Nindu Noorella Saavasam Serial Today April 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్ ఇచ్చిన అనామిక – పిల్లలను భాగీ వైపు మళ్లించే ప్రయత్నం

Nindu Noorella Saavasam Today Episode: పిల్లలందరూ భాగీకి అమ్మ స్థానం ఇవ్వాలని అనామిక చెప్పడంతో మనోహరి షాక్‌ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.      

Continues below advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరితో విడాకులు త్వరగా వచ్చేలా చేయమని లాయర్‌ను కలిసిని రణవీర్‌ చెప్తాడు. దీంతో కోర్టు రేపు ఉదయం పదిన్నరకు మీకు టైం ఇచ్చిందని.. మీరు ఇద్దరూ కలిసి పది గంటలకు నా దగ్గరకు వస్తే జడ్జి ముందు ఏం మాట్లాడాలో చెప్తానని లాయర్‌ అంటాడు.

Continues below advertisement

రణవీర్: రేపు ఎలాగైనా నాకు మనోహరికి విడాకులు వచ్చేలా చూడు లాయరు.

లాయర్‌:  సరే కానీ విడాకులు వచ్చే వరకు ఆస్థి కేసుకు వాయిదాలు ఎందుకు తీసుకుంటున్నావు. అంజలిని తీసుకుని వెళ్లి నీ కూతురు అని చెప్పి చూపించి ఆస్థిని నీ పేరు మీదకు మార్పించుకోవచ్చు కదా..?

రణవీర్‌:  విడాకులు కాకుండా ఆస్థి నా పేరు మీదకు వస్తే మనోహరి ఊరుకుంటుందా..? సగం ఆస్థి దక్కించుకోవడానికి తను ఏమైనా చేస్తుంది. అందుకే ఆస్థి నా పేరు మీదకు వచ్చే టైంకి మనోహరి నా భార్య అయి ఉండకూడదు. రేపు మాకు విడాకులు రాగానే అమరేంద్ర దగ్గరకు వెళ్లి మనోహరి గురించి మొత్తం నిజం చెప్పేస్తాను.

 లాయర్‌: చెప్పేస్తావా..? అదేంటి మనోహరికి చెప్పనని మాటిచ్చావు కదా..?

 రణవీర్‌: నేను ఏడేండ్లు ఇలా రోడ్లు పట్టుకుని తిరగడానికి కారణం ఆ మనోహరి. అటువంటి మనోహరిని  అంత సులువుగా ఎలా వదిలేస్తాను. అమరేంద్రను పెళ్లి చేసుకోవడానికి మనోహరి చేసిన ప్రతి తప్పు.. తీసిన ప్రతి ప్రాణం గురించి అమరేంద్రకు చెప్పేస్తాను. అమరేంద్రకు భార్య అవడం.. అమరేంద్ర ప్రేమను పొందడమే తన జీవిత ఆశయం అని చెప్పింది. అది మనోహరి జీవితంలో దక్కకుండా చేస్తాను. అందరూ మనోహరి గురించి తెలిసిన షాక్‌లో ఉండగా అంజలిని తీసుకెళ్లి కోర్టులో చూపిస్తాను. మనోహరి నీ పతనానికి కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయిపోయింది.

అంటూ రణవీర్‌ కోపంగా తిడుతుంటాడు. లాయర్‌ షాక్‌ అవుతాడు. మరోవైపు ఇంట్లో ఎవ్వరూ ఉండరు పిల్లల, అనామిక మాత్రమే ఉంటారు. అందరూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గర భోజనం చేస్తుంటారు.

ఆకాష్‌: అనామిక నేను నీతోనే మాట్లాడుతున్నాను నాకు డిన్నర్‌ చేయాలని లేదు. ఏంటి నా మాటలు వినిపించడం లేదా..?

 అనామిక:  నువ్వు నా మాటలు విననప్పుడు నేను నీ మాట ఎందుకు వినిపించుకోవాలి.

 అంటూ భోజనం కలిపి తినిపిస్తుంది. వెనకాలే రూంలోంచి వచ్చిన మనోహరి సైలెంట్‌గా చూస్తుంది.

 అమ్ము:  అవును అనామిక డాడీ, మిస్సమ్మ, తాతయ్య వాళ్లు ఎక్కడికి వెళ్లారు..?

 అనామిక: ఎవరో ఫ్రెండును కలవడానికి వెళ్లారు. స్టార్ట్‌ ఆయ్యారంట ఒక అరగంటలో వస్తామన్నారు

మనోహరి: తల్లి లేని పిల్లల మీద జాలి చూపిస్తుందా..?  లేక తల్లిలా ప్రేమను పంచుతుందా..? (అని మనసులో అనుకుంటుంది.)

అనామిక: నీకు పొట్ట లైటుగా ఉంటే నిద్ర కూడా లైటుగా వస్తుందని తెలిసి డిన్నర్‌ ఎందుకు స్కిప్‌ చేస్తున్నావో నాకు తెలియడం లేదు. పగలంతా ఆడతూ ఉంటావు రాత్రి తినకపోతే పొద్దున్నే ఎనర్జీ ఎలా వస్తుంది చెప్పు. రేపటి నుంచి డిన్నర్‌ స్కిప్‌ చేశావో పనిష్‌మెంట్‌ కింద ఎక్కువ ఫుడ్‌ పెట్టేస్తాను

అని అనామిక చెప్పగానే పిల్లలు ఎమోషనల్‌ అవుతారు. ఆరును గుర్తు చేసుకుంటారు. ఆరుతో కలిసి భోజనం చేసింది. ఆడింది పాడింది జ్ఞాపకం తెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు.

అనామిక:  మీ అమ్మ మీకు దూరం అయ్యుండొచ్చేమో కానీ అమ్మ ప్రేమ దూరం కాలేదు. అరుంధతిగా మీ నుంచి దూరం అయిన ప్రేమ భాగీగా తిరిగి వచ్చింది. నాకు తెలుసు మీరు మీ అమ్మ స్థానాన్ని ఎవ్వరికీ ఇవ్వలేరని. కానీ ఒక్కసారి భాగీకి మీ అమ్మగా చాన్స్‌ ఇచ్చి చూడండి.

 అమ్ము:  తను మా అమ్మ ఇష్టపడిన ఆర్‌జే భాగీ అని తెలిశాక అంజు కూడా మిస్సమ్మ పార్టీలోకి వచ్చేసింది.

అంజు: అవును అనామిక.. నాకు మిస్సమ్మ ఇప్పుడు ఎలాంటి కోపం లేదు.

 అనామిక:  మీరు చాన్స్‌ ఇవ్వమన్నది ఆర్‌జే భాగీకి కాదు మీ అమ్మ భాగీకి.

అంటూ అనామిక చెప్తుంటే వెనక నుంచి చూస్తున్న మనోహరి షాక్‌ అవుతుంది. పిల్లలేమో ఎమోషనల్‌ అవుతూ సైలెంట్‌ గా ఉండిపోతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

Continues below advertisement