Nindu Noorella Saavasam Serial Today Episode: ఇంట్లో ఆరు జాడ కనిపించడం లేదని బాబ్జితో కలిసి ఒక స్వామిజీని ఇంటికి తీసుకొస్తుంది మనోహరి. ఇంట్లోకి వచ్చిన స్వామిజీ ఆరు ఆత్మ తిరిగిన విషయం పసిగడతాడు. ఆత్మ ఈ ఇంట్లో తిరిగిందని.. అణువణువునా ఆత్మ తిరగిందన్న ఉనికి నాకు తెలుస్తుంది అని చెప్తాడు. అయితే ఆత్మ ఇప్పుడు ఇక్కడే ఉందా.? అని మనోహరి అడుగుతుంది. స్వామిజీ ఆత్మ ఇప్పుడు ఈ ఇంట్లో లేదని చెప్తాడు.
మనోహరి: అంటే శాశ్వతంగా భూలోకం నుంచి వెళ్లిపోయిందా..? లేదా..? ఇక్కడ లేకుండా ఇంకెక్కడైనా ఉందా..?
స్వామిజీ: ఆ అమ్మాయి ఫోటో తీసుకురండి..
మనోహరి: సరే… ఇదిగోండి స్వామి..
స్వామిజీ: ఆత్మ మానవ శరీరంలోకి ప్రవేశించింది.
మనోహరి: ఏంటి స్వామిజీ మీరు చెప్పేది. ఆత్మ మనిషిగా మారడం ఏంటి..? అసలు అలా ఎక్కడైనా జరుగుతుంది.
స్వామిజీ: కోట్లలో ఒక్కరికి.. శతాబ్దానికి ఒక్కరికి ఇలా జరుగుతాయి. ఆ అమ్మాయి పుణ్యానికి ఆ పరమేశ్వరుడే దిగివచ్చి ఆ అమ్మాయికి ఇచ్చిన వరమే ఈ పునర్జన్మ. జాగ్రత్తగా ఉండు మనోహరి.. నువ్వు చీకట్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.
మనోహరి: లేదు ఇలా జరగడానికి వీల్లేదు. అది ఇప్పుడు ఎక్కడ ఉంది మీరు కనిపెట్టి చెప్పండి..
స్వామిజీ: ఆ అమ్మాయి దారికి అడ్డు తప్పుకోవడం తప్పా.. ఇప్పుడు నువ్వేం చేయలేవు. కాదూ కూడదు అని పంతం పట్టుకుని కూర్చుంటే గతంలో ఒక పీడకలలా మారిపోతావు.
మనోహరి: అంటే ఇప్పుడది పంతం పట్టి నేరుగా నా మీద పగ తీర్చుకోవడానికే వస్తుందా..? అందరి ముందు నా నిజాలు బయటపెట్టేస్తుందా..?
స్వామి: బయట పెట్టాలంటే అరుంధతికి గతం గుర్తుండాలి కదా..? ఆత్మగా వేరే శరీరంలోకి ప్రవేశించిన అరుంధతికి గత జన్మ జ్ఞాపకాలు గుర్తుండవు. తన వాళ్లు ఎదురుగా ఉన్నా గుర్తు పట్టదు. కానీ గత జన్మ వస్తువులు తాకితే అరుంధతికి గతం గుర్తుకు వస్తుంది. జాగ్రత్త
అని చెప్పి స్వామిజీ వెళ్లిపోతాడు. స్వామిజీ మాటలు గుర్తు చేసుకుంటూ భయంతో వణికిపోతుంది. అరుంధతి నువ్వు మళ్లీ వచ్చావా..? అని కలవరిస్తుంది. మరోవైపు గుడిలో అందరూ పూజ దగ్గర కూర్చుని ఉంటారు. పల్లకి వస్తుంది.
భాగీ: మీకోసం దేవుడి కుంకుమ తీసుకొచ్చాను పెడతాను పట్టండి.
అమర్: నాకు కుంకుమ పెట్టుకోవడం ఇష్టం ఉండదు.
భాగీ: దేవుడి దగ్గరకు వచ్చి నచ్చింది చేస్తా… నచ్చనిది చేయను అంటే కుదరదు పతిదేవుడు గారు.
అమర్: లూజ్..
భాగీ బొట్టు పెడుతుంది. అమర్ తుడుచుకోవడానికి ట్రై చేస్తుంది.
భాగీ: ఏవండి కుంకుమ పెట్టాక తుడిచేస్తే పాపం
అని వెళ్లి పూజ దగ్గర కూర్చుంటుంది. పల్లకి వస్తుంది. పల్లకి మోస్తున్న ఒక వ్యక్తి కాలు జారి కింద పడతాడు. దీంతో పల్లకిలో ఉన్న దేవుడి విగ్రహాలు కింద పడబోతుంటే.. భాగీ వెళ్లి పట్టుకుంటుంది. ఇంకో పక్క నుంచి అనామిక వచ్చి పట్టుకుంటుంది.
పంతులు: శివరాత్రి రోజున శివయ్య సన్నిధిలో ఆయన కళ్యాణ వేడుకలో ఎంత అపశృతి జరగబోయింది. సమయానికి ఆయనే పంపించినట్టు వచ్చి ఆయన్ని కాపాడారు. ఎంతటి అదృష్టవంతులు అమ్మా మీరు.
అని చెప్పి వారిచేతనే ఆ విగ్రహాన్ని కళ్యాణ పీఠం వరకు తెప్పించి కళ్యాణం మొదలు పెడతారు. పూజ అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి బయలుదేరుతారు. ఇంట్లో ఆరు గురించి భయంతో ఆలోచిస్తూ కూర్చు్న్న మనోహరి కారు హారన్ సౌండ్ విని బయటకు వస్తుంది. కారులోంచి దిగి వస్తున్న అనామికను చూసి భయపడుతుంది. అచ్చం ఆరునే వచ్చినట్టు కలగంటుంది. అందరూ దగ్గరకు రాగానే.. అంజు, అనామికను మనోహరికి పరియం చేస్తుంది. మనోహరి భయంతో వణికిపోతుంది. ఇంతలో లోపలికి వెళ్తున్న అనామిక మెయిన్ డోర్‌ను టచ్ చేయగానే ఏదేదో గుర్తుకు వస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!