Nindu Noorella Saavasam Serial Today Episode:    లారీ నుంచి తనను ఎలా కాపాడావు అని భాగీ అడగ్గానే ఆరు ఏదేదో చెప్తుంది. అదంతా భాగీకి అర్తం కాక తికమక పడుతుంది. ఏదో అర్తం అయినట్టే ఉంది కావడం లేదు అక్కా అంటుంది భాగీ ఇంతలో రాథోడ్‌ రావడం చూసిన గుప్త ఆరును చెప్తాడు. ఆరు తనకు అర్జెంట్‌ పని ఉందని వెళ్లిపోతున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రాథోడ్‌ కారు తీసుకొచ్చి భాగీ పక్కన ఆపుతాడు. భాగీ కారు ఎక్కగానే ఇద్దరూ కలిసి వెళ్లిపోతారు. మనోహరి హాస్పిటల్‌కు వెళ్తుంది.


మనోహరి: ఏయ్‌ బాబ్జీ అసలు మనం ఏం అనుకున్నాం నువ్వేం చేశావు


బాబ్జీ:  ఏంటి మేడం అదేదో చావడం నాకు సరదా అన్నట్టు చెప్తున్నారు. యాక్సిడెంట్‌ చేద్దామనుకుంటే నాకు యాక్సిడెంట్‌ అయింది మేడం


మను: చూడు ముందు అసలు ఏం జరిగిందో చెప్పు


బాబ్జీ: నేను ఆవిడను చంపడానికి కరెక్టుగా మిస్సమ్మ  వైపే వెళ్లాను మేడం..  అసలేం జరిగిందో  తెలుసుకునే లోపు లారీ చెట్టును గుద్దేసింది మేడం


మను: బంగారం లాంటి అవకాశాన్ని మిస్‌ చేశావు కదరా..?


బాబ్జి: మీరేం టెన్షన్‌ పడకండి మేడం నేను హాస్పిటల్ నుంచి బయటకు రాగానే ఆవిడను స్మశానానికి పంపించేస్తాను


మను: ఎలా చంపుతావో చెప్పు.. ఇది నీతో అయ్యే పని కాదని నాకు అర్థం అయింది వెంటనే ఆ ఘోరాను పట్టుకోవాలి


అని మనోహరి చెప్పగానే ఆ ఘోర వల్ల కూడా కాదని ఆ పని మీరు మాత్రమే చేయగలరని బాబ్జి చెప్పగానే నిజం చెప్పావు బాబ్జీ ఆ భాగీ చావు నా చేతిలోనే ఉంది అంటుంది మనోహరి. మరోవైపు డల్లుగా  ఇంటికి  వచ్చిన మిస్సమ్మ, రాథోడ్‌ శివరాం చూస్తాడు.


శివరాం: ఏమైంది రాథోడ్‌.. ఏంటి అలా ఉన్నారు.


రాథోడ్‌:  పెద్ద యాక్సిడెంట్‌ మిస్‌ అయిందట సార్‌.


భాగీ: అవును మామయ్య  లారీ వచ్చి గుద్దబోతే నేను పక్కింటి అక్క తప్పించుకున్నాం


శివరాం: అవునా మిస్సమ్మ  ఇక నువ్వెప్పుడు ఒంటరిగా బయటకు వెళ్లొద్దు


అని శివరాం, నిర్మల జాగ్రత్తలు చెప్తారు. భాగీ అందరికీ ప్రసాదం ఇచ్చి అమర్‌ దగ్గరకు వెళ్తుంది.


భాగీ: ఏవండి  ప్రసాదం తీసుకోండి…


అమర్‌: నాకేమీ వద్దు


భాగీ: అయితే ఈ బోట్టు అయినా పెట్టుకోండి


అమర్‌: బొట్టు కూడా వద్దు


అని అమర్‌ చెప్పగానే భాగీ కోపంగా తిడుతూ అమర్‌కు బొట్టు పెట్టబోతుంది. ఇంతలో కాలు జారి అమర్‌ మీద పడుతుంది. అనుకోకుండా భాగీ, అమర్‌ను కిస్‌ చేస్తుంది. ఇద్దరి మధ్య రొమాంటిక్‌ సన్ని వేశం నడుస్తుంది.  గార్డెన్‌లో కూర్చున్న ఆరు లారీ యాక్సిడెంట్‌ గురించే ఆలోచిస్తుంది.


గుప్త: బాలికా ఈ శిరోభారము మోయుట మా వల్ల కావడం లేదు. నువ్వు ఇంకొకసారి చేయోద్దన్న పని చేస్తే.. కాపాడుటకు నేను రాను


ఆరు: ఒకవేళ ప్రమాదం జరిగి ఉండుంటే గుప్త గారు


గుప్త: ఏమున్నది నీ స్నేహితురాలు పన్నిన పన్నాగానికి నీ సోదరి…?


ఆరు: ఆగిపోయారేం గుప్త గారు చెప్పండి. ఆ లారీ మిస్సమ్మను గుద్దేసేది. నా లాగే ఒకరి పంతానికి మిస్సమ్మ ప్రాణాలు కోల్పోయేది అంతేగా.. మిస్సమ్మ నా తోడ బుట్టిన చెల్లెలు గుప్త గారు తాను చేయని తప్పుకు. మనోహరి దుర్బుద్దికి ఎందుకు బలి కావాలి.


గుప్త:  బాలిక ఎందుకు అట్లా మాట్లాడుతుంటివి ఏమీ కాలేదు కదా


ఆరు: ఏమీ కాలేదు కానీ ఏదైనా జరిగి ఉంటే మీరు నేను ఇలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్లమా..? గుప్త గారు.  అసలు మిస్సమ్మ ఏం తప్పు చేసిందని చావాలి. మనోహరి కుట్రకు ఎందుకు బలి కావాలి.


గుప్త:  నీవు అడుగుతున్న ఏ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు బాలిక. నీలాగే మేము కూడా జరుగుతున్నది వీక్షించుట తప్ప ఏమీయూ చేయలేము


అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటుంటే మనోహరి వస్తుంది. మనోహరిని చూసిన ఆరు కోపంగా మను అని పిలుస్తుంది. మను ఎవరో పిలిచినట్టు ఆగిపోతుంది. భయంగా అటూ ఇటూ చూస్తుంది. ఆరు దగ్గరకు వచ్చి మనుకు వార్నింగ్‌ ఇస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!