Nindu Noorella Saavasam Serial Today Episode: పంతులు చెప్పినట్టే ఇంట్లోంచి వెళ్లిపోవడానికి డిసైడ్ అయిన భాగీ పిల్లలకు దగ్గరకు వెళ్లి జాగ్రత్తలు చెప్తుంది. డోర్ దగ్గర నిలబడి భాగీ మాటలు వింటున్న చంభా, మనోహరి నవ్వుకుంటారు.
మనోహరి: చంభా, భాగీ బాగానే భయపడుతున్నట్టు ఉంది
చంభా: మరి నువ్వు చెప్పింది పంతులు గారు పొల్లు పోకుండా చెప్పారు
అమ్ము: మా అమ్మ పోయాక మమ్మల్ని అమ్మలా చూసుకున్నావు మిస్సమ్మ.. ఇప్పుడు అమ్మ కూడా బుజ్జమ్మలా తిరిగి వచ్చింది. మీరు ఇద్దరూ ఉంటే మాకు ఆ దేవుడు కూడా అక్కర లేదు
మనోహరి: ( మనసులో) భాగీ నీతో ఉండదే.. నీ మాటలతో దాని గుండె పగిలిపోతుంది
అంజు: అవును మిస్సమ్మ ఆ దేవుడైనా అడిగితేనే వరం ఇస్తాడు. కానీ నువ్వు మేము అడక్క ముందే మాకు ఏం కావాలో ఇస్తావు
ఆనంద్: మా కోసం అమ్మవు అయ్యావు మిస్సమ్మ.. ఆఖరికి మా అమ్మను కూడా బుజ్జమ్మ రూపంలోనే మాకు తిరిగి ఇచ్చావు
ఆకాష్: నీలా ఎవ్వరూ చేయలేరు మిస్సమ్మ.. నువ్వు ఎప్పుడూ మా పక్కనే ఉండాలి
మనోహరి: ఈ పిల్లల కోడి రేపు ఒంటరి కోడి అవ్వనుంది చంభా
చంభా: లేకపోతే ఆ కోడిపిల్లలను గద్ద ఎత్తుకుపోతుంది
హాల్లో కూర్చుని పాపను ఎత్తుకుని ఉన్న ప్రేమగా చూస్తుంటాడు అమర్.
అమర్: ( మనసులో) ఇది వరకు నీకు పిల్లలకు ఏది కావాలన్నా నన్ను భయపడుతూ అడిగేదానివి.. ఇప్పుడు ఈ నాన్న నువ్వు ఏది అడిగినా కాదనడు
భాగీ: రేపటి నుంచి మీరు అల్లరి చేయకూడదు. మీ నాన్న చెప్పిన మాటలు వినాలి. మీరు గొడవలు పడకూడదు.. మీరంతా కలిసి ఒకటిగా ఉండాలి. టైంకు తిని నిద్రపోవాలి. ఆరోగ్యం కాపాడుకోవాలి
అమ్ము: ఎవరికి చెప్తున్నావు మిస్సమ్మ ఇదంతా
భాగీ: మీకే చెప్తున్నాను.. మీ అందరికీ చెప్తున్నాను
అంజు: అదేంటి..? అప్పగింతలులా చెప్తున్నావు..
ఆనంద్: నువ్వు మాతోనే ఉంటావు గా మిస్సమ్మ మళ్లీ ఇవవ్నీ చెప్పడం ఎందుకు..?
మనోహరి: చంభా, భాగీ స్వరం చూస్తుంటే.. ఈ నైటే జంప్ అయ్యేలా ఉంది..?
చంభా: అవును పంతులు గారు వీలైనంత త్వరగా ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోమ్మని చెప్పారు కదా..
ఆకాష్: చెప్పు మిస్సమ్మ ఎందుకు మాకు ఇదంతా చెప్తున్నావు.. ఏదో సెండాఫ్ ఇస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి..?
భాగీ: సెండాఫ్ కాదు నేను బుజ్జమ్మతో బిజీగా ఉంటాను కదా అందుకే మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేనని చెప్తున్నాను అంతే..
అమ్ము: నువ్వు మమ్మల్ని చూసుకోవడం ఏంటి మిస్సమ్మ ఇక నుంచి మేమే నిన్ను చూసుకుంటాము
అంజు: నీ బాధ్యత, బుజ్జమ్మ బాధ్యత మాదే అని మేము ఎప్పుడో డిసైడ్ అయిపోయాము
ఆనంద్: అవును మిస్సమ్మ ఇన్నాళ్లు నువ్వు మమ్మల్ని ఎలా చూసుకున్నావో నిన్ను బుజ్జమ్మను మేము అలాగే చూసుకుంటాము
ఆకాష్: నీ పనులు బుజ్జమ్మ పనులు అన్ని మేమే చూసుకుంటాము..
అమ్ము: నీ విలువ తెలియక నీకు ఇన్నాళ్లు దూరంగా ఉన్నాము మిస్సమ్మ. నిన్ను అనరాని మాటలు అన్నాము మమ్మల్ని క్షమించు
అని అమ్ము ఏడుస్తుంది. భాగీ అమ్మును ఓదార్చి బయటకు వెల్లిపోతుంది. తర్వాత రాత్రికి అందరూ నిద్రపోయాక భాగీ ఇంట్లోంచి వెళ్లిపోతుంది. పొద్దున్నే నిద్ర లేచిన అమర్, భాగీ కోసం వెతుకుతాడు. అందరినీ పిలిచి ఆరా తీస్తాడు. ఎవ్వరూ చూడలేని చెప్పగానే.. రాథోడ్ వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయమంటాడు. ఫుటేజీలో భాగీ ఇల్లు వదిలి వెళ్లిపోతున్న వీడియో చూసి అమర్ షాక్ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!