Nindu Noorella Saavasam Serial Today Episode:  ఇంట్లో వాళ్లకు తాను వెళ్లిపోతున్నానని అనామిక చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు. పిల్లలు ఎమోషనల్‌ అవుతుంటారు. అనామిక వాళ్ల దగ్గరకు వెళ్లి ఓదారుస్తుంది.

అనామిక: అమ్ము అందరినీ నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు మీరందరూ ఎప్పుడూ భాగీ మాట వినాలి.

మనోహరి: అనామిక టైం అవుతుంది కదా ఇక బయలుదేరు

అనామిక: (భాగీ దగ్గరకు వెళ్లి హగ్‌ చేసుకుంటుంది) థాంక్స్‌ భాగీ  థాంక్యూ సోమచ్‌ నువ్వు నాకోసం ఏం చేశావో నిజంగా నీకు తెలియదు. ఎప్పటికీ చెప్పుకోలేను కూడా.. థాంక్స్‌. నన్ను ఒకే ఒక్కసారి అక్కా అని పిలవవా..?

భాగీ: అక్కా..

అనామిక: ఈ జన్మలో కుదరలేదు కానీ వచ్చే జన్మలో కలిసి పుడదాం. నేను అక్క నువ్వు చెల్లి చివరిదాకా కలిసే ఉందాం.. చివరి దాకా..

భాగీ: సరే.. అక్కా.. నువ్వు ఎందుకు వెళ్లిపోతున్నావో తెలియదు కానీ నిన్ను చాలా మిస్‌ అవుతున్నాం అక్కా.. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నీకో కుటుంబం ఉందని మర్చిపోకు

అనామిక:  సరే.. జాగ్రత్త పిల్లలు.. ఉంటాను సార్‌.. వెళ్లోస్తా భాగీ

అని వెళ్లిపోతుంది. అందరూ బాధగా చూస్తుంటారు. మనోహరి సంతోషంగా చూస్తుంది. మరోవైపు గార్డెన్‌లో ఉన్న గుప్తకు ఆకాశంలో యముడు కనిపిస్తాడు.   

యముడ: విచిత్ర..

గుప్త: ప్రభువులకు ప్రణామములు

యముడు: పౌర్ణమి ఘడియలు మొదలు కానున్నాయి.

గుప్త:  బయలుదేరుతున్నాము ప్రభు బాలిక ఇంట్లోకి వెళ్లింది. వచ్చిన వెంటనే బయలుదేరుతాము

యముడు: ఆ నిండు కుండ రత్తడు తిరిగి ఇంటికి వచ్చినాడా

గుప్త:  ఎందులకు ప్రభు అత గాడిని కూడా తీసుకురావలెనా..?

యముడు:  (కోపంగా) విచిత్రా…

గుప్త:  క్షమించండి ప్రభు అతగాడు ఇంకనూ రాలేదు

యముడు:  అతగాడు వచ్చేలోపే ఆ బాలికను తీసుకుని బయట పడుము

గుప్త:  ఎందులకు ప్రభు అతగాడి రాకకు ఈ బాలికతో మా ప్రమాణమునకు ఏమైనా సంబంధం ఉన్నదా..?

యముడు: ఉన్నది అయినా నీకు చెప్పను మాటలు కట్టిపెట్టి త్వరగా బయలుదేరు..

అంటూ హెచ్చరించి యముడు వెళ్తాడు. అప్పుడు బయటకు వచ్చిన అనామికను వెనకే వచ్చిన మనోహరి పిలుస్తుంది. ఆగు అంటూ దగ్గరకు వచ్చి హగ్ చేసుకుంటుంది.

మనోహరి: ఎన్ని సార్లు కౌగిలించుకున్నా ఇంకోసారి కౌగిలించుకోవాలి అనిపిస్తుంది. నీది ముగిసిపోయిన కథ ఆరు పులిస్టాప్‌ పడిపోయింది. ఇంకా నువ్వు ప్రయత్నించడంలో అర్థమే లేదు. హ్యపీగా పైకి వెళ్లిపో అమర్‌ను పెళ్లి చేసుకుంటున్నప్పుడు పై నుంచి మాత్రమే ఆశీర్వదించు సరేనా.. బై

అని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది. గార్డెన్‌ లో ఉన్న గుప్త దగ్గరకు అనామిక వెళ్తుంది.

అనామిక: అనామికకి ఈ ఇంట్లో టైం అయిపోయింది. అరుంధతికి ఈ భూమ్మీద టైం అయిపోయింది. పదండి గుప్త గారు వెళ్దాం

అనగానే ఇద్దరి కలిసి వెళ్తుంటారు ఇంతలో గేటు తెరుచుకుని చిత్ర వస్తుంది. అనామికను చూసి నవ్వుతుంది.

చిత్ర: ఈ ఇంట్లోకి నా ఎంట్రీని పది రకాలుగా ఊహించుకున్నాను. కానీ ఇలా  నువ్వు దూరం అవుతుంటే.. నేను దగ్గర అవుతానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు అరుంధతి. (ఆరు షాక్‌ అవుతుంది.) ఏంటి అలా చూస్తున్నావు.. కమాన్‌ ఆరు మను నీ చావు గురించి నీ అవతారాల గురించి చెప్పలేదు అనుకున్నావా..? ఎంతైనా మేము ఇప్పుడు తోడి కోడళ్లం అవుతున్నాం కదా అన్ని పంచుకుంటున్నాం.  చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు ఇష్టం లేదు ఆరు. నీ మంచితనం అస్సలు నచ్చేది కాదు. నువ్వు పాపాత్ములు ఉండే ఈ భూమ్మీద ఉండటం కరెక్టు కాదు ఆరు.  

మనోహరి:  చిత్ర సెండాప్‌ ఇచ్చేసి త్వరగా రా అసలే మనకు చాలా పనులు ఉన్నాయి

చిత్ర:  వస్తున్నాను.. బై ఆరు

అని చెప్పి చిత్ర వెళ్తుది. గుప్త, ఆరు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంతలో యముడు వస్తాడు.

యముడు: విచిత్ర..

గుప్త:  ప్రభువులకు ప్రణామములు

యముడు:  వెంటనే ఆ బాలికను ఆ శరీరం నుంచి వేరు చేసి ఆత్మను తీసుకుని భూలోకం నుంచి రమ్ము

గుప్త:  ఆజ్ఞ  ప్రభు అంటూ బాలిక అని ఆరును పిలుస్తాడు.

ఆరు:  నేను రెడీగా ఉన్నాను గుప్త గారు

అని చెప్పగానే గుప్త మంత్రం చదవగానే అనామిక బాడీలోంచి ఆరు బయటకు వస్తుంది. అనామిక స్పృహ తప్పి పడిపోతుంది. ఇక వెళ్దామా బాలిక అని గుప్త చెప్పగానే  ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!