Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్ వాళ్ల ఇంట్లో చేసే హోమం ఎలాగైనా ఆపేయాలని మీరు చెప్పినట్టే చిత్ర చేస్తుందా..? రణవీర్ అంటూ చంభా అడుగుతుంది. మనోహరి ఉంది కదా దగ్గరుండి మరీ చేయిస్తుంది అని రణవీర్ చెప్తాడు. ఎలాగైనా హోమం ఆగిపోవాలి లేదంటే ఆ ఆత్మ మన చేయిదాటి పోతుంది అని చెప్తుంది చంభా. ఇక భాగీ ఇంట్లో దేవుడికి పూజ చేసి హారతి ఇస్తుంది.
ఆరు: మిస్టర్ గుప్త ఫ్లీజ్ నన్ను అక్కడికి తీసుకెళ్లరా..? హారతి తీసుకుంటాను
చిత్రగుప్త: బాలిక నువ్వే ఆ హారతి అంత ఉంటివి. నిన్ను అక్కడికి తీసుకుని వెళ్లి హారతి పక్కన నిలబెట్టితిని అనుకో అగ్నిపర్వతం పక్కన నిలబడినట్టు ఉంటుంది. దహించుకుపోయేదవు
దేవుడి దగ్గర ఉన్న పూల దండ తీసి అమర్‌కు ఇస్తుంది భాగీ.
భాగీ: ఏవండి ఈ దండ అక్క ఫోటోకు వేయండి
అమర్: నా రూంలో కీస్ ఉన్నాయి తీసుకురాపో
భాగీ పైకి వెళ్తుంది. మనోహరి, బయట ఉన్న ఆరు కంగారు పడతారు.
ఆరు: మిస్టర్ గుప్త
చిత్రగుప్త: మళ్లీ ఏమైంది బాలిక
ఆరు: భాగీ నా రూంకు వెళ్లకుండా ఏమైనా చేయండి. తను ఆ గదిలోకి వెళితే నా ఫోటో చూసేస్తుంది
చిత్రగుప్త: మమ్ములను ఏమి చేయమందువు బాలిక
ఆరు: భాగీని ఆపండి ఎలాగైనా ఫ్లీజ్
మనోహరి: ( మనసులో) ఇప్పుడు దీన్ని ఎలా ఆపాలి
అమర్ దండ తీసుకుని పైకి వెళ్తాడు.
ఆరు: మిస్టర్ గుప్త ఎలాగైనా ఆపండి
చిత్రగుప్త: ఆ కార్యక్రమం నేను చేయరాదు బాలిక.. నీ స్నేహితురాళ్లు ఉన్నారు కదా..? వాళ్లే చేసేదరు
ఆరు: వాళ్లెందుకు చేస్తారు మిస్టర్ గుప్త.
మనోహరి: ( మనసులో) ఆరు ఫోటో చూడకుండా భాగీని ఎలా ఆపాలి
ఆరు: అయ్యో మిస్టర్ గుప్త వాళ్లు ఏం చేయట్లేదు. మీరే ఏదో ఒకటి చేసేయండి.
చిత్రగుప్త: కాస్త వేచి ఉండుము బాలిక
అమర్ పూల దండతో రూం దగ్గర నిలబడతాడు.
మనోహరి: చిత్ర వెంటనే వెళ్లి ఆ దేవుడి ముందు ఉన్న దీపాన్ని కొడెక్కించు
చిత్ర: ఎందుకు మను
మనోహరి: చెప్పింది చేయ్ చిత్ర వెళ్లు
అని చెప్పి భాగీ అని పిలుస్తూ పైకి వెళ్తుంది. చిత్ర దేవుడి దగ్గరకు వెళ్లి దీపాలను ఆర్పేస్తుంది. భాగీ రూం తాళం తీసుకెళ్లి అమర్ కు ఇస్తుంది. లాక్ తీసి అమర్ వాళ్లు లోపలికి వెళ్తారు. అప్పుడే అక్కడకు వచ్చిన మనోహరి భాగీని ఆపేస్తుంది.
మను: భాగీ నువ్వు ఇందాక దేవుడి ఫోటోల ముందు పెట్టిన దీపాలు కొండెక్కుతున్నాయి
భాగీ: ఇప్పుడే కదా వెలిగించి వచ్చాను అప్పుడే కొండెక్కుతున్నాయా..?
మను: వెళ్లు త్వరగా వెళ్లు దీపాలు ఆరిపోతే అరిష్టం
భాగీ: నువ్వెళ్లి చూడు మనోహరి నేను అక్క ఫోటోకు దండం పెట్టుకుని వస్తాను.
మను: భాగీ దీపాలు ఎవరు వెలిగించారో వాళ్లే కొండెక్కకుండా చూడాలి భాగీ. ఆ మాత్రమ తెలియదా నీకు వెళ్లు త్వరగా వెళ్లు
అని చెప్పగానే కిందకు వెళ్లి దీపాలు వెలిగిస్తుంది భాగీ. తర్వాత హోమం చేస్తారు. ఆపేందుకు చిత్ర ఎంత ట్రై చేసినా హోమం పూర్తి అయిపోతుంది. తర్వాత అమర్ వాళ్లు అందరూ బయటకు వెళ్తుంటే ఆరు తుమ్మెద మీద కారు దగ్గరకు వచ్చి ఏవండి నేను వస్తాను.. అంటుంది. వెంటనే అమర్ ఎమోషనల్ అవుతాడు. గార్డెన్ వైపు చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!