Nindu Noorella Saavasam Serial Today Episode:   తన వ్యక్తిగత విషయంలో కలగజేసుకునేందు భాగీ ఎవరు అంటూ వినోద్‌ తిట్టడంతో భాగీ బాధగా బయటకు వెళ్తుంది. గార్డెన్‌ లోకి వెళ్లి బాధపడుతుంటే వెనకే వచ్చిన అమర్‌ ఓదారుస్తాడు. మరోవైపు శివరాం కోపంగా వినోద్‌ను తిడతాడు.

శివరాం: మాట్లాడే హక్కు అధికారం ఈ ఇంటి కోడలుగా భాగీకి పూర్తిగా ఉన్నాయి. నువ్వు చేసుకోబోయే అమ్మాయి మాకు నచ్చితే సరిపోదు.. తనకు కూడా నచ్చాలి.

నిర్మల: అయినా ఏమైందిరా నీకు వచ్చినప్పటి నుంచి ఎందుకు భాగీని శత్రువులా చూస్తున్నావు. ఎందుకు తన మనసు నొచ్చుకునేలా మాట్లాడుతున్నావు

భాగీ: పర్వాలేదు అత్తయ్యా… వినోద్‌ నాతో నువ్వు ఎలా అయినా మాట్లాడు..  ఎంతైనా కోప్పడు కానీ చిత్ర గురించి ఇంకొక్కసారి ఆలోచించు..

వినోద్‌: బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానండి నేను చిత్రను తప్పా ఇంకెవరినీ పెళ్లి చేసుకోను

శివరాం: రేయ్‌ నువ్వు వచ్చి నెల అయినా కాలేదు.. ఆ అమ్మాయితో పరిచయం అయి పది రోజులైనా కాలేదు. అప్పుడే ప్రేమ అంటున్నావు.. పెళ్లి అంటున్నావు.

వినోద్‌:  నాన్నా వదినతో పెరిగిన అమ్మాయి. వదిన లాగే తను పడిన భాద ఎవ్వరూ పడకూడదని ఆలోచిస్తుంది. ఇంతకన్నా ఏం తెలుసుకోవాలి.. తను నాకు బాగా నచ్చింది.

భాగీ: అది కాదు వినోద్‌…

వినోద్‌: మీకు చెప్పాల్సింది చెప్పాను.. మీకు ఇష్టం లేకుంటే చెప్పాను కదా ఎలాగైనా పెళ్లి చేసుకుంటాను

అంటూ వెళ్లిపోతాడు. దూరం నుంచి అంతా గమనించిన అనామికను గుప్తతో బాధపడుతుంది.

అనామిక:  ఏంటి గుప్తగారు ఇంట్లో ఉన్న మనోహరిని వెళ్లగొడదామనుకుంటే బయట ఉన్న చిత్రను ఇంట్లోకి తీసుకొస్తానంటున్నాడేంటి వినోద్‌.. ఇప్పుడే వెళ్లి దాని చరిత్ర అంతా చెప్పేస్తాను

గుప్త:  ఆగుము బాలిక అది అతగాడి నిర్ణయం.. అది నువ్వు మార్చుటకు వీలులేదు

అనామిక: నా కళ్ల ముందే నా మరిది జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు గుప్త గారు

గుప్త:  ఊరుకోవాలి. అతగాడికి ఆవిడనే భార్యగా రావాలని రాసి పెట్టి ఉంది

గుప్త మాటలకు అనామిక బాధపడుతుంది. తర్వాత అమర్‌ అందరినీ పిలుస్తాడు. మనోహరి రాదు. మనోహరిని కూడా పిలుస్తాడు. మనోహరి వస్తుంది.

మనోహరి: ఏంటి అమర్‌ పిలిచావు

అమర్‌:  నిన్ను ఒక విషయం డైరెక్టుగా అడుగుతున్నాను..చిత్రకు వినోద్‌కు పెళ్లి చేయాలనుకుంటున్నాము. చిత్ర తరపున ఉన్నది నువ్వే కదా నువ్వేం అంటావు

మనోహరి: ఏంటి అమర్‌ నువ్వు చెప్తుంది నిజమా..? చిత్ర చాలా మంచి అమ్మాయి.. వినోద్‌కు ఫర్పెక్ట్‌ జోడీ

అమర్‌: అయితే మేమందరం కలిసి చిత్ర ఇంటికి వెళ్లి సంబంధం అడగాలనుకుంటున్నాము ఒకసారి చిత్రకు కాల్ చేసి ఇవ్వు

మనోహరి: అమ్మో చిత్ర ఎదుటివాళ్లు మాట్లాడేవరకు ఆగదు. ఇప్పుడు అమర్‌తో ఏది పడితే అది మాట్లాడితే (మనసులో అనుకుంటుంది)

అమర్‌:  ఏమైంది మనోహరి చిత్రకు  ఫోన్‌ చేసి ఇవ్వు

మనోహరి: సరే అమర్‌ చేస్తాను..

అంటూ మనోహరి ఫోన్‌ చేసి స్పీకర్‌ ఆన్‌ చేసి అమర్‌కు ఇస్తుంది. చిత్ర ఫోన్‌ లిఫ్ట్ చేస్తుంది.

చిత్ర: హలో మను.. థాంక్స్‌ నువ్వు నాకు ఏదో గుడ్ న్యూస్‌ చెప్తా అన్నావు కదా ఏంటది చెప్పవా..? ఫ్లీజ్‌.. మను ఏంటా న్యూస్‌ నేను అనుకున్నదేనా..? చెప్పు మను..

అమర్‌: హలో చిత్ర నేను అమరేంద్రను..

అని అమర్‌ చెప్పగానే చిత్ర షాక్‌ అవుతుంది. ఈయనెందుక మాట్లాడుతున్నాడు అసలు ఏమైంది ఇంట్లో అని భయపడుతుంది. ఇంతలో అమర్‌, చిత్ర విషయం చెప్తాడు. చిత్ర హ్యాపీగా ఫీలవుతుంది. మనోహరి వెళ్లిపోతుంటే.. భాగీ ఆపి చిత్రకు నువ్వు ఏదో గుడ్‌ న్యూస్‌ చెప్పాలంది ఏంటది అని అడుగుతుంది. దీంతో మనోహరి షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!