Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీని తీసుకుని షాపింగ్‌ మాల్‌కు వెళ్లిన చిత్రను చూసిన వినోద్‌ విసుగ్గా ఎందుకు లేటయింది.. ఆమెను ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతాడు. తనను తీసుకెళ్లమని ఒకటే నస అందుకే తీసుకొచ్చాను అని చిత్ర చెప్తుంది. ఇంతలో మేనేజ వచ్చి కొత్త స్టాక్‌ వచ్చింది చూస్తారా అని అడుగుతాడు. ఏమీ చూడమని అంతా నువ్వే చూసుకో అంటూ పంపిస్తారు.

భాగీ: అదేంటి చిత్ర ఆ ‌స్టాక్‌ ఎలా ఉందో ఏంటో చెక్‌ చేయవా..? క్వాలిటీ బాగా లేకపోతే కస్టమర్స్‌ రిజెక్ట్‌ చేస్తారు వినోద్. ఇలాంటివన్నీ మీరు దగ్గరుండి చూసుకోవాలి

వినోద్‌: అవన్నీ మాకు తెలుసు.. మీరు వచ్చిన పని చూసుకోండి

భాగీ: చూడు చిత్ర నేను మీ మంచి కోరి చెప్తున్నాను.  స్టాఫ్‌ను, వర్కర్స్ ను నమ్మి వదిలేయడం మంచిది కాదు. నమ్మించి మోసం చేస్తారు

చిత్ర: చూడు భాగీ నేను మరీ అంత అమాయకురాలిలా కనిపిస్తున్నానా..? నేను నీలా వంటింటి కుందేలును కాదు.. నా కలలు ఎలా నెరవేర్చుకోవాలో నాకు బాగా తెలుసు.. అందుకే నేను ఇంత పెద్ద షాపింగ్‌ మాల్‌కు ఓనర్‌ అయ్యాను.

భాగీ: షాప్‌ పెట్టడం గొప్ప విషయం కాదు.. అది నిలబెట్టుకోవాలి. మీ కాళ్ల మీద మీరు నిలదొక్కుకోవాలని ఆయన మీ మీద నమ్మకంతో డబ్బులు ఇచ్చారు. ఏ చిన్న తప్పు జరిగినా పెద్ద ఎత్తున నష్టం వస్తుంది. మళ్లీ ఆయన ముందు తల ఎత్తుకోలేరు.

చిత్ర:  చెప్పిన నీతిసూత్రాలు చాలు.. మేము అంత తెలివి తక్కువవాళ్లం ఏమీ కాదు. మాకు నీ సలహాలు అవసరం లేదు.. ఓకే

భాగీ: ఇది సలహా కాదు జాగ్రత్త అని చెప్తున్నాను.

చిత్ర: కోపంగా నువ్వు ఇలాంటి సుత్తి మాటలు చెప్తావనే నిన్ను ఇక్కడికి తీసుకురాకూడదు అనుకున్నాను. కానీ ఆ మనోహరి పట్టుబట్టి నిన్ను తీసుకెళ్లమని చెప్తే తప్పక ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది.

భాగీ: నన్ను మాల్‌కు తీసుకురమ్మని మనోహరి చెప్పిందా..?

చిత్ర: ( మనసులో) చిట్‌ ఇలా నోరు జారానేంటి..?

భాగీ: నన్ను ఎందుకు ఇక్కడకు తీసుకురమ్మంది

చిత్ర: అది ఊరికే.. నువ్వు చూసినట్టు ఉంటుందని నేను కూడా అనుకుని తీసుకొచ్చాను.

బాగీకి స్వామిజీ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి.

భాగీ: మనోహరి కావాలనే నన్ను ఇక్కడకు పంపించింది. అంటే ఇంట్లో తను ఏం చేయబోతుంది. అందరిని బయటకు పంపించి మనోహరి అరుందతి అక్కను ఏమైనా చేయబోతుందా..?

చిత్ర: ఏంటి బాగీ ఆలోచిస్తున్నావు.. రా కూర్చుందువు కానీ కూల్‌డ్రింక్‌ తెప్పిస్తాను.

భాగీ: నేను వెళ్లాలి

అని కోపంగా చెప్పి భాగీ వెళ్లిపోతుంటే.. చిత్ర ఆపాలని చూస్తుంది కానీ భాగీ ఆగకుండా వెళ్లిపోతుంది. చిత్ర వెనకాలే కొద్ది దూరం పరిగెడుతూ ఆగు భాగీ నా మాట విను.. అంటూ చెప్తున్నా.. భాగీ ఆగకుండా వెళ్లిపోతుంది. రోడ్డు మీదకు వెళ్లి ఆటో పిలిచుకుని ఇంటికి వెళ్తుంది.  అప్పటికే ఇంట్లోకి వెళ్లిన చంభా ఆరును బంధిస్తుంది. చిత్రగుప్తుడు యముడిని పిలుస్తాడు.

యముడు: ఏమైంది చిత్రగుప్తా..?

చిత్రగుప్త: ప్రభూ ఆ బాలికను ఆ దుష్ట మాత్రికురాలు బంధించింది మీరు అనుమతి ఇస్తే నేను ఆ బాలికను కాపాడెదను.

యముడు: ఏమీ వద్దు గుప్త.. ఎవరి కర్మకు వారే బాధ్యులు. నీ కర్తవ్యం నువ్వు పాటించు.. ఆ బాలిక మన లోకానికి వస్తానంటే తీసుకుని రమ్ము

అని చెప్తూ యముడు వెళ్లిపోతాడు. చంభా మాత్రం ఒక చిలకను పిలిచి ఆరు ఆత్మను చిలకలో బంధిస్తానని చెప్తుంది. రణవీర్‌ హ్యాపీగా చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!