Nindu Noorella Saavasam Serial Today Episode: అమ్ము డాన్స్ బాగా చేసి వచ్చి భాగీని హగ్ చేసుకుని థాంక్స్ చెప్తుంది. ఆ వెంటనే అంజు కూడా యాక్టింగ్ సూపర్ గా చేస్తుంది. అంజు యాక్టింగ్ చూసిన భాగీ, ఆరు హ్యాపీగా ఫీలవుతారు. మరోవైపు మ్యాన్ హోల్ నుంచి మీనన్ తన మనుషులతో స్కూల్ లోపలికి ఎంటర్ అవుతుంటాడు. అమర్ అనుమానంగా ఆలోచిస్తుంటే ప్రిన్సిపాల్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చి స్కూల్ బ్యాక్ సైడ్ వెళ్తుంటాడు. అక్కడే కాపలా ఉన్న కానిస్టేబుల్‌ను చంపాలనుకుంటుంది మనోహరి. అక్కడికి అమర్ రావడం చూసి షాక్ అవుతుంది. చాటుగా వెళ్లిపోతుంది.
అమర్: ఎవరైనా వచ్చారా ఇక్కడికి
కానిస్టేబుల్: ఎవరూ రాలేదు సార్..
అమర్: ఇక్కడ ఇంకేమైనా రూట్స్ ఉన్నాయా..?
కానిస్టేబుల్: ఏం లేవు సార్..
అమర్: చుట్టు పక్కల ఎవరైనా తిరుగుతున్న అలికిడి వినిపిస్తుందా..?
కానిస్టేబుల్: అలాంటిదేం లేదు సార్
అమర్: ఓకే టేక్ కేర్
అని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అమర్. అమర్ వెళ్లడం చూసిన మనోహరి కర్ర తీసుకుని వచ్చి కానిస్టేబుల్ ను తల మీద కొడుతుంది. దీంతో కానిస్టేబుల్ స్పృహ తప్పి కింద పడిపోతాడు. అదే కర్రతో మనోహరి మ్యాన్ హోల్ కు ఉన్న లాక్ పగులగొట్టి మీనన్ వాళ్లను బయటకు పిలుస్తుంది. మీనన్ వాళ్లు బయటకు వస్తారు.
మీనన్: అమర్‌కు అనుమానం వచ్చినట్టు ఉంది కదా..?
మనోహరి: అవును ఇక్కడ ఎక్కువ సేపు ఉండటం మంచిది కాదు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్దాం పదండి..
అని చెప్తూ.. మీనన్ వాళ్లను పక్కకు తీసుకెళ్తుంది మనోహరి.
మనోహరి: అదిగో అదే అడిటోరియం ఇప్పుడే మినిస్టర్ అక్కడికి వెళ్లాడు.
మీనన్: థాంక్స్ మిత్రమా ఆపదలో వచ్చి ఆదుకున్నావు
మనోహరి: డబ్బులు ఇవ్వాలని మర్చిపోకు
మీనన్: నీకు చెప్పిన అమౌంట్ నీకు చేరుతుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లొచ్చు..ఇక మేము చూసుకుంటాం
మనోహరి: అవును మీరు అటాక్ చేస్తుంది. మీకు కావాల్సిన మనుషుల్ని జైలు నుంచి విడిపించుకోవడానికే కదా..?
మీనన్: అవును.. నీకెందుకు ఆ డౌటు..?
మనోహరి: ఇప్పుడు ఆడిటోరియం మీ కంట్రోల్ లోకి తీసుకున్నాక మీరు ఎవరినైనా కావాలంటే చంపేయవచ్చా
మీనన్: నువ్వు ఎవరి చావు కోరుకుంటున్నావో చెప్పు చాలు
మనోహరి: భాగీ.. అమరేంద్ర భార్య అది మీ అటాక్‌లో చనిపోవాలి.
మీనన్: పెద్దతలకాయే కొంచెం రిస్కే..?
మనోహరి: నువ్వు వాళ్లను కంట్రోల్ లోకి తీసుకున్నంత మాత్రాన అమర్ నీ మాట వింటాడన్న గ్యారంటీ లేదు. అదే నువ్వు అమర్ భార్యను చంపితే ఆ తర్వాత పిల్లలను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాడు.
మీనన్: సరే ప్లాన్ బాగానే ఉంది. కానీ నా పని అయ్యాకే నీ పని చేస్తాను.
మనోహరి: ఆ అమ్మాయి ఎవరో నీకు చూపిస్తాను. ఆడిటోరియంలోకి వెళ్లే మార్గం కూడా చూపిస్తాను రండి
అంటూ మీనన్ ను తీసుకుని అడిటోరియం వైపు వెళ్తుంది మనోహరి. ఆడిటోరియం దగ్గరకు వెళ్లాక ఏమీ తెలియనట్టు మనోహరి లోపలికి వెళ్లి కూర్చుంటుంది. ఇంతలో మీనన్ గన్ తీసుకుని స్టేజీ మీదకు వచ్చి మినిస్టర్‌కు గన్ ఎక్కు పెట్టగానే.. సెక్యూరిటీ మీనన్ మీదకు వెళ్తుంటే.. సెక్యూరిటీని కాలుస్తాడు మీనన్.
మీనన్: అమరేంద్ర గారి భార్య గారు ఒక్కసారి పైకి రండమ్మా..?
అని మీనన్ పిలవగానే.. భాగీ స్టేజీ మీదకు వెళ్తుంది.
మీనన్: అమ్మా నువ్వు మొండోడిని పెళ్లి చేసుకున్నావు.. అతని వల్ల నీ ప్రాణాలు పోతున్నాయి. హ్యాపీ జర్నీ భాగీ
అంటూ భాగీని మీనన్ కాల్చస్తాడు. ఇంతలో అమర్ వస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!