Nindu Noorella Saavasam Serial Today Episode:  ఆరును ఒకసారి చూడాలనిపిస్తుందని రూం కీస్‌ ఇస్తే వెళ్లి చూసి వస్తానని మనోహరి, అమర్‌ దగ్గరకు వెళ్లి అడుగుతుంది. దీంతో అమర్‌ నేను వస్తాను పద మనోహరి అంటూ ఇద్దరూ కలిసి ఆరు రూంలోకి వెళ్తారు.

అమర్‌:  నువ్వు ఆరును చూడాలి అనగానే నీ ఫోన్లో మీరు దిగిన ఫోటోలు ఉంటాయి కదా..? చూడొచ్చు కదా అనొచ్చు. కానీ నేను ఆరు విషయంలో ఎంత కేరింగ్‌ గా ఉంటానో నీకు తెలియాలనే ఈ డోర్‌ ఓపెన్‌ చేశాను మనోహరి. ఇది ఆరు గది మాత్రమే కాదు.. ఈ ఇంటి దేవాలయం కూడా.. నేను ఎక్కడ ఉన్నా నా ఆలోచన, నా ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఆరు ముందు ఉన్న ఈ దీపాన్ని ఆరిపోనివ్వను.. ఈ పువ్వులను వాడిపోనివ్వను..

కింద నుంచి రాథోడ్‌, భాగీ వింటుంటారు.

భాగీ: రాథోడ్‌… మనోహరి ఇంటెన్సన్‌ ఏంటో మనకు తెలుసు. ఆరు అక్క గురించి ఆయన ఇంత చెప్పినా కూడా మనులో మార్పు రాకపోతే ఇంక మను అసలు మనిషే కాదు.

రాథోడ్‌: అవును మిస్సమ్మ నిజమే..

అమర్‌: మనోహరి నేను ఆరుకు సంబంధించిన జ్ఞాపకాలను ఈ గదిలో బంధించాను అంటారు. అసలు ఆ జ్ఞాపకాలు మమ్మల్ని వదిలి వెళ్తేనే కదా..? బంధించడం అనేది జరుగుతుంది. అవి జ్ఞాపకాలు కాదు మనోహరి. మధురమైన క్షణాలు ఎప్పటికీ చెరిగిపోవు

మనోహరి: (మనసులో అమర్‌ నువ్వు ఆరు గురించి ఆరుతో గడిపిన జీవితం గురించి చెప్తుంటే నాకు ఆరు మీద ఇంకా  ఇంకా కోపం పెరిగిపోతుంది. నాకు రావాల్సిన జీవితాన్ని నాకు దక్కాల్సిన జీవితాన్ని అది లాక్కుంది. అది చచ్చి బతికిపోయింది కానీ అది ఇక్కడ ఉంటే మళ్లీ మళ్లీ చంపేసేదాన్ని) సారీ అమర్‌ నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ థాంక్యూ సోమచ్‌ నేను అడగ్గానే ఇలా ఆరును నాకు చూపించినందుకు

భాగీ: అక్క ఫోటో ఇమ్మిడియెట్‌గా నేను అక్క ఫోటో చూడాలి

అనుకుంటూ పైకి వస్తుంది. కిటికీ దగ్గర గుప్త, ఆరు చూస్తుంటారు.

గుప్త: ఏమిటి బాలిక నీ పతి దేవుడు నిన్ను అంతలా ప్రేమగా ప్రశంసిస్తుంటే.. నీవు ఆనందింపక ఏలా చింతించుచుంటివి..

ఆరు: నా మీద ఆయనకున్న ప్రేమ కాదనలేను గుప్త గారు.. కానీ  నా ఫోటోను భాగీ ఎక్కడ చూసేస్తుందోనని టెన్షన్‌గా ఉంది.

అమర్‌, మను బయటకు వచ్చి రూం లాక్‌ చేస్తుంటారు. భాగీ వస్తుంది.

అమర్‌: మనోహరి ఇంకెప్పుడు ఈ రూం గురించి ఎక్కువ ఆలోచించకు ఈ రూం నాకు బాధ్యత

ఆరు: హమ్మయ్యా భాగీ నన్ను చూడలేదు.

అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు ఆరు, గుప్త. భాగీ మాత్రం ఆలోచిస్తూ అక్కడే నిలబడుతుంది. కట్‌ చేస్తే.. ఆరు ఆత్మను బంధించేందుకు రణవీర్‌ ఇంట్లో పూజలు చేస్తుంటుంది చంభ. పూజ చేస్తూ గట్టిగా నవ్వుతుంది.

రణవీర్: ఏమైంది చంభా ఎందుకు అలా నవ్వుతున్నావు ఏదైనా..?

చంభా: ఏం లేదు రణవీర్‌.. నువ్వేం భయపడకు..  అమావాస్య గడియలు మొదలయ్యాయి.. ఆ ఆత్మను డైరెక్టుగా బంధించవచ్చు నువ్వు ఆ మనోహరికి ఫోన్‌ చేసి నేను ఆ ఇంట్లోకి వెళ్లడానికి ఏర్పాట్లు చేయమను

అని చెప్పగానే రణవీర్‌ వెంటనే మనుకు ఫోన్‌ చేసి విషయం చెప్తాడు. మను సరే అంటుంది. ఆ రాత్రికే అందరూ పడుకున్నాక చంభాను ఇంట్లోకి తీసుకెళ్తుంది మనోహరి. ఇంట్లోకి వెళ్లిన చంభా ఆరు కోసం వెతుకుతుంది. చంభాను చూసిన ఆరు భయంతో వణికిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!