Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరిని అంజును డిస్సపాయింట్‌ చేస్తుంది. నువ్వెప్పుడు ఫినిషింగ్‌ కు చేరలేవని పేకమేడలు కూలిపోయేలా చేస్తుంది. చేస్తుంది. అమర్‌ ఫ్యామిలీ మొత్తం వచ్చి తలా ఒక పేక తీసుకుని మొత్తం వెంటనే కట్టేస్తారు. దీంతో మనోహరి షాక్‌ అవుతుంది.

అమ్ము: అంజుతో  మేము కలిస్తే తనను మేము కాపాడుకోగలం ఆంటీ..

ఆనంద్‌: మేము అంజుకు తోడుగా ఉండి ఫినిష్‌ లైన్‌ దాటిస్తాం ఆంటీ

మను: మీరు ప్రయత్నం చేయగలరేమో కానీ ఫలితం దక్కదు ఆనంద్‌ ఎందుకంటే ఎవరు ఫినిష్‌ లైన్‌ చేరతారో ముందే రాసిపెట్టి ఉంటుంది. (మనసులో అనుకుంటుంది.)

ఆకాష్‌: తన తల రాతలో ఏదైనా తప్పుగా రాస్తే దాన్ని చెరిపేసి మళ్లీ కొత్తగా రాస్తాం.

మను: రేయ్‌ నేను మాట్లాడుతుంది కార్డ్స్‌ గురించి కాదురా మీ చెల్లెలి జీవితం గురించి రేపటితో దాని జీవితం ఫినిష్‌ అయిపోతుంది. ఫినిష్‌ లైన్‌ వరకు ఎలా తీసుకెళ్తారు. (మనసులో అనుకుంటుంది)

శివరాం: మా అంజు పాపకు ఎవరైనా హాని తలపెట్టాలనుకుంటే అదే వారికి ఆఖరి క్షణం అవుతుంది

నిర్మల: మా ఆయుష్షు పోసైనా మా అంజు పాపను కాపాడుకుంటాం

రాథోడ్‌:  ఎదుటివాడు ఎంతటి బలవంతుడైనా ఎదురెళ్లి మరీ మా అంజు పాపను కాపాడుకుంటాం

భాగీ: ఈ ఇంట్లో ఎవరైనా అంజు ఒంటరైపోతుంటే చూస్తూ ఊరుకుంటారా..? అంజు ఓటమి చేరాలంటే ఇంత మందిని దాటి రావాలి

అమర్‌: అదంతా సులువు కాదు మనోహరి అంజుకు తోడుగా మేమంతా ఉన్నాము.

అంజు: మనోహరి ఆంటీ చూశారు కదా నేను ఎంత ట్రై చేసినా ఫినిష్ లైన్‌ దాటలేను అన్నారు కదా..? ఇప్పుడు చూశారా నా ఫ్యామిలీ అంతా నా పక్కనే ఉండి అందరూ నన్ను ఎలా దాటించారో

మనోహరి షాకింగ్‌ గా చూస్తుండిపోతుంది. కలకత్తా  ఆశ్రమంలో అంజు గురించి మథర్‌కు ఫైల్‌ దొరుకుతుంది. వెంటనే రణవీర్ కు చెప్పాలని కాల్‌ చేస్తుంది. రణవీర్‌ తర్వాత మాట్లాడతానని కాల్ కట్‌ చేస్తాడు. మనోహరికి చేస్తే మనోహరి కూడా రణవీర్‌ దగ్గరకు వచ్చి తర్వాత మాట్లాడతానని కాల్‌ కట్‌ చేస్తుంది. వీళ్లేంటి ఇలా ఉన్నారు. వీళ్ల పాప గురించి చెబుదామంటే వీళ్లు మరీ బిజీగా ఉన్నారు అని మథర్‌ అనుకుంటుంది. మరోవైపు శివరాం, నిర్మల కలిసి ఇంటికి పంతులును పిలిపిస్తారు.

పంతులు: చెప్పండి అమ్మా ఎందుకు నన్ను పిలిపించారు.

నిర్మల: మీరొక్కసారి వీళ్లిద్దరి జాతకాలు చూసి శోభనానికి ముహూర్తం పెట్టాలి పంతులు గారు.

శివరాం: ఇదిగోండి పంతులు గారు ఇవి వీళ్ల జాతకాలు.

పంతులు జాతకాలు చూసి ఆశ్చర్యపోతాడు.

పంతులు:  వీళ్లిద్దరి కార్యానికి నేను ముహూర్తం పెట్టలేనమ్మా

అందరూ షాక్‌ అవుతారు.

భాగీ: ఎందుకు పంతులు గారు ఏదైనా సమస్య ఉందా..?

పంతులు: పెద్ద సమస్యే ఉందమ్మా..? పెద్ద కొడుక్కి.. పెద్ద కోడలికి శోభనం జరిగితేనే వీరిరువురికి శోభనం జరగుతుంది. అమ్మా ముందు వారి ఇద్దరికి శోభనం గురించి ఆలోచించి నాకు కబురు పంపండమ్మా నాకు అంతవరకు సెలవు.

అంటూ పంతులు వెల్లిపోతాడు. అందరూ ఆశ్చర్యపోతారు. తర్వాత వినోద్‌, చిత్ర వేరే వేరే గదుల్లో ఉంటారు. ఇప్పుడే ఇంటికి వచ్చిన అమర్‌ వాళ్లను చూసి ఆశ్చర్యపోతాడు. పైకి భాగీ దగ్గరకు వెళ్తాడు.

అమర్‌: ఏమైంది..?

భాగీ: దేనికి ఏమైంది

అమర్‌: వినోద్‌, చిత్ర వేరే వేరే రూంలో ఉన్నారెందుకు..?

భాగీ: అంతా మీ వల్లే

అమర్‌: నావల్లా.. నా వల్ల ఏమైంది..?

భాగీ: మీకు నాకు శోభనం జరిగితే తప్పా వాళ్లకు శోభనం చేయకూడదట. ఒకవేళ అలా జరిగితే చిత్ర ప్రాణానికే ప్రమాదం అంట

 అంటూ భాగీ చెప్పగానే.. అమర్‌ కు ఎం చెప్పాలో అర్థం కాదు. అలాగే భాగీని చూస్తుండిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!