Nindu Noorella Saavasam Serial Today May 15th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమర్ కోసం కరుణ, భాగీ గాలింపు - తీవ్రవాదుల చెరలో అమర్
Nindu Noorella Saavasam serial Today Episode May 15th: అమర్ ను తీవ్రవాదులు బంధిస్తే ఆ విషయం తెలియక భాగీ, కరుణ రోడ్ల మీద వెతుకుతుంటారు.

Nindu Noorella Saavasam Serial Today Episode: తీవ్రవాదుల చేతుల్లో బంధీగా చిక్కుకున్న అమర్ అంతా అయోమయంగా చూస్తుంటాడు. వాళ్లు ఏం తిట్టినా.. ఏం ప్రశ్నలు అడిగినా నాకు తెలియదు అంటూ సమాధానం చెప్పడంతో నిండు నూరేళ్ల సావాసం చాలా ఆసక్తిగా జరిగింది.
అమర్‌కు మాటలకు తీవ్రవాదులు షాక్ అవుతారు. నీ మిలటరీ నాటకాలు మా ముందు సాగవు అంటూ అమర్‌ను తిడుతుంటారు. నీ ఆటలు ఇక సాగవు అంటూ బెదిరిస్తుంటారు.
అమర్: మీరంటుంది నాకు అర్థం కావడం లేదు ఎవరు మీరు
తీవ్రవాది: మమ్మల్నే మర్చిపోయావా..? నీ చేతులతో అరెస్ట్ చేశావు కదా..? నువ్వు మాకు ఎప్పటికీ గుర్తు ఉంటావు అ
అమర్: నేను మిమ్మల్ని అరెస్ట్ చేశానా..? ఎప్పుడు అసలు నేను ఎవరిని
తీవ్రవాది: ఏమీ తెలియనట్టు ఎన్ని నాటకాలు ఆడుతున్నావురా..? అసలు నీ ఆర్మీ ట్రిక్కులు మా దగ్గర కాదు
అమర్: నన్ను మీరు ఎందుకు కట్టేశారు.. మీకు ఏం కావాలి..?
తీవ్రవాది: నీ ప్రాణాలు కావాలి. మా వాళ్లను ఎంత మందిని చంపావు. ఇప్పుడు నీ ఫ్యామిలీని చంపుతాము..
అమర్: నిజంగా నాకేమీ గుర్తు లేదు. మీరు ఎవరో నేను ఎవరో నాకేం అర్థం కావడం లేదు
తీవ్రవాది: నాలుగు తగిలిస్తే.. అన్ని గుర్తుకు వస్తాయి
తీవ్రవాది 2: ఏయ్ ఆగు ఇతను ఏదో తేడాగా ఉన్నాడు.. బాస్‌తో మాట్లాడి వస్తాను ఉండు..
బాస్ దగ్గరకు వెళ్తుంది. లేడీ తీవ్రవాది. మరోవైపు అమర్‌ను వెతుక్కుంటూ కరుణ తీవ్రవాదులు ఉన్న ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్తుంది. అప్పుడే వచ్చిన భాగీ కరుణను పిలవగానే కరుణ రోడ్డు మీదకు వెళ్తుంది.
భాగీ: ఆయన ఎక్కడే
కరుణ: ఏమోనే ఇప్పుడే ఇక్కడే చూశాను. నీతో ఫోన్ మాట్లాడి తిరిగి చూసే సరికి సార్ కనబడటం లేదు. సార్ కోసమే వెతుకుతున్నానే
భాగీ: ఆయనను వదిలేయోద్దు అని చెప్పాను కదే అలా ఎలా వదిలేశావు
కరుణ: పరిషాన్ కాకే ఇక్కడే ఎక్కడో ఉంటాడు పా వెతుకుదాం
అంటూ ఇద్దరు అక్కడి నుంచి రోడ్డు మీద వెతుకుతుంటారు. లోపల బాస్ దగ్గరకు వెళ్తిన లేడీ తీవ్రవాది అమరేంద్ర గురించి చెప్తుంది.
తీవ్రవాది 2: అమరేంద్ర తనకు ఏమీ తెలియదని విచిత్రంగా మాట్లాడుతున్నాడు బాస్. తెలివిగా తప్పించుకుందామని చూస్తున్నాడు.
బాస్: వాడు నిజమే చెప్తున్నాడు. వాడు గతం మర్చిపోయాడు
తీవ్రవాది 2: ఏంటి బాస్ మీరు చెప్పేది. అంటే తను చేసినవి ఏవీ అమరేంద్రకు ఏమీ గుర్తు లేదా..?
బాస్: ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కున్నాను. వాడికి వాడి పేరే గుర్తుకు లేదంట. ఏదో యాక్సిడెంట్‌లో మెమెరీ మొత్తం పోయిందట
తీవ్రవాది 2: అంతా మన మంచికే జరిగింది బాస్. ఇప్పుడు అమరేంద్రను అడ్డుపెట్టుకుని మనం ఈజీగా సిటీ దాలేయోచ్చు
బాస్: ఈ సిటీనే కాదు కంప్లీట్‌గా ఈ బార్బర్‌నే దాటేయోచ్చు
తీవ్రవాది 2: బార్డర్‌ను క్రాస్ చేసి మన కంట్రీలోకి వెళ్లగానే.. అమరేంద్రను చంపేద్దాం బాస్
బాస్: అది ఎలాగూ చేస్తాను. అంతకు ముందే ఇంకొకటి చేయాలి
అని చెప్పగానే.. ఏం చేయాలి బాస్ అని అడుగుతుంది లేడీ తీవ్రవాది. అమర్‌ను అడ్డు పెట్టుకుని ఆర్మీ సీక్రెట్స్ తెలుసుకోవాలని అందుకోసం తాము ఓ నాటకం ఆడాలని ఎలా ఆడాలో ఆమెకు చెవిలో చెప్తాడు బాస్. దీంతో ఆ లేడీ తీవ్రవాది నవ్వుతూ ఓకే బాస్ అంటూ వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















