Nindu Noorella Saavasam Serial Today February 12th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: మను, చంభాలను భయపెట్టిన బుజ్జమ్మ – భాగీ కొత్త ప్లాన్
Nindu Noorella Saavasam serial Today Episode February 12th: మనోహరి, చంభా రహస్యంగా మాట్లాడుకుంటుంటే బుజ్జమ్మ వెళ్లి భయపెట్టడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి, అమర్‌తో తాను ఎలా తాళి కట్టించుకోబోతున్నానో చంభాకు చెప్తుంది. అమర్ అప్పుడే తాళి కట్టినట్టు ఊహించుకుంటూ.. కలలోకి వెళ్తుంది. అప్పుడే బుజ్జమ్మ రూంలోకి వచ్చి ఇద్దరిని భయపెట్టి వెళ్లిపోతుంది. మరోవైపు మనోహరి ప్లాన్ అట్టర్ ప్లాప్ చేయడానికి భాగీ, కరుణ, రాథోడ్ ఆలోచిస్తుంటారు.
రాథోడ్: నాకు ఎందుకో టెన్షన్‌గా ఉంది మిస్సమ్మ.. ఆ మనోహరిని తక్కువ అంచనా వేయడాని వీల్లేదు.. ఎందుకైనా మంచిది రేపు జరిగే హోమాన్ని ఆపేద్దాం..
భాగీ: లేదు రాథోడ్ రేపు మృత్యుంజయ హోమం జరగాలి.. ఆయన పిల్లలతో కూర్చుని హోమం చేయాలి. అది పిల్లలకు మంచిది
కరుణ: హోమం వంకతో ఆ మనోహరి మీ ఆయనతో తాళి కట్టించుకోవడానికి రెడీ అయిందని రాథోడ్ చెప్తున్నాడు కదా..?
రాథోడ్: అలా ఎలా తాళి కట్టించుకుంటుంది.
రాథోడ్: ఆ మనోహరి తలుచుకుంటే ఎంతకైనా తెగిస్తుంది మిస్సమ్మ.. మీరు రాక ముందు నుంచే నాకు మనోహరి గురించి బాగా తెలుసు..అనుకున్నది సాధించడం కోసం ఏమైనా చేస్తుంది
భాగీ: అది ఏం చేస్తుందో నేను చూస్తాను
కరుణ: ఏం చూస్తవే నువ్వు దాని పెళ్లి చూస్తవా..? నీకైమైనా పాగలా..?
భాగీ: చెప్పాను కదా కరుణ ఆయన మీద నాకు నమ్మకం ఉంది. మనోహరి తాళి కట్టమంటే ఆయన కడతారా..? ఏంటి..?
రాథోడ్: తప్పనిసరిగా తాళి కట్టే పరిస్థితి తను తీసుకురావచ్చు కదా మిస్సమ్మ..? అప్పుడు మీరు కాదు కదా..? సారు కూడా ఏమీ చేయలేరు..?
కరుణ: అవునే నా మాట విను.. రాథోడ్ చెప్పినట్టు హోమం ఆపడమే బెటర్
భాగీ: వద్దు కరుణ హోమం జరగాలి. ఆ మనోహరి మూమెంట్ ఏంటో మనకు తెలియాలి. శత్రవు ఎలాంటి ఎత్తు వేస్తున్నాడో..? మనం తెలుసుకున్నప్పుడే ఆ ఎత్తుకు పై ఎత్తు వేయోచ్చు
రాథోడ్: మిస్సమ్మ ఒకసారి బాగా ఆలోచించు.. జరగరానిది ఏదైనా జరిగితే జీవితాంతం బాధపడాలి
భాగీ: కొన్ని సార్లు రిస్క్ తీసుకోవాలి. రేపు మేము కూడా గుడికి వస్తాము.. ఆ మనోహరి ఏం చేస్తుందో చూస్తాం..
రాథోడ్: ఆశ్చర్యంగా మీరు గుడికి వస్తారా..? మరి సారు చూస్తే..
భాగీ: ఆయన చూడకుండా మేనేజ్ చేస్తాను.. నువ్వేం టెన్షన్ పడకు అంతా నేను చూసుకుంటాను
కరుణ: నీది కాన్ఫిడెంన్సో.. ఒవర్ కాన్ఫిడెంన్సో నాకు సమజ్ అయితలేదే..? ఆ మనోహరి గురించి నీకు తెలిసి కూడా ఆటలాడుతున్నావు..
భాగీ: స్వార్థంతో చెడు చేయాలనుకుంటున్న మనోహరికే అంత తెగింపు ఉంటే.. నాకెంత తెగింపు ఉండాలి కరుణ.. ఎప్పటికైనా గెలిచేది మంచే..
రాథోడ్: ఓకే మిస్సమ్మ మరి నేను బయటుదేరుతాను.. రేపు నువ్వు జాగ్రత్త
భాగీ: ఒక్క నిమిషం రాథోడ్, మనోహరికి నీ మీద డౌటు రాలేదు కదా..?
రాథోడ్: బొత్తిగా డౌటు రాలేదు అని చెప్పలేను.. కానీ కొద్దిగా వచ్చింది మిస్సమ్మ.
కరుణ: మనిషివేనా నువ్వు కడుపుకు రైస్ తింటున్నావా..? గ్రాస్ తింటున్నావా..? నువ్వు.. అరే ఈ పిచ్చిది నిన్ను నమ్మి ఏజెంట్‌గా పెట్టుకుంటే.. ఓవర్ యాక్షన్ చేసి మనోహరికి దొరికిపోతవా..? నీకు కొంచెమైనా దిమాక్ పని చేస్తుందా..?
రాథోడ్: ఏంటి మిస్సమ్మ తను ఇలా తిడుతుంది
కరుణ: తిట్టకపోతే నువ్వు చేసే చారన యాక్టింగ్‌కు దండేసి దండం పెట్టాలా..? ఆ సైతాన్ ఆవలిస్తే పేగులు లెక్కపెడతదని ముందే చెప్పిన విన్నావా..?
రాథోడ్: అయ్యో ఆవిడకు నా మీద పూర్తిగా డౌటు రాలేదని చెప్తున్నాను కదా తల్లి.. అయినా ఇలా తిడతావేంటి
అంటూ రాథోడ్ భయంగా చెప్పగానే.. కరుణ కోపంగా రేపు గానీ నువ్వు పూర్తిగా దానికి దొరికిపోయినవనుకో బొక్కలు విరిచి బొందల గడ్డల పెడతా అంటుంది. దీంతో మిస్సమ్మ కరుణను కూల్ చేసి రాథోడ్‌ను అక్కడి నుంచి వెళ్లమని చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!























