Nindu Noorella Saavasam Serial Today Episode:  అమ్ము స్కూల్‌ లీడర్ ఎలక్షన్స్‌లో పాల్గొనడం లేదని ఆనంద్‌ పోటీ చేయాలనుకుంటాడు. అంజు ఆనంద్‌ను ఒప్పించి నామినేషన్‌ వేయడానికి తీసుకెళ్తుంది. అదే టైంలో బంటి కూడా నామినేషన్‌ వేయడానికి వస్తాడు.

బంటి: మీ అక్క వల్ల కాక నువ్వు దిగావా..?

ఆనంద్‌: మా అక్క వల్ల కాక కాదు. నీలాంటి వాడు లీడర్‌ కాకూడదని నేను దిగాను.

బంటి: చిన్న పిల్ల మాట విని చాలా పెద్ద డిసీజన్‌ తీసుకున్నావు నీకు ఓటమి రుచి చూపిస్తాను

అంజు: హలో ఎలక్షన్‌ అయ్యాక నీకు ఎన్ని ఓట్లు పడ్డాయో వేళ్ల మీద లెక్కపెట్టి చూపించు

బంటి:  మీ అక్క ఓటు ఆకాష్‌ ఓటు కూడా నీకు పడదు

అనంద్: ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయో ఎలక్షన్స్‌ అయ్యాక చూద్దాం.

అని ప్రిన్సిపాల్‌ రూంలోకి వెళ్తారు. బంటి కూడా వెళ్తాడు.

ప్రిన్సిపాల్‌: ఏంటి అందరూ ఇక్కడికి వచ్చారు

బంటి: మేడం నామినేషన్‌ వేయడానికి వచ్చాం

ఆనంద్‌: ఇది నా నామినేషన్‌ మేడం

ప్రిన్సిపాల్‌: అదేంటి ఆనంద్‌ మీ అక్క పోటీ చేయనని చెప్పింది కదా..?

ఆనంద్‌: మా అక్క కాదు మేడం నేను పోటీ చేస్తున్నాను.

ప్రిన్సిపాల్‌: ఈసారి యునానమస్‌గా లీడర్‌ను సెలెక్ట్‌ చేద్దామని అనుకున్నాను. ఎలక్షన్స్‌ తప్పవు అన్నమాట

ఆనంద్‌: తప్పుడు వాళ్లు లీడర్‌ అవ్వకూడదంటే ఎలక్షన్స్‌ ఉండాల్సిందే మేడం.

ప్రిన్సిపాల్‌: ఏమిటి ఏదో ఎంపీలు, ఎమ్మెల్యేలులాగా ఎక్స్‌ట్రాలు మాట్లాడుతున్నావు..

అంజు: ఎవరు ఎక్స్‌ట్రాలు చేస్తున్నారో స్కూల్లో అందరికీ తెలుసు

ప్రిన్సిపాల్‌:  ఏంటి అంజలి ఏదో అంటున్నావు

అంజు: ఏం లేదు మేడం నామినేషన్‌ పేపర్స్‌ తీసుకోండి

ప్రన్సిపాల్‌:  ఎలక్షన్స్‌ ఎప్పుడు అనేది తొందరలోనే అనౌన్స్‌ చేస్తాను. అప్పటి వరకు మీరు ప్రచారం చేసుకోవచ్చు. కానీ క్లాసెస్‌ డిస్టర్బ్‌ అవ్వకూడదు. క్యాంపస్‌లో గొడవలు జరగకూడదు. గొడల మీద ఎలాంటి రాతలు రాయకూడదు. బయటి పిల్లలను లోపలికి తీసుకురాకూడదు

అంటూ కండిషన్స్‌ చెప్పగానే.. సరే మేడం అంటూ అందరూ వెళ్లిపోతారు.

ప్రిన్సిపాల్‌: యునానమస్‌గా బంటీని గెలిపిద్దామనుకుంటే.. ఈ అంజలి ఆనంద్‌ని నిలబెట్టింది చీ…

బయటకు వచ్చిన బంటీ ప్రచారం గురించి తన ఫ్రెండ్స్‌కు చెప్తాడు.

బంటి: అరేయ్‌ బస్తాల కొద్దీ చాక్లెట్స్‌ దింపండి.. బండిల్స్‌ కొద్ది బిస్కట్స్‌ దింపండి. . కిలోల కొద్ది ఐస్‌క్రీమ్‌ దింపండి.. నోట్స్‌, పెన్సిల్స్‌, పెన్నులు, బుక్స్‌ అన్నీ దింపండి.. స్కూల్‌లో అన్ని ఓట్లు నాకే పడాలి.

ఆనంద్‌:  చూశావా అంజు బంటీ గాడు అన్ని పంచుతున్నాడు మన దగ్గర ఏమీ లేవు కదా ఎలా..? ఏదైనా పంచుదామంటే డబ్బులు కూడా లేవు కదా..?

అంజు: వాడి దగ్గర అవన్నీ ఉంటే మన దగ్గర అందరితో బాండింగ్‌ ఉంది. స్టూడెంట్స్‌ అందరూ మనకు టచ్‌లోనే ఉన్నారు. అదే మనకు పెద్ద ఓటు బ్యాంకు

అంటూ ఆనంద్‌ను ఎంకరేజ్‌ చేస్తూ తీసుకెళ్తుంది అంజు. ఇక రాఖీ తీసుకుని గార్డెన్‌లో ఉన్న ఆరు దగ్గరకు వెళ్తుంది భాగీ.

ఆరు: మిస్సమ్మ ఏంటి ఇవన్నీ.. ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు..?

భాగీ: ఈరోజు రాఖీ పౌర్ణమి కదా అక్కా నా చిన్నప్పటి నుంచి నాకు తోడుగా ఎవ్వరూ లేరు. ఇక్కడికి వచ్చాక నువ్వు పరిచయం అయ్యావు అక్క నాకు అక్కవైన అన్నవైన నువ్వే కాబట్టి  నీ చేతికి రాఖీ కట్టాలనుకుంటున్నాను అక్క. కట్టనా అక్కా..

అంటూ భాగీ అడగ్గానే.. ఆరు ఎమోషనల్‌ అవుతుంది. కళ్లల్లో నీళ్లు వస్తాయి.  సంతోషం కలిసిన బాధతో కట్టు అంటుంది ఆరు. భాగీ రాఖీ కట్టి స్వీట్లు తినిపిస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!