Nindu Noorella Saavasam Serial Today Episode: అమ్ము కోసం ఇంట్లోంచి వెళ్లిపోయిన భాగీ, సరస్వతి వార్డెన్ దగ్గరకు వెళ్లితే ఆమె తమ మరో ఆశ్రమంలో భాగీ సీక్రెట్‌గా బతికేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇలా ఐదేళ్లు గడచిపోతాయి. ఒకరోజు ఆ ఆశ్రమానికి సరస్వతి వస్తుంది. భాగీ దగ్గరకు వెళ్తుంది. భాగీ పిల్లలను రెడీ చేస్తుంటుంది.
భాగీ: పిల్లల డ్రెస్ ఎలా ఉంది మేడం
సరస్వతి: ఈ పిల్లల అలంకరణ బాగానే ఉందమ్మా కానీ మిమ్మల్ని చూస్తుంటేనే నాకు బాధగా ఉంది.
భాగీ: నాకేమైంది మేడం
సరస్వతి: రాధ పిల్లలను ఇక్కడి నుంచి తీసుకెళ్లు.. ( పిల్లుల వెళ్లిపోతారు) ఎలా ఉండే దానివి ఎలా ఉన్నావమ్మా.. రాణివాసంలో హాయిగా ఉండాల్సిన మీరు అయిదు సంవత్సరాలుగా మీ భర్తకు మీ ఇంటికి, మీ బంధువులకు దూరంగా ఇలా ఈ కుటీరంలో సాదా సీదా జీవితం గడుపుతున్నారు. మీరు ఇక్కడ ఉంటున్నట్టు మీ వాళ్లు ఎవ్వరికీ తెలియకుండా అజ్ఞాతవాసం చేస్తున్నారు. అన్నం పెట్టిన ఇల్లు అడవి అవుతుందని… దానం చేసిన మనిషి దరిద్రుడు అవుతాడని ఎవరో చెప్తే విన్నాను. కానీ మీ పరిస్థితి చూశాక ఆ నానుడి నిజమే అనిపిస్తుంది
భాగీ: అయ్యో మేడం మీరెందుకు అలా అనుకుంటున్నారు. నేను ఇక్కడ బాగానే ఉన్నాను కదా..?
సరస్వతి: ఏం బాగుండటం అమ్మా నా అన్నవాళ్లు లేని అనాథలే ఇక్కడ ఉంటారు. కానీ మీకు అందరూ ఉండి కూడా ఇక్కడ అనాథగా బతుకుతున్నారు. ఈ ఆశ్రమం కోసం మీరు ఎంతో చేశారు. కానీ చివరకు మీరే ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. నాకు చాలా బాధగా ఉందమ్మా..
భాగీ: నేను ఇక్కడ ఉంటున్నది అమ్ము కోసం మేడం. తను క్షేమంగా ఉండాలి. నిండు నూరేళ్లు బతకాలని ఏడేళ్లు ఆజ్ఞాతవాసానికి వచ్చాను. అయిదేళ్లు గడిచిపోయాయి. ఇంకో రెడేళ్లు గడిచిపోతే నా ఇంటికి నేను వెళ్లిపోవచ్చు
సరస్వతి: ఇలా మిమ్మల్ని ఆ ఇంటికి దూరం చేయడం మనోహరి కుట్రేమోనని నాకు అనుమానంగా ఉందమ్మా..? తను అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగిస్తుంది
భాగీ: తను కుట్ర చేసి ఉండొచ్చు.. చేయకపోయి ఉండొచ్చు.. నాకు పుట్టిన బిడ్డ వల్ల అమ్ముకు ప్రాణాపాయం ఉండొచ్చు.. ఉండకపోవచ్చు కానీ ఆ టైంలో ఏమీ ఆలోచించలేదు మేడం.. అందుకే ఎవ్వరికీ చెప్పకుండా బిడ్డను తీసుకుని దూరంగా వచ్చేశాను
సరస్వతి: మిమ్మల్ని ఇలా ఆ ఇంటి నుంచి దూరం చేయడం మనోహరి ఉద్దేశం అయి ఉండొచ్చు కదా..? మీ భర్తను ఆ ఇంటిని సొంతం చేసుకోవడానికి మనోహరి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది.
భాగీ: ఆ విషయం నాకు తెలుసు మేడం కానీ పంతులు గారు చాలా గట్టిగా చెప్పారు. పైగా నేను అక్కడ ఉండగానే అమ్ము రెండు సార్లు చావు అంచుల దాకా వెళ్లింది. ఇక నేను అక్కడ ఉండటం ఎంతమాత్రం మంచిది కాదని నేను వచ్చేశాను. పిల్లలను ఆయన చూసుకుంటారు మేడం..
సరస్వతి: పిల్లలను మీవారు చూసుకుంటారు అమ్మా.. కానీ మీ వారిని ఎవరు చూసుకుంటారు పైగా అప్పుడే పుట్టిన ఆ పసిబిడ్డను తండ్రికి తోబుట్టువులకు దూరంగా ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్లు ఎంత బాధపడి ఉంటారు. వాళ్లకు దూరంగా వచ్చి మీరు ఎంత బాధపడి ఉంటారు. ఆనాడు రాముల వారికి సీతమ్మ, లవకుశులు దూరం అయినట్టు ఈనాడు మీరు మీ బిడ్డ మీ భర్తకు దూరం అయ్యారు
భాగీ: ఇంకెన్నేళ్లు మేడం రెండేళ్లు ఆగితే అందరం కలిసి ఉంటాం.. మా గురించి మీరేం బాధపడకండి.. మా కోసం హైదరాబాద్ ఆశ్రమం నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. మీకెంతగానో రుణపడి ఉన్నాం..
అంటూ భాగీ ఎమోషనల్ అవుతుంటే.. సరస్వతి మాత్రం లేదమ్మా.. మేమే మీకు చాలా రుణపడి ఉన్నాం.. ఆ రుణం ఇలా తీర్చుకుంటున్నాం.. ఇంతకీ ఆరు ఎక్కడుంది అని అడగ్గానే.. కృష్ణుడి గెటప్‌లో ఉన్న ఆరు ఎంట్రీ ఇస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!