Nindu Noorella Saavasam Serial Today Episode: ఆశ్రమంలో ఉన్న సరస్వతి దగ్గరకు పోస్ట్‌మ్యాన్‌ వచ్చి రిజిస్టర్‌ పోస్ట్‌ వచ్చిందని ఇచ్చి వెళ్తాడు. ఆ లెటర్‌ చూసిన సరస్వతి హ్యాపీగా ఫీలవుతూ.. లోపలికి భాగీ దగ్గరకు వెళ్తుంది. నవ్వుతూ భాగీకి లెటర్‌ ఇస్తుంది. ఆ లెటర్‌ చూసి  భాగీ షాక్‌ అవుతుంది.

Continues below advertisement

సరస్వతి: ఏంటమ్మా ఏంటి..? లెటర్‌ చదివి సంతోషపడతావు అనుకుంటే షాక్ అయ్యావేంటి..?

భాగీ: ఇది ఎలా సాధ్యం మేడం బుజ్జమ్మకు మిలటరీ స్కూల్‌ లో సీటు వచ్చిందా..?

Continues below advertisement

సరస్వతి: ఎందుకు సాధ్యం కాదు. ఆరుకు ఏం తక్కువని చాలా తెలివైన చురుకైన పిల్ల చక్కగా చదువుతుంది. ఏకసంతాగ్రాహి. ఇన్ని క్లాలిటీస్‌ ఉన్న పిల్లకు సీటు ఇవ్వడం ఆ స్కూల్‌ కే గర్వకారణం..

భాగీ: కానీ నేను ఆ స్కూల్‌కు అప్లయ్‌ చేయలేదు.. బుజ్జమ్మ ఎంట్రన్స్‌ రాయలేదు అలా ఎలా సాధ్యం అవుతుంది మేడం.

సరస్వతి: మన ఆశ్రమం తరపున నేనే అప్లయ్‌ చేశానమ్మ మిగతా పిల్లలతో పాటు ఆరు కూడా ఎంట్రన్స్‌ రాసింది.

భాగీ: ఇదంతా ఎప్పుడు జరిగింది మేడం నాతో ఎందుకు చెప్పలేదు మీరు

సరస్వతి: నిన్ను సర్‌ఫ్రైజ్‌ చేద్దామని చెప్పలేదు అమ్మ.. ఆరు రెండు తెలుసు రాష్ట్రాల్లో మెరిట్‌ స్టూడెంట్‌ గా ఫస్ట్‌ ర్యాంకులో పాస్‌ అయింది. ఆ స్కూల్‌ వాళ్లు స్కాలర్‌షిప్‌ కూడా ఇస్తామంటున్నారు.. ఆరు ప్రతిభకు తగ్గ స్కూల్లో తనకు స్థానం దొరికింది. నాకు చాలా సంతోషంగా ఉంది.

భాగీ: కానీ నాకు చాలా భయంగా ఉంది మేడం

సరస్వతి: ఎందుకు భయం అమ్మ 

భాగీ: అది మిలటరీ స్కూల్‌.. పైగా అది ఉండేది హైదరాబాద్‌లో

సరస్వతి: అయితే ఏంటమ్మా..? హైదరాబాద్‌ నీకు తెలియని ఊరా..? అక్కడ నీకేంటి భయం

భాగీ: ఏంటి మేడం అన్ని తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారు.. ఏ కారణం చేత అయితే నేను ఆ ఇంటిని హైదరాబాద్‌ ను వదిలేసి వచ్చానో మీకు తెలుసు కదా..? మళ్లీ బుజ్జమ్మను తీసుకుని నేను ఎలా వెళ్లగలను.. నేను ఆయన కంట్లో కానీ పిల్లల కంట్లో కానీ పడితే ఇంకేమైనా ఉందా మేడం..

సరస్వతి: నీ భయం నాకు అర్థం అయింది భాగీ కానీ ఇది అరుంధతి భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఆలాంటి పెద్ద స్కూల్‌ లో చదివితే ఆరు ఫీచర్‌ చాలా బాగుంటుంది

భాగీ: కానీ అమ్ము భవిష్యత్తు ఏం కావాలి మేడం.. మేము అక్కడకు వెళ్లాక అమ్ముకు ఏమైనా అయితే..?

సరస్వతి: మీరు ఆ ఇంటికి వెళ్లోద్దు.. అక్కడ మన ఆశ్రమంలోనే ఉండండి.. అప్పుడు ఏ సమస్య ఉండదు.. అక్కడ రాజు గారు ఉంటారు. మీకు కావాల్సిన వన్నీ చూసుకుంటారు..

భాగీ: ఒకే ఊర్లో రెండేళ్ల పాటు ఒకరికొకరు ఎదురుపడకుండా..? ఎలా ఉంటాము మేడం.. నేను కనిపించిన మరుక్షణం ఆయన ఇంటికి తీసుకెళ్తారు.. అప్పుడు అమ్ము పరిస్థితి ఏంటి మేడం..

సరస్వతి: ఆ దేవుడి మీద భారం వేయ్‌ భాగీ అంతా ఆయనే చూసుకుంటారు

భాగీ: ఆ దేవుడే కదా మేడం మాకు ఇలాంటి శాపం ఇచ్చింది. మళ్లీ ఆయన్నే నమ్ముకుని ఎలా వెల్లమంటారు…

సరస్వతి: అలా అని ఎంతో భవిష్యత్తు ఉన్న అరుంధతిని నువ్వు ఇక్కడే ఉంచుతానంటే నేను ఒప్పుకోనమ్మా..? మన నమ్మకాల కోసం పిల్లల ఫీచర్‌ పాడు చేయకూడదు ఇంకేం మాట్లాడకు భాగీ.. తనని వెంటనే స్కూల్‌ లో అడ్మిట్‌ చేయమని ఆ స్కూల్‌ వాళ్లు లెటర్‌ పంపించారు.. మీ ఇద్దరికి బస్‌ టికెట్‌ బుక్‌ చేశాను. వెంటనే బయలుదేరండి

అని చెప్పి సరస్వతి వెళ్లిపోతుంది. తర్వాత భాగీ, బుజ్జమ్మను హైదరాబాద్‌ బస్సులో పంపిస్తుంది సరస్వతి. బస్సులో భాగీ, బుజ్జమ్మ వెళ్తుంటారు. ఒక బస్టాండు దగ్గర కొంత మంది మిలటరీ వాళ్లు అమర్‌ తో ఫోన్‌ మాట్లాడుతూ అదే బస్‌ ఎక్కుతారు. బ్యాగ్‌ పైన పెడుతుంటే ఆయన చెవి దగ్గర ఉన్న ఫోన్‌ కిందపడిపోతుంది. వెంటనే బుజ్జమ్మ చేతితో ఫోన్‌ పట్టుకుని మీరు బ్యాగ్‌ పెట్టుకోండి అంకుల్‌ ఫోన్‌ నేను పట్టుకుంటాను అని చెప్తుంది. అప్పుడే అమర్‌ హలో విక్రమ్‌ అంటే.. బుజ్జమ్మ హలో అంటుంది. ఆ పిలుపునకు అమర్‌ షాక్ అవుతాడు. బుజ్జమ్మ కడుపులో ఉన్నప్పుడు నాన్న అంటూ పిలిచిన వాయిస్‌ గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!