Nindu Noorella Saavasam Serial Today Episode:   అనామిక బట్టలు సర్దుతుంటే రాథోడ్‌ వెళ్తాడు. ఏం చేస్తున్నావని అడుగుతూనే ఓ బట్టలు సర్దుతున్నావా..? సర్దుకో అని చెప్తాడు. వెనక నుంచి తొంగి చూస్తున్న భాగీ కూడా లోపలికి వెళ్లి హాయ్‌ అనామిక అంటుంది. రాథోడ్‌ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా..? అంటుంది.

రాథోడ్‌: ఈ రూమ్‌ లక్కీ అంట చూసుకోండి ( మెల్లగా అంటాడు)

భాగీ: మీకేం కావాలన్నా.. నన్ను అడగండి..

అనామిక: ఓకే మిస్సమ్మ గారు..

భాగీ: పిల్లలకు టైం అయింది కదా..?

అనామిక: అవును పిల్లలు చెప్పారు.

భాగీ: అయితే మీరు ఆ టైమింగే ఫాలో అయిపోండి.

అనామిక: ఆ ఓకే కానీ పొద్దున్నే ఆ టైంకి లేవడం ఓకేనా.? ఆ టైంకి లేస్తే పిల్లల డే కంగారుగా స్టార్ట్‌ అవుతుంది కదా..? కొంచెం టైం మార్చోచ్చా..?

భాగీ: పిల్లలు ఐదున్నరకు లేవడం గురించి అనుకుంటా ( అని మనసులో అనుకుంటుంది) బాగా ఎర్లీగా లేస్తున్నారు కదా? నాక్కూడా పిల్లలను అంత ఎర్లీగా నిద్రలేపడం అసలు ఇష్టం ఉండదు. కానీ ఇది అయన రూల్‌

అనామిక: ఏంటి ఏడున్నర ఎర్లీ మార్నింగా..? మరి ఐదున్నరను వీళ్ల భాషలో ఏమంటారో..? పిల్లల వన్‌ అవర్‌ స్టడీ చాలు అన్నారు కదా..? కొంచెం ఏమైనా పెంచుదామేమో అడుగుదాం ( అని మనసులో అనుకుంటుంది) పోనీ పిల్లలకు స్టడీ అవర్స్‌ ఏమైనా కొంచెం పెచుదామా..?

భాగీ: ఆల్‌ రెడీ ఎగ్జామ్స్‌ అని పిల్లలు ప్రెషర్‌ ఫీలవుతుంటారు. అవేం అక్కర్లేదు.. మీరు బ్లైండ్‌గా ఫాలో అయిపోండి.

అనామిక: ఓకేనా..? సరే..

ఇంతలో బయటి నుంచి అమర్‌ మిస్సమ్మ అని  పిలుస్తాడు. దీంతో అనామిక సార్‌ కూడా మిమ్మల్ని ఎందుకు మిస్సమ్మ అని పిలుస్తున్నారు అని అడుగుతుంది. దీంతో రాథోడ్ మెల్లగా ఆమెకు కూడా డౌటు వచ్చింది మిస్సమ్మ ఇక నువ్వు జాగ్రత్తపడాలి అంటాడు.  కోపంగా బయటకు వెళ్దాం పద రాథోడ్‌ అని బయటకు వచ్చాక ఆయనతో కూడా నన్ను పేరు పెట్టి పిలిచేలా చేస్తాను అంటూ రాథోడ్‌ తో చాలెంజ్‌ చేసి అమర్‌ రూంలోకి వెళ్తుంది భాగీ.

అమర్‌: మిస్సమ్మ నా బుక్‌ ఎక్కడ పెట్టావు.. ( భాగీ బుక్‌ తెచ్చి ఇస్తుంది.) థాంక్స్‌ మిస్సమ్మ.. ఏమైనా చెప్పాలా..?

భాగీ: చెప్పాలి.. అడగాలి.. అరవాలి..సమాధానం కావాలి. మార్పు జరగాలి.

అమర్‌: ముందు నువ్వు గాలి తీసుకుని మాట్లాడతావా…

భాగీ: మీరు అందరిలాగా నన్ను మిస్సమ్మ అని పిలవడం నాకు ఇష్టం లేదు.

అమర్‌: నాక్కూడా నచ్చడం లేదు. అది నీకసలు సూటు అవడం లేదు కూడా..?   

భాగీ: అవునా..? అయితే మరి నాకు సూటయ్యే పేరేంటో మీరే చెప్పండి..

అమర్‌: చెప్పడం ఎందుకు అటు తిరుగు పిలుస్తాను

అని చెప్పగానే భాగీ హ్యాపీగా అటు తిరిగి నిలబడగానే అమర్‌ ఏయ్‌ లూజ్‌ అటూ పిలుస్తాడు. భాగీ కోపంగా తిరిగి చూస్తుంది. ఏంటి నచ్చలేదా..? మెంటల్‌ ఇది ఇంకా బాగా సూటవుతుంది.  అనగానే భాగీ కోపంగా దిండు తీసుకుని మిమ్మల్ని ఎలాగూ కొట్టలేను అంటూ తనను తాను  కొట్టుకుంటుంది. ఇంతలో కాలు జారి కిందపడబోతూ అమర్‌ను పట్టుకుంటుంది. అమర్‌ మిస్సమ్మ మీద పడతాడు. ఇద్దరి మధ్య రొమాంటిక్‌ సన్నివేశం జరుగుతుంది. తర్వాత అమర్‌ నిన్ను ఇప్పటి నుంచి భాగీ అని పిలుస్తాను అని చెప్తాడు. హ్యాపీగా కిందకు వెళ్తుంది భాగీ. కింద ఉన్న రాథోడ్‌ వెటకారంగా మాట్లాడతాడు.

రాథోడ్‌: నా ప్రేమను తెలియపరుస్తానని చెప్పి వెళ్లి ఇప్పుడేంటి పిచ్చి దానిలా డాన్స్‌ చేసుకుంటూ వచ్చేస్తున్నావు.

భాగీ: ఇప్పుడు చూడు..

రాథోడ్‌: ఎప్పుడూ…

భాగీ:  వన్‌.. టూ..

రాథోడ్‌: త్రీ..

అమర్‌: భాగీ.. భాగీ.. భాగీ..

అని అమర్‌ పిలవగానే.. అందరూ విని షాక్‌ అవుతారు. మనోహరి ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది. భాగీ డాన్స్‌ చేస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!