Nindu Noorella Saavasam Serial Today May 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: మనోహరికి షాక్ - పిల్లల వైపు అట్రాక్ట్ అవుతున్న అమర్
Nindu Noorella Saavasam serial Today Episode May 21st: మనోహరి ఎంత చేసినా అమర్ పిల్లల వైపు అట్రాక్ట్ అవుతుండటంతో ఇవాల్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ లో అమర్ కోసం మనోహరి చేస్తున్న ప్రయత్నాలు అన్ని విఫలం అవుతుంటాయి. అమర్ పిల్లలకు దగ్గర అవుతుంటాడు. దీంతో పిల్లలను అమర్‌కు దూరం చేయాలని మనోహరి ప్లాన్ చేస్తుంది. ముందు పిల్లలను ఎంటర్‌టైన్ చేయాలని వాళ్లతో కలిసి గుర్రం ఆట ఆడుతుంది. అది చూసిన రాథోడ్, భాగీ నవ్వుకుంటారు. మనోహరి మాత్రం మీ సంగతి తర్వాత చెప్తాను అనుకుంటుంది. తర్వాత రణవీర్ బెయిల్ మీద జైలు నుంచి బయటకు వస్తాడు.
రణవీర్: ఏంటి లాయరు నన్ను విడిపించడానికి ఇన్ని రోజులు పట్టిందా..?
లాయరు: మీ మీద కేసు పెట్టింది మామూలు వ్యక్తి కాదు కదా..? ది గ్రేట్ ఆర్మీ ఆఫీసర్ అమరేంద్ర.
రణవీర్: వాడికి మతి పోయిందని విన్నాను
లాయరు: అవును రణవీర్ గతం మర్చిపోయాడు. అందుకే మీ మీద ఆయన పెట్టిన కేసు వీగిపోయి మీకు ఈజీగా బెయిల్ వచ్చింది.
రణవీర్ : థాంక్స్ లాయరు
లాయరు: థాంక్స్ నాకు కాదు మనోహరి గారికి చెప్పండి. ఆవిడే మిమ్మల్ని బయటకు తీసుకొచ్చారు.
రణవీర్: మనోహరా..?
లాయరు: అవును రణవీర్ అదిగో మేడం గారు అక్కడ ఉన్నారు
రణవీర్ మనోహరి దగ్గరకు వెళ్తాడు.
రణవీర్: నువ్వు నాకు బెయిల్ ఇప్పించావా..? ఇది నమ్మేలా లేదే..?
మనోహరి: ఏం నేను నీకు హెల్ప్ చేయనని అనుకున్నావా..?
రణవీర్: నా చావు నన్ను చావమన్నావు కదా..?
మనోహరి: అందుకేనా అమర్‌కు నా గురించి ఇన్‌డైరెక్టుగా చెప్పావు
రణవీర్: కానీ నువ్వు దొరికిపోలేదు కదా.. బోనస్‌గా అమరేంద్ర తన గతం కూడా మర్చిపోయాడు కదా..?
మనోహరి: అదృష్టవంతులకు అలాగే కలిసి వస్తుంది రణవీర్
రణవీర్: నీది అదృష్టం కాదు.. స్వార్థం లేనిదే ఏ పని చేయవు.. ఇప్పడు కూడ ఏదో ఆశించి నన్ను విడిపించి ఉంటావు..
మనోహరి: ఇప్పుడు మన టాపిక్ స్వార్థం కాదు.. నువ్వు ఆస్థి కోసమే కదా ఇక్కడికి వచ్చావు. నీ బిడ్డను నీకు అప్పగిస్తాను.. కోల్‌కతా వెళ్లి నీ ఆస్థిని హండోవర్ చేసుకో..
ALSO READ: ఆవకాయ ఎవరు పెట్టకూడదు, ఎవరు ముట్టుకోకూడదు, ఆవకాయ పెట్టేందుకు కూడా ముహూర్తం ఉంటుందా?
రణవీర్: నా కూతురు ఎక్కడ ఉందో తెలియదు అన్నావు.. తెలిసిన అమరేంద్ర గతం మర్చిపోయాడు. ఇంకెలా నా కూతురును అప్పగిస్తావు
మనోహరి: అంజును అప్పగిస్తాను
రణవీర్: అంజు మన కూతురని కన్ఫం కాలేదు కదా..
మనోహరి: కాకపోతే ఏంటి నీకు ఆస్థి రావాలంటే కూతురు ఉండాలి. అంజును తీసుకెళ్లు తనే నీ కూతురు అని చెప్పు..
రణవీర్: అందుకు అమరేంద్ర ఒప్పుకోవాలి కదా..?
మనోహరి: ఇప్పుడు అమరేంద్రకు తను ఎవరో కూడా తనకు గుర్తు లేదు. నువ్వు వచ్చి అంజు నీ కూతురు అని చెబితే అమర్ నీతో ఆంజును పంపిస్తాడు
రణవీర్: గతం మర్చిపోయింది అమరేంద్ర మాత్రమే ఆ భాగీ కాదు తను అడ్డు పడుతుంది కదా..
మనోహరి: అడ్డు పడదు. ఆ హక్కు అవకాశం నేను భాగీకి లేకుండా చేశాను
రణవీర్: ఏం చేశావు
మనోహరి: గతం మర్చిపోయిన అమరేంద్రతో నేను తన లవర్ అని మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని.. భాగీ కేర్ టేకర్ అని ఆ పిల్లలను అనాథాశ్రమం నుంచి తెచ్చుకున్నామని చెప్పాను. ఇప్పుడు నేను ఏం చెబితే అమర్‌కు అదే వేదవాక్కు
లాయరు: చాలా బాగా మేనేజ్ చేశారు మేడం. మీరు లాయరు కాకపోవడం నా అదృష్టం
రణవీర్: నాకు బెయిల్ ఇప్పించావు. అంజును నాతో పంపిస్తాను అంటున్నావు. ఇందులో నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి..? నాకొచ్చే ఆస్తిలో సింగిల్ రూపాయి కూడా నీకు ఇవ్వను
అంటూ రణవీర్ కోపంగా చెబితే మనోహరి వెటకారంగా నవ్వుతూ తాను ఇదంతా అమర్ కోసం చేస్తున్నానని.. అమర్ కు నాకు మధ్యలో భాగీ, పిల్లలు ఉండకూదని చేస్తున్నాను అంటూ రణవీర్‌ను కోపంగా చూస్తుంది మనోహరి. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















