Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌, మనోహరిని ఎంక్వైరీకి పిలవడంతో రాథోడ్‌ హ్యాపీగా ఫీలవుతూ భాగీకి వెంటనే విషయం చెప్పాలని కాల్‌ చేస్తాడు. కాల్‌ లిఫ్ట్‌ చేసిన భాగీ ఏంటి విషయం అని అడుగుతుంది.

రాథోడ్‌: నీకో గుడ్‌ న్యూస్‌ మిస్సమ్మ..  మా సారు మనోహరి మేడం గారిని ఎంక్వైరీకి పిలిచారు

భాగీ: ఏం మాట్లాడుతున్నావు రాథోడ్‌ ఆయన మనోహరిని ఎక్వైరీకి పిలిచాడా..? కానీ ఎందుకు..? ఏం జరిగిందని..?

రాథోడ్‌: తెలియదు మిస్సమ్మ నేను ఆఫీసుకు రాగానే చాలా సీరియస్‌గా ఉన్నారు. మనోహరి మేడం బయట ఉన్నారా..? అని అడిగారు. ఉన్నారని చెప్పగానే లోపలికి తీసుకురమ్మని చెప్పారు. మిస్సమ్మ మా సారు మనోహరి మేడం గారికి టీ ఆఫర్‌ చేశారు..

భాగీ: పిలిచి టీ ఇస్తే ఎంక్వైరీ చేసినట్టా

రాథోడ్‌: అయ్యో మిస్సమ్మ మా సారు టీ ఇచ్చారు అంటే తాట తీయబోతున్నారని అర్థం అది మా సారు స్టైల్‌. నువ్వు ఎప్పుడు మా సార్‌ ఎంక్వైరీ చూడలేదు కాబట్టి నీకు అర్థం కావడం లేదు

భాగీ: అవునా.. ఆయనకు కూడా మనలాగే అనుమానం వచ్చిందా..?

రాథోడ్‌: చూస్తుంటే అలాగే ఉంది మిస్సమ్మ ఆధారాల కోసం ఆగినట్టు ఉన్నారు. అందుకే అన్ని సమకూర్చుని ఇప్పుడు పలిచినట్టు ఉన్నారు

భాగీ: ఎంత మంచి న్యూస్‌ చెప్పావు రాథోడ్‌.. ఎంక్వైరీ అయ్యేలోపు సంకెళ్లతో మను బయటకి వచ్చిందన్న న్యూస్‌ కోసం వెయిట్‌ చేస్తుంటాను

రాథోడ్‌: సరే మిస్సమ్మ ఏం జరిగిందో నీకు ఫోన్‌ చేసి చెప్తాను ఉంటాను మరి

అంటూ కాల్ కట్‌ చేస్తాడు. భాగీ హ్యపీగా నవ్వుకుంటూ మను నీ కథ అంతే ఇక అనుకుంటూ లాన్‌లోకి వెళ్లి ఆరును  పిలుస్తుంది. భాగీ హ్యపీగా రావడం చూస్తాడు గుప్త.

గుప్త: బాలిక నీ సోదరి వచ్చిన వేగం చూస్తుంటే.. ఆ అనాథ పిల్ల పిచ్చుకలకు ఇవ్వాల్సిన ధనం సమకూరినట్టు ఉంది

ఆరు: ఏంటి అప్పుడేనా..? భాగీ ఇక్కడ

భాగీ: అక్కా నీకో గుడ్‌ న్యూస్‌

ఆరు: చెప్పు ఏంటా గుడ్‌ న్యూస్‌.. ఆ యాభై లక్షలు సెట్‌ అయ్యాయా..?

భాగీ: లేదక్కా నేను చెప్పాలనుకున్న  గుడ్‌న్యూస్‌ అది కాదు. మా ఆయన మనును ఎంక్వైరీ చేస్తున్నారట

ఆరు: మనును ఎంక్వైరీ చేస్తున్నారా..? ఏ విషయం గురించి

భాగీ: తెలియదు అక్కా…  ఇందాక రాథోడ్‌ ఫోన్‌ చేశాడు.  ఆయన సీరియస్‌గా మనును పిలిపించి ఏవేవో క్వశ్చన్స్‌ వేస్తున్నారట.. నాకు తెలిసి పెద్ద సీరియస్‌ మ్యాటరే అక్కా నాకెందుకో మను బ్యాడ్‌ టైం.. మన గుడ్‌ టైం స్టార్ట్‌ అయ్యాయి అనిపిస్తుంది అక్క

అనుకుంటూ ఇద్దరూ హ్యపీగా డాన్స్‌ చేస్తారు. మరోవైపు తన రూంలో కూర్చున్న మనోహరికి చెమటలు పడుతుంటాయి. అది గమనిస్తాడు అమర్‌.

అమర్‌: నేను మాట్లాడాలి అనగానే ఎందుకు అంత టెన్షన్‌ మనోహరి

మను: టెన్షన్‌ నాకు ఏం లేదు అమర్‌

అమర్‌: మరి అంత చెమట ఎందుకు పడుతుంది..

మను: ఫ్యాన్‌ అమర్‌ ఫ్యాన్‌ స్పీడుగా తిరగడం లేదు..

అమర్‌: నా రూంలో ఫ్యాన్‌ లేదు మనోహరి.. ఏసీ ఉంది. అది కూడా ట్వంటీ టూలో ఉంది. అంత టెంపరేచర్‌ లో కూడా నీకు స్వెట్‌  వస్తుందంటే టెన్షన్‌ పడుతున్నావు. ఏం మనోహరి నన్ను చూస్తే టెన్షన్‌ పడాల్సిన అవసరం ఏమైనా ఉందా..?

మను: ఏం లేదు అమర్‌..

అమర్‌ గన్‌ తీసి టేబుల్‌ మీద పెడతాడు. మనోహరి మరింతగా భయపడుతుంది.

అమర్‌: అవును మనోహరి.. నువ్వు కోల్‌కతా ఎందుకు వెళ్లావు..? రెండేళ్లు ఎక్కడ ఉన్నావు..? ఏం పని చేశావు..? ఎవ్వరినైనా ఇష్టపడ్డావా..? పెళ్లి చేసుకున్నావా..?

అంటూ అమర్‌ ప్రశ్నల మీద ప్రశ్నలు అడగ్గానే మనోహరికి చచ్చేంత భయం వేస్తుంది. రణవీర్‌ను తాను పెళ్లి చేసుకున్న విషయం గుర్తు చేసుకుంటుంది. ఆ భయంతో మనోహరి మరింత వణికిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!