Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్ ఇంటి ముందు ఉన్న మనోహరిని తన కారులో బలవంతంగా ఎక్కించుకుని పార్క్‌లోకి తీసుకెళ్తాడు రణవీర్. మనోహరి కోపంగా ఏం చేస్తున్నావు రణవీర్ నన్ను ఎందుకు తీసుకొచ్చావు అంటూ తిడుతుంది.
రణవీర్: ఏంటే తెగ గింజుకుంటున్నావు నువ్వు.. నీ అవతారం చూసుకున్నావా..? బాగానే ఎంజాయ్ చేస్తున్నావు..
మనోహరి: ఏంటి.? ఏదో సొంత పెళ్లాన్ని అడిగినట్టు అలా అడుగుతున్నావు.. ఇప్పుడు నీకు నాకు ఏ సంబంధం లేదు..
రణవీర్: నీతో సంబంధం పెట్టుకోవాలని నాకు లేదు.. నీలాంటి దుర్మార్గురాలికి స్వార్థపరురాలికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని నేను కూడా అనుకుంటున్నాను మనోహరి: నేను చెడ్డదాన్ని సెల్ఫీష్‌ను అయితే ఏంటి..? నువ్వు మహాత్ముడివా..? నువ్వు ఎన్ని క్రైమ్స్ చేయలేదు..
రణవీర్: నీ వల్లనే నేను క్రిమినల్ అయ్యాను.. అఖరికి జైళ్లో పడ్డాను.. కనీసం నన్ను చూడటానికి కూడా రాలేదు నువ్వు..
మనోహరి: నువ్వు జైళ్లో ఉన్నావని నాకు తెలియదు
రణవీర్: ఏయ్ నాటకాలాడకు.. నా గురించి లాయరు నీకు ఎన్నిసార్లు కాల్ చేశాడు. మాట్లాడావా..?
మనోహరి: నేను కాస్త బిజీగా ఉన్నాను..
రణవీర్: అవును నువ్వు బిజీ అయ్యావని నీ వేషం చూస్తేనే తెలుస్తుందిలే..
మనోహరి: ఇంక ఆపు రణవీర్ ముందు నన్ను ఎందుకు తీసుకొచ్చావో చెప్పు
రణవీర్: నాకు నా కూతురు కావాలి
మనోహరి: నీకు కావాల్సింది కూతురా..? లేక ఆస్థా..?
రణవీర్: అది నీకు అనవసరం.. నా కూతురును నాకు అప్పగిస్తానని చెప్పి మాటిచ్చి నాతో అడ్డమైన పనులు చేయించుకున్నావు.. ఆ పనులు చేసి నేను జైలు పాలయ్యాను.. ఆస్తి వస్తే తప్పా..? జైలు నుంచి బయట పడలేను. నాకు ఒక్క నెల రోజులే బెయిల్ ఇచ్చారు. ఆలోపు నా కూతురును నాకు అప్పగించు లేదంటే నా చేతుల్లో చస్తావు
మనోహరి: సడెన్ గా ఊడిపడి కూతురు కావాలంటే అదేమైనా నా ఒళ్లో ఉందా ఇవ్వడానికి
రణవీర్: ఆ పిల్ల ఎక్కడుందో నీకు తెలుసు కదా..?
మనోహరి: నాకు తెలియదు.. అమర్‌కు తెలుసు
రణవీర్: వాడిని అడిగితే చెప్తాడు కదా..?
మనోహరి: ఈరోజు చెప్పేవాడే ఆ భాగీ, రాథోడ్ అడ్డుపడకపోయి ఉంటే.. నేను అనాథ ఆశ్రమంలో వదిలేసిన బేబీని అమర్, అరుంధతిలు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు..
రణవీర్: అంటే నా కూతురును వాళ్లు ఏం చేశారు.. అరుందతి చనిపోగానే.. అమరేంద్ర నా కూతురును మళ్లీ అనాథ ఆశ్రమంలో వదిలిపెట్టాడా..?
మనోహరి: అమర్ అలాంటి వాడు కాదు.. తన కన్న కూతురు అని తెలియకపోయినా భాగీకి పుట్టిందని తెలియక ఆర్ఫాన్ అనుకుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు..
రణవీర్: అయితే నా కూతురు ఆ ఇంట్లోనే ఉందా..? ఆ నలుగురు పిల్లల్లో ఒకరు నా కూతురా..?
మనోహరి: నీకేమైనా పిచ్చా ఆ నలుగురు అరుందతి పిల్లలు
రణవీర్: గడువులోపు నా కూతురును నాకు అప్పగించు లేదంటే నిన్ను చంపేస్తానుఅంటూ మనోహరికి వార్నింగ్ ఇస్తాడు రణవీర్. మనోహరి ట్రై చేస్తాను అని చెప్తుంది. రణవీర్ కోపంగా వెళ్లిపోతాడు. రాథోడ్ వెళ్లి రణవీర్ బెయిల్ మీద విడుదల అయ్యాడని చెప్తాడు. దీంతో అమర్ పిల్లలను జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి మనోహరికి కాల్ చేస్తాడు. పిల్లల గురించి అడిగితే అందరూ ఇంట్లోనే ఉన్నారు కానీ అమ్ము మాత్రం బయటకు వెళ్లిందని చెప్తుంది యాదమ్మ. భాగీ ఉందా అని అడగ్గానే.. భాగీ కూడా బయటకు వెళ్లిందని చెప్తుంది. దీంతో అమర్, రాథోడ్‌ను తీసుకుని అఫీసు నుంచి ఇంటికి బయలుదేరుతాడు. మరోవైపు కరుణ స్కూటీ మీద అమ్ము కోసం వెతుకుతుంటుంది భాగీ. ఇంతలో ఎవరో కారుతో అమ్మును డాష్ ఇవ్వబోతారు. అమ్ము ఉలిక్కిపడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
