Nindu Noorella Saavasam Serial Today February 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: షూటర్‌ను తిట్టిన మనోహరి – భాగీని మెచ్చుకున్న కరుణ
Nindu Noorella Saavasam serial Today Episode February 13th: అమ్మవారి వేషంలో వెళ్లి షూటర్‌ను కొడుతుంది భాగీ. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: గుడిలో హోమం జరుగుతుంటే షూటర్‌కు చంభా ఫోన్ చేసి షూట్ చేయమని చెప్తుంది. సరే అంటూ కాల్ కట్ చేస్తాడు. కానీ షూటర్ షూట్ చేయడు.. హోమం అయిపోతుంది. అందరూ గుడి నుంచి వెళ్లిపోతారు. మనోహరి చంభా మాత్రం కోపంగా షూటర్ ఉన్న బిల్డింగ్ లోకి వెళ్తారు. అక్కడ షూటర్ దెబ్బలతో పడిపోయి ఉంటాడు.
మనోహరి: రేయ్ ఏమైందిరా..?
షూటర్: మేడం నేను మిమ్మల్ని షూట్ చేద్దామనే అంతా రెడీ చేసుకున్నాను.. ఈవిడ ఫోన్ చేసి షూట్ చేయ్ అని చెప్పింది. అప్పుడే ట్రిగర్ మీద నొక్కబోతుంటే సరిగ్గా అప్పుడే అప్పుడే
మను: అప్పుడే ఏం జరిగిందో చెప్పు..
షూటర్: అప్పుడు ఒకరు వచ్చారు మేడం..
మను: ఎవరు వచ్చారు..?
షూటర్: అమ్మవారు వచ్చారు మేడం..
మనోహరి: అమ్మవారు రావడం ఏంటి..?
చంభా: ఏ అమ్మవారు అయ్యా..?
షూటర్: గుడిలో అమ్మవారు (చంభా, మనోహరి షాక్..) నా గన్ ను ముక్కలు ముక్కలు చేసింది మేడం.. నన్ను కూడా రక్తం వచ్చేలా కొట్టింది మేడం నాకే కాదు మేడం మీకు కూడా వార్నింగ్ ఇచ్చింది ఇంకోసారి ఇలా జరిగితే అందరిని చంపేస్తానంది మేడం కళ్లు మూసి తెరిచేసరికి అమ్మవారు వెళ్లిపోయారు. నేను ప్రాణాలతో బయటపడ్డాను.
చంభా: మనోహరి నేను చెప్పాను కదా..? ఏదో దైవ శక్తి ఆ పిల్లకు తోడుగా ఉందని .. అది సాక్ష్యాత్తు ఆ అమ్మవారే అని ఇప్పుడు నీకు అర్థం అయిందా..?
మనోహరి: ఇంక ఆపుతావా..? వచ్చింది అమ్మవారు కాదు.. ఆ దేవత కాదు.. ఆ వేషంలో ఏవరో మనిషి వచ్చారు.
షూటర్: ఆమె మనిషి కాదు మేడం.. ఆమె అమ్మవారే..
చంభా: అవును మనోహరి హోమం జరిగింది. అమ్మవారి గుడిలోనే కదా..?
మనోహరి: ఆగు.. భయంతో వాడి కళ్లు బైర్లు కమ్మాయి.. మూఢనమ్మకంతో నీ కళ్లు మూసుకుపోయాయి. మన ప్లాన్ తెలుసుకుని ఎవరో కావాలనే రివర్స్ ప్లాన్ చేశారు. ఎవరో ఏంటి..? ఆ భాగీయే చేసి ఉంటుంది. అదే అమ్మవారిలా వచ్చి ఉంటుంది. వీణ్ని భయపెట్టి మన ప్లాన్ పాడు చేసి వెళ్లిపోయింది ఒసేయ్ భాగీ.
అంటూ కోపంగా చూస్తుంది. షూటర్‌కు కొట్టడానికి ముందు జరిగింది రివీల్ అవుతుంది. హోమం జరగడానికి ముందు అదే గుడిలో భాగీ, రాథోడ్, కరుణ అలోచిస్తుంటారు. భాగీ అటూ ఇటూ చూస్తుంటే.. షూటర్ కనిపిస్తాడు. వెంటనే భాగీ అమ్మవారి గెటప్ వేసుకుని వెళ్లి షూటర్‌ను కొట్టి వస్తుంది. భాగీ తిరిగి రావడం చూసిన కరుణ, రాథోడ్ ఆశ్చర్యపోతారు.
రాథోడ్: మిస్సమ్మ నువ్వు సూపర్.. అసలు మీరు అమ్మవారిలా కాకుండా.. భాగుమతిలా వెళ్లి ఉంటే.. ఇంకా బాగుండేది మిస్సమ్మ
భాగీ: త్వరలో అది కూడా జరుగుతుంది రాథోడ్.. నేను భాగీలా మనోహరికి ఎదురుపడే రోజు దగ్గర పడింది.
కరుణ: ఏం మాట్లాడుతున్నావే పోయి పోయి ఆ సైతాన్‌కు ఎదురుపడతావా..?
భాగీ: మరి ఇంకెన్నాళ్లు దాక్కోమంటావు.. నేను బయటపడి దాని మోసాన్ని బయటపెట్టాలి
రాథోడ్: అవును మిస్సమ్మ ఆ మనోహరి విష సర్పం లాంటిది. తోక తొక్కితేనే పాము బుస్సు మంటుంది. అలాంటిది మీరు ఈ రోజు తన పడగ మీదనే కొట్టారు.. పగ బడుతుంది మిస్సమ్మ
భాగీ: ఆ మనోహరిది పగ అయితే నాది ప్రతికారం రాథోడ్.. ఐదేళ్లు ఇంటికి దూరంగా బుజ్జమ్మతో వెళ్లిపోయి భయపడుతూ బతికాను.. నాకంత నకరం చూపించిన మనోహరిని అంత తేలిగ్గా వదులుతానా..? దానికి అంతకు మించిన నరకం చూపిస్తాను.
అంటూ భాగీ చెప్పగానే.. రాథోడ్, కరుణ అవును నిజమే మనోహరికి అంతకు అంత తిరిగి ఇవ్వాలి అంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!























