Nindu Noorella Saavasam Serial Today Episode:  ఇంట్లో ఆరు ఫోటో లేదని అమర్‌ను వినోద్‌ అడుగుతాడు. పిల్లలను పైకి వెళ్లమని చెప్పి.. పిల్లలు వెళ్లిపోయాక.. ఆరు ఫోటో కనబడేటట్లు పెడితే పిల్లలు డిస్టర్బ్‌ అవుతారని అందుకే హాల్లో పెట్టలేదని.. రూమ్‌ లో పెట్టామని చెప్తాడు అమర్‌. అయితే ముందు వదిన ఆశీర్వాదం తీసుకుని వస్తానని వినోద్‌ రూంలోకి వెళ్తాడు. అమర్‌ బయటకు వెళ్లిపోతాడు. వినోద్‌ ను ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలని మనసులో అనుకుంటుంది మనోహరి. రూంలోకి వెళ్లిన వినోద్‌ ఆరు ఫోటో దగ్గర నిలబడి బాధపడుతూ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు.

ఆరు: దేవుడా ప్లీజ్‌ సీటు రావాలి

వినోద్‌: వదినా నాకు సీటొచ్చింది. అమెరికాలో నేను కోరుకున్న యూనివర్సిటీలోనే సీటు వచ్చింది.

ఆరు: థాంక్యూ దేవుడా

అమర్‌: నీకు ఎగ్జామ్స్‌ కు చదివించింది నేను. ఎగ్జామ్‌ అప్పుడు నీకు అన్ని విధాలా సపోర్ట్‌ చేసింది నేను. ఇప్పుడేంట్రా సీటు రాగానే క్రెడిట్‌ అంతా మీ వదినకు ఇచ్చేస్తున్నావు..

ఆరు:  నేను మోరల్ సపోర్టు చేశానండి

వినోద్‌: అవును అన్నయ్య నా లైఫ్‌లో ఏ సక్సెస్‌ వచ్చినా కూడా అది ఓన్లీ మా వదిన వల్లే

అనేది గుర్తు చేసుకుంటాడు. తర్వాత తాను అమెరికా వెళ్తుంటే..

ఆరు: ఇలా బాధపడతావేంటి వినోద్‌.. రోజూ ఫోన్‌ లో మాట్లాడొచ్చు..  ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియో కాల్‌ లో కూడా మాట్లాడుకోవచ్చు ఇంకా ఎందుకు ఇలా ఉంటావు..

అమర్‌: మేము అందరం నిన్ను చాలా మిస్‌ అవుతాం

వినోద్: నేను కూడా మిమ్మల్ని చాలా మిస్‌ అవుతాను అన్నయ్యా.. వదిన అందిరిని నువ్వు ఎలాగూ బాగా చూసుకుంటావు. కానీ నిన్ను చూసుకోవడానికి ఇక నుంచి నేను ఉండను. నాకు అక్క ఉంటే ఎలా ఉంటుందో తెలియదు. కానీ నువ్వు లైఫ్‌లోకి వచ్చాక ఆ లోటు తీరిపోయింది వదిన

ఆరు: సరే ఫ్లైట్‌కు లేట్‌ అవుతుంది. బాధపడకుండా బయలుదేరు

వినోద్‌ ఆరు కాళ్లు మొక్కి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆరు ఆస్తికలు పట్టుకుని వినోద్‌ బాధపడుతుంటాడు.

వినోద్‌: మమ్మల్ని వదిలి ఎలా వెళ్లాలనిపించింది వదిన. తిరిగి ఇండియాకు వచ్చినప్పుడు గుమ్మం ముందు అమ్మలా ఎదురుచూస్తుంటానని మాట ఇచ్చావు కదా..? మర్చిపోయావా..?

మనోహరి: ఆఖరి నిమిషం వరకు ఆరు ఈ ఇంటి గురించి ఈ కుటుంబం గురించి ఆలోచించింది వినోద్‌. మీలాంటి మంచి కుటుంబం దొరకడం ఆరు అదృష్టం.

వినోద్‌: వదిన మా ఇంటికి రావడం మా అదృష్టం మనోహరి గారు.

మనోహరి: ఆరు ఇంత కష్టపడి కాపాడుకున్న ఈ కుటుంబం ఇలా నా కళ్ల ముందు కూలిపోతున్నా..? నేను ఏమీ చేయలేని పరిస్తితి

వినోద్‌:  ఏంటి ఏమన్నారు…?

మనోహరి:  ఏమీ లేదు వినోద్‌. ఇప్పుడే వచ్చావు కదా వెళ్లి ప్రెష్‌ అవ్వు

వినోద్‌: పర్వాలేదు మనోహరి గారు చెప్పండి

మనోహరి:  చెప్పడానికి ఏముంది వినోద్‌.. భాగీ మోసం చేసి అమర్‌ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈ ఇంట్లో ఎవ్వరూ మనఃశాంతిగా లేరు

వినోద్‌:  అదేంటి ఆవిడ వచ్చాక ఇంట్లో అన్ని సర్దుకున్నాయి అని అమ్మ చెప్పింది.

మనోహరి: ఏదో దూరంలో ఉన్న నీకు టెన్షన్‌ ఎందుకని అలా చెప్పి ఉండొచ్చు

అంటూ మనోహరి తన మాటలతో వినోద్‌ను డైవర్ట్‌ చేయాలనుకుంటుంది. ఇంతలో భాగీ వస్తుంది. భాగీని చూసిన రాథోడ్‌ ఇంతకు ముందే సార్‌ నీ గురించే అడిగారు అని చెప్తాడు.

భాగీ: ముందు వినోద్‌కు హాయ్‌ చెప్పి తర్వాత ఆయన్ని కలుస్తాను.

అనామిక: వినోద్ నా ఫోటో దగ్గర ఉన్నాడు కదా ఇప్పుడు భాగీ అక్కడికి వెళితే మొత్తం తెలిసిపోతుంది. (మనసులో అనుకుని) భాగీ గారు కొద్దిసేపు అయితే వినోద్‌ గారే బయటకు వస్తారు కదా ఆగండి.

భాగీ: నేను ఆ రూంలోకి వెళ్లి వినోద్‌ ను ఎందుకు కలవకూడదు..?

అంటూ అనామిక చెప్తున్నా వినకుండా భాగీ వెళ్తుంది. డోర్‌ దగ్గరకు వెళ్లి లోపల ఆరు ఫోటో చూసి షాక్‌ అవుతుంది. ఇంతలో అక్కడకు అనామిక వచ్చి భయపడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.