిటల్‌ పేరు గుర్తుందా..?

భాగీ: కేఎల్‌ హాస్పిటల్‌

అని చెప్పగానే.. అమర్‌ హాస్పిటల్‌కు ఫోన్‌ చేస్తాడు.

అమర్‌: నేను లెఫ్టినెంట్‌ అమరేంద్రను మాట్లాడుతున్నాను డాక్టర్‌

డాక్టర్‌:  చెప్పండి అమరేంద్ర గారు

అమర్‌: రెండు నెలల క్రితం రణవీర్‌ అనే వ్యక్తి ఒక పాపను తీసుకుని మీ హాస్పిటల్‌కు వచ్చారా..?

డాక్టర్ డాటా చెక్‌ చేస్తాడు. వచ్చాడని చెప్తాడు. ఎందుకు తీసుకొచ్చారో చెప్తారా అని అమర్‌ అడగ్గానే.. డాక్టర్‌ మళ్లీ డాటా చెక్‌ చేసి నిజం చెప్తాడు. నిజం విన్న అమర్‌ షాకింగ్‌ గా కాల్‌ కట్ చేస్తాడు. భయంగా భాగీ డాక్టర్‌ ఏం చెప్పారండి అని అడుగుతుంది. అంజును డీఎన్‌ఏ టెస్టుకు తీసుకెళ్లాడట రణవీర్‌ అని చెప్తాడు అమర్‌. అమర్‌ మాటలకు భాగీ షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!