Nindu Noorella Saavasam Serial Today Episode: బెస్ట్ కపుల్ కాంపిటీషన్‌లో మొదటి రౌండ్ పూర్తివుతుంది. మొదటి రౌండ్‌లో ఓడిపోయినందుకు భాగీ బాధగా ఉంటుంది. భాగీని చూసిన చిత్ర దగ్గరకు వచ్చి అమర్‌ను వినోద్ దగ్గరకు వెళ్లమని చెప్తుంది. అమర్ వెళ్లిపోతాడు.
చిత్ర: ఏంటి భాగీ ఒక్కసారికే ఇలా డల్లుగా అయిపోతే ఎలా..? ఇక కాంపిటీషన్ అయిపోయే సరికి ఎలా అయిపోతావో ఏమో.. భాగీ తోడికోడలిగా నీకో సజెషన్.. ఫ్లీజ్ ఓడిపోయినప్పుడు మాత్రం నువ్వు ఏడవకే.. గెలిచాక కప్పు ఎత్తుకుంటే నా పరువు పోతుంది. ఓడిపోతున్నాను అన్న బాధ నీ కళ్లల్లో ముఖంలో చూస్తుంటే.. అప్పుడే గెలిచినంత ఆనందంగా ఉంది నాకు. గెలిచినప్పుడు చూద్దాం
దీంతో భాగీ కోపంగా చిత్రను చూస్తూ బయటకు వెళ్తుంది. అంజును కిడ్నాప్ చేయడానికి ఇంట్లోకి వచ్చిన రౌడీలను మనోహరి అడ్డగిస్తుంది. రివాల్వర్ తీసుకుని చంపేస్తానని బెదిరిస్తుంది. దీంతో రౌడీలు బయటకు పారిపోతారు. గార్డెన్ లో కూర్చుని ఆరు అంతా చూస్తూ నవ్వుకుంటుంది.
ఆరు: చెప్పాను కదా గుప్త గారు మనునే నా పిల్లలను కాపాడుతుంది అని. నా పిల్లల ప్రాణాలు తీయాలనుకున్న మనోహరే ప్రాణాలకు తెగించి మరీ నా పిల్లలను కాపాడింది. ఈ సీన్ చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వావ్ వాట్ ఏ సీన్
రణవీర్: అరేయ్ ఏమైందిరా పాపను తీసుకురమ్మంటే మీరు పరుగెత్తుకుంటూ వస్తున్నారు
రౌడీ: మమ్మల్ని మనోహరి కొట్టి అడ్డుపడిందన్న
రణవీర్: అడ్డొస్తే ఏం చేయాలో చెప్పాను కదా
రౌడీ: ఆవిడ అదే అన్నారు సార్.. పిల్లల మీద చేయ్యి వేస్తే షూట్ చేస్తా అన్నారు. ఏదో చిన్న కిడ్నాప్ అంటే వచ్చాము అన్న మరీ ఇలా గన్‌తో కాల్చేస్తాం అంటే మా వల్ల కాదు అన్న
రణవీర్: మనోహరి.. నీ అంతు చూస్తా..
లాయరు: రణవీర్ ఆగు..
రణవీర్: నువ్వుండు లాయరు.. ఆ మనోహరి అంతు చూసి ఇప్పుడే అంజలిని తీసుకొస్తాను
లాయరు: రణవీర్ ఆగు.. నా మాట విను.. మనోహరి గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. ఇప్పుడు నువ్వు లోపలికి వెళితే నిన్ను కాల్చడానికి క్షణం కూడా ఆలోచించదు. చీకటి పడనివ్వు చీకటే మన ఆయుధం
రణవీర్: ఇవాళ అంజలిని తీసుకుపోకుండా నువ్వు నన్ను ఆపలేవు మనోహరి
అనుకుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతారు. చిత్ర మాటలకు కోపంగా భాగీ బయట ఉన్న అమర్ వద్దకు వెళ్తుంది.
అమర్: ఏంటి భాగీ చాలా కోపంగా కనిపిస్తున్నావు
భాగీ: వదలను అని మాటలు చెప్పి అక్కడ చిత్ర దగ్గర నన్ను వదిలేసి వస్తావా..?
అమర్: చిత్ర మాటలు గాటుగా ఉన్నా దానికి ధీటైన సమాధానం నువ్వు ఇస్తావు అనుకున్నాను
భాగీ: అమ్మో ఏమో అనుకున్నాను కానీ మీకు బాగా మాటలు వచ్చండి.. ఈ మాటలకే అనుకుంటా..? అక్క పడిపోయినట్టు ఉన్నారు
అంటూ భాగీ గొడవ పడుతుంటే ఇంతలో ఈవెంట్ మేనేజర్ వచ్చి రెండో రౌండ్ స్టార్ట్ అవుతుందని రెండో రౌండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాడు. అందరూ రెండో రౌండ్‌కు రెడీ అవుతారు. తర్వాత చీకటి పడ్డాక రణవీర్ గన్ తీసుకుని అమర్ ఇంటికి వెళ్తాడు. అప్పుడే బయటకు వచ్చిన మనోహరి గన్ ఎయిమ్ చేస్తాడు.
రణవీర్: మర్యాదగా పిల్లలు ఉన్న గది తాళం ఇవ్వు మనోహరి
అని బెదిరించడంతో మనోహరి వద్దు రణవీర్ అంటూనే భయంగా కీస్ ఇస్తుంది. తాళం తీసి రూంలోకి వెళ్లిన రణవీర్‌కు అక్కడ అంజు కనిపించదు. రణవీర్ కోపంగా మనోహరిని తిడుతుంటే ఇంతలో పెద్ద గాలి వచ్చి మనోహరి ఇంటికి కట్టిన రక్ష తెగిపోతుంది. దీంతో ఆరు ఇంట్లోకి వచ్చి రణవీర్‌ను కొడుతుంది. మనోహరి, రణవీర్‌కు వార్నింగ్ ఇస్తుంది. ఆరును చూసిన రణవీర్, మను భయంతో వణికిపోతుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!