Nindu Noorella Saavasam Serial Today Episode:  ఆశ్రమానికి వెళ్లిన అమర్‌. స్వామిజీతో తాను ఆరుతో మాట్లాడాలని నేను మాట్లాడేది ఆరు వింటుందా..? అని అడుగుతాడు. ఆరు తల్లిదండ్రుల గురించి తెలుసుకున్నానని ఆ విషయం ఆరుకు చెప్పాలని అంటాడు. సరే చెప్పమని ఆరు నీ మాటలు వింటుందని స్వామిజీ చెప్పగానే అమర్‌ ఎగ్జైంటింగ్‌గా ఎలా వింటుంది. నేను ఆరును చూడొచ్చా అని అడుగుతాడు. పంచభూతాలే నీకు సంకేతాన్ని ఇస్తాయని చెప్తాడు.  మరోవైపు అమర్‌ రూంలో ఆరు ఫోటో కోసం వెతుకుతుంది భాగీ.

భాగీ: ఎంత వెతికినా ఆక్క ఫోటో కనిపించడం లేదేంటి…? ఇంతకీ ఎక్కడ పెట్టారు ఆయన. ఒకవేళ పిల్లలు ఏమైనా తీసుకెళ్లారా..?

అని భాగీ అనుకుంటుండగా మరోవైపు రూంలో అంజలి, ఆరు ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంటుంది.

అమ్ము: ఏమైంది అంజు ఎందుకు ఏడుస్తున్నావు.

అంజు: అమ్మకు మనమంటే ఇష్టమే కదా..? మరి అమ్మ  మనకు కనిపించకుండా.. ఆ మిస్సమ్మకు కనిపించడం ఏంటి..?

ఆకాష్‌: అవును నిజమే కదా అక్కా..

ఆనంద్‌: రాథోడ్‌ కూడా చాలా సార్లు చెప్పాడు. అమ్మ ఎవరితోనో మాట్లాడుతుందని

 

అంటూ పిల్లలు ఆలోచిస్తుంటే.. భాగీ ఫోటో వెతుకుతూ కిందకు వెళ్లుంది. నిర్మల, శివరాం వచ్చి ఏం వెతుకుతున్నావు అని అడుగుతారు. అక్క ఫోటో కోసం వెతుకుతున్నాను అని భాగీ చెప్తుంది.

శివరాం: ఎప్పుడో ఆ పొట్టిది తమ రూంలోకి తీసుకెళ్లింది మిస్సమ్మ

నిర్మల: అయినా ఆరు ఫోటో ఇప్పుడెందుకు మిస్సమ్మ

భాగీ: అక్క ఆస్థికలు నదిలో కలిపే వరకు ఫోటో హాల్ లో పెదడామనుకుంటున్నాను అత్తయ్యా.

శివరాం: పెద్ద  మనసుతో ఆలోచించి ఇంకా పెద్ద దానివి అయిపోయావు మిస్సమ్మ.

అని మెచ్చుకుంటాడు. సరేలే అని భాగీ పైకి వెళ్తుంది. పైన రూంలో పిల్లుల కూడా నిజం మిస్సమ్మనే అడుగుదాం అని కిందకు వస్తుంటారు. భాగీ ఎదురుపడగానే.. మేము నీకోసమే వస్తున్నాం అని చెప్తారు. నేను కూడా మీకోసమే వస్తున్నాను అంటుంది భాగీ.

ఆకాష్‌:  అవునా ఎందుకు  వస్తున్నావు మిస్సమ్మ..

భాగీ: అక్క ఫోటో కోసం వస్తున్నాను.

అమ్ము:  అమ్మ ఫోటో కోసమా.. ఎందుకు..?

భాగీ: ఊరికే చూడటానికి.. అలాగే హాల్‌ లో పెట్టడానికి

అంజు: అయితే సరే తీసుకో ( ఇవ్వబోతూ మళ్లీ ఇవ్వకుండా) ముందు నువ్వు నేను అడిగిన దానికి సమాధానం చెబితే ఫోటో ఇస్తాను. నువ్వు నిన్న  ఎవరితో  మాట్లాడావు..?

భాగీ: అక్కతో.. అదే పక్కింటి అక్కతో

అంజు: నువ్వు మా అమ్మతో మాట్లాడాను అని చెప్పావు

భాగీ: అది అబద్దం అంజు ఊరికే అలా జోక్‌ చేశాను.

అంజు: కాదు ఇప్పుడు జోక్‌ చేస్తున్నావు. నువ్వు అబద్దం చెప్తున్నావు అందుకే నీకు అమ్మ ఫోటో ఇవ్వను

అంటూ అంజు దూరంగా వెళ్లి కూర్చుంటుంది. సరే తర్వాత తీసుకుంటాను అని భాగీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.  ఆరు ఆస్తికల కోసం ఘోర రాకముందే తానే తీసుకుని వెళ్లిపోవాలని స్మశాన వాటికకు వెళ్తుంది మనోహరి. సెక్యూరిటీని ఆరు ఆస్థికల గురించి అడిగితే భాగీకి తప్ప వేరే ఎవ్వరికీ ఇవ్వొద్దని అమరేంద్ర చెప్పారు అని చెప్పగానే దొంగచాటుగా లోపలికి వెళ్తుంది మనోహరి.  అదే టైంలో అమర్‌ అక్కడికి వచ్చి మనోహరిని చూస్తాడు. సెక్యూరిటీ గార్డు అమర్‌ ముందే మనోహరిని తిడతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!