Nindu Noorella Saavasam Serial Today February 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: భాగీ కొత్త ప్లాన్ - మనోహరికి షాక్
Nindu Noorella Saavasam serial Today Episode February 17th: మనోహరికి చెక్ పెట్టేందుకు భాగీ కొత్త ప్లాన్ చేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి మళ్లీ ఏదో ప్లాన్ చేస్తుందని తనకు ఫోన్ చేసి భాగీ గురించి ఆరా తీసిందని కరుణ, భాగీకి చెప్తుంది. దీంతో మనోహరి ఫోన్ చేసి ఏం అడిగిందని భాగీ అడుగుతుంది.
కరుణ: నాకు కాల్ చేసి భార్యాభర్తలను కలపడం ఫ్రెండ్స్‌గా మన బాధ్యత అంటూ నీ అడ్రస్ చెప్పించడానికి మహానటిలా జీవించేసిందే..? నేను మాత్రం తక్కువ తిన్నానా..? అది రెండు ఆకులు చదివితే నేను పది ఆకులు చదివిన అది మహానటి అయితే నేను అంతకు మించి నటించిన నీ గురించి నాకేం తెలియదని చెప్పిన
భాగీ: ఇప్పుడే దానికి ఫోన్ చేయ్యవే
కరుణ: ఎందుకే ఫోన్..?
భాగీ: దానికి ఫోన్ చేసి నేను చెప్పినట్టు చెప్పు
అని భాగీ తన ప్లాన్ చెప్తుంది
కరుణ: ఇప్పుడు ఇదంతా అవసరమావే..
భాగీ: ఆట దానికే తెలుసని కాదు.. నాకు తెలుసని దానికి తెలియాలి
కరుణ: అది ప్రమాదకరమైన ఆటే. అది పాము లాంటిది. దాంతో చెలగాటాలు ఎందుకు చెప్పు..
భాగీ: దాని కోరలు పీకి పడగ చితక్కొట్టాలే నువ్వు ఫోన్ చేయ్
కరుణ, మనోహరికి ఫోన్ చేస్తుంది.
మనోహరి: చెప్పు కరుణ
కరుణ: సారీ మనోహరి
మనోహరి: సారీ దేనికి కరుణ
కరుణ: భాగీ గురించి తెల్వదు అని నీతో అబద్దం చెప్పినందుకు
మనోహరి: అయితే భాగీ ఎక్కడుందో నీకు తెలుసన్నమాట..?
కరుణ: అవును కానీ ఎక్కడ ఉంటదో తెల్వదు. కానీ రోజూ పది గంటలకు కూరగాయలు కొనడానికి మోండా మార్కెట్‌కు వస్తుంది.
మనోహరి: మార్కెట్‌కు వస్తుందా..?
కరుణ: అవును రెండు మూడు సార్లు దాన్ని గాన్నే చూసిన కానీ తను నన్ను చూడలేదు.. నేను కూడా దాన్ని కలవలేదు..
మనోహరి: నిజంగానే భాగీ రోజూ అక్కడకు వస్తుందా..?
కరుణ: అవును భార్యాభర్తలను కలపాలని నువ్వు నాకు చెప్పావు కదా..? అందుకే నీకు చెప్తున్నాను.. ఈ విషయం నేను అమరేంద్ర సార్‌కు కూడా చెప్పలేదు.
మనోహరి: నాకు చెప్పావు కదా ఇక నేను చూసుకుంటానులే థాంక్స్ కరుణ
కరుణ: ఇట్స్ ఓకే మనోహరి నువ్వు ఆ భార్యాభర్తలను కలుపుతాను అన్నావు కదా..? ఆ భార్యాభర్తలు కలిస్తే నాకు అంతే చాలు ఆ అయ్యో ఆల్రెడీ టైం అయిపోతుంది. టెన్ కల్లా అక్కడ ఉండాలి. లేదంటే భాగీ వెళ్లిపోతుంది (అని ఫోన్ కట్ చేస్తుంది.) ఇప్పుడేంటే నువ్వు అక్కడకు వెళ్తావా ఏంటి..?
భాగీ: పామును పట్టుకోవాలంటే వెళ్లాలి కదా
మరోవైపు
మనోహరి: ఓసేయ్ భాగీ దొరికావే.. చెప్తా నీ సంగతి
కరుణ: ఓసేయ్ దానితోన కొంచెం జాగ్రత్తనే
భాగీ: ఇప్పుడు అది నాతో జాగ్రత్తగా ఉండాలి
మనోహరి: ఇన్నాళ్లు నువ్వు దూరంగా ఉన్నావని ప్రశాంతంగా ఉన్నాను
భాగీ: నన్ను దూరం పెట్టిన దానికి ప్రశాంతత లేకుండా చేస్తాను..
మనోహరి: నువ్వు మళ్లీ దగ్గరకు వచ్చావు.. నాకు మళ్లీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి.
భాగీ: దాన్ని పాతాళానికి తొక్కి పడేస్తాను
మనోహరి: ఈసారి నిన్ను దూరంగా పంపించడం కాదే ఏకంగా పైకే పంపిస్తాను
భాగీ: దాన్ని ఆ ఇంటి నుంచి దూరంగా తరిమికొడతాను.. నా ఇంటికి నా భర్త, పిల్లలకు దగ్గర అవుతాను.
మనోహరి: ఈరోజు నీకు చావేనే
భాగీ: కాసేపట్లో దానికి మూడింది.
అంటూ కోప్పడుతుంటే.. కరుణ కోపంగా చూస్తుంది. ఇక ఆడవే నీ ఆట మొదలెట్టు అంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!






















