Nindu Noorella Saavasam Serial Today February 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: భాగీని తట్టిన అమర్ - హ్యాపీగా ఫీలయిన మనోహరి
Nindu Noorella Saavasam serial Today Episode February 24th: మనోహరి చేత భాగీకి ఫోన్ చేయించి తిడతాడు అమర్. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్ పాప కోసం ఎలాగైనా భాగీతో మాట్లాడాలి అనుకుంటాడు. అయితే తాను ఫోన్ చేస్తే బాగుండదని ఫీలవుతూ మనోహరిని ఫోన్ చేయమని చెప్తాడు. మనోహరి షాక్ అవుతుంది. ఇక ఆశ్రమంలో భాగీ, అమర్ ఫోన్ కోసం ఎదురుచూస్తుంటుంది.
అమర్: తనకు ఫోన్ చేయ్ మనోహరి. పాప గురించి అడుగు
రాథోడ్: (మనసులో) ఫోన్ చేయమన్నది అక్కడ మిస్సమ్మ ఆల్‌రెడీ వెయిటింగ్
కరుణ: అవునే నీకు ఈ పాటికి ఫోన్ రావాలి కదా ఇంకా రాలేదేంటి..?
ఫోన్ రింగ్ అవుతుంది.
రాజు: అదిగో నువ్వు అన్నవో లేదో ఫోన్ వచ్చేసిందమ్మా..?
కరుణ: భాగీ ఇక నీ యాక్టింగ్ క షురూ చేయ్.. ఆ తాటకికి చుక్కలు చూపించు.
భాగీ: హలో
మనోహరి: హలో భాగీ
భాగీ: చెప్పు మనోహరి
మనోహరి: ఎలా ఉన్నావు
భాగీ: రాముడు లేని సీత ఎలా ఉంటుంది. పువ్వులు లేని మొగ్గ ఎలా ఉంటుంది. ఆకులు లేని చెట్టు ఎలా ఉంటుంది. నేను అలాగే మోడుబారిపోయాను మనోహరి. ఏడారిలో ఒయాసిస్ కోసం ఎండమావుల వెంట వెతుకుతూ ఉన్నట్టు ఉంది నా పరిస్థితి ఏం చెప్పమంటావు
చంభా: (మనసులో) భాగీ నటన మొదలు పెట్టింది. ఇక ఈ మనోహరికి పులిహోరే
మనోహరి: అయ్యో నువ్వు అంత బాధలో ఉన్నవా..? భాగీ..
భాగీ: అవును ఎంత బాధలో ఉన్నానో ఎలా చెప్పను మనోహరి. నా బాధ చెప్తే కథ అవుతుంది. రాస్తే కవిత అవుతుంది. తీస్తే పెద్ద సినిమా అవుతుంది. తీస్తూనే ఉంటే సీరియల్ కూడా అవుతుంది.
అమర్: తను తన ఓవరాక్షన్.. పాయింట్ కు రా మనోహరి
భాగీ: ఏంటి మనోహరి ఆయన గొంతు పెద్దగా వినిపిస్తుంది. ఓ ఫోన్ స్పీకర్ లో పెట్టావా ఏంటి..?
మనోహరి: అంటే ఇక్కడ నేను అమర్, రాథోడ్, పిల్లలు, యాదమ్మ అందరం ఉన్నాం భాగీ
భాగీ: అక్కడ అందరూ ఉన్నారు.. కానీ నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను.. మీ అందరినీ మిస్ అవుతున్నాను మనోహరి..
అమర్: కావాలని వెళ్లిపోయి మళ్లీ ఒంటరిగా ఉన్నానని మిస్ అవుతున్నానని చెప్తున్నావా..? అన్ని అబద్దాలే..
భాగీ: నేను చెప్తున్నవన్నీ నిజాలండీ..
అమర్: నేను మాట్లాడుతుంది నీతో కాదు
భాగీ: కానీ నాకే వినిపిస్తుంది కదండి
అమర్: మనోహరి పాప గురించి అడుగు
మనోహరి: భాగీ పాప ఎక్కడ ఉంది..?
భాగీ: ఏ పాప మనోహరి
మనోహరి: అదే నీకు అమర్ కు పుట్టిన పాప
భాగీ: తను కేవలం నా పాప కాదు మనోహరి.. తను నా కంటి పాప, నా ఇంటి వెలుగు, నా ఒంట్లో ప్రాణం.. మళ్లీ పుట్టిన నా అక్క
మనోహరి: ఆ పాప కావాలని అమర్ అడుగుతున్నాడు.
భాగీ: నా పాప ఆయనకెందుకు
అమర్: ఎందుకు అంటుందేంటి..? ఆ పాప తనకు మాత్రమే కాదు నాకూ కూతురే.. నా కూతురు నా దగ్గరే ఉండాలి
భాగీ: మీకు నలుగురు పిల్లలు ఉన్నారు కదా… మళ్లీ ఐదో పాప అవసరమా..?
అమర్: నా కూతురు నాకు అవసరం మర్యాదగా నా కూతురును నాకు ఇవ్వు
భాగీ: నీకు నేను అక్కరలేదు కానీ నా కూతురు కావాలా..?
అమర్: ఇంట్లోంచి వెళ్లిపోయింది నువ్వు.. నాకు నా పాప కావాలి
భాగీ: పాప లేకపోతే నేను బతకలేను
అంటూ భాగీ బాధపడుతుంటే.. భాగీ ఒక పని చేయ్ పాపను తీసుకుని నువ్వు కూడా ఇంటికి వచ్చేయ్ అని ఫ్లో లో చెప్పేస్తుంది మనోహరి. అందరూ షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!























