Nindu Noorella Saavasam Serial Today Episode: ఆడిటోరియం లోపలికి వెళ్లడానికి ప్రయత్నించిన అమర్‌కు డోర్స్ అన్ని మూసుకుని ఉండటంతో బయటే ఉండిపోతాడు. ఇంతలో రాథోడ్ వచ్చి ఇక మనం లోపలికి వెల్లలేం సార్ అని చెప్తాడు.
అమర్: అయితే ఆడిటోరియం లోకి ఎన్ని డోర్స్ ఉన్నాయో తెలుసుకో.. స్నైపర్స్‌ను రెడీగాఉండమని చెప్పు.. లోపల ఏం జరిగినా నాకు వెంటనే తెలియాలి
రాథోడ్: ఓకే సార్
మీనన్: అందరికీ హాయ్.. నేను పిలిచినప్పుడు ఎవ్వరూ పలకపోతే.. ఒక బుల్లెట్ వాడతా..?
అంటూ బెదిరించడంతో అందరూ బలవంతంగా హాయ్ అంటారు.
మీనన్: ఇది కావాలి. ఇలా నేను చెప్పింది చెప్పినట్టు బుద్దిగా వింటే నా పని నేను చేసుకుని వెళ్లిపోతా..
జవాన్: మేడం ఎవరో టన్నెల్ బ్రేక్ చేశారు.
ఎస్సై శివ: మీ అనుమానమే నిజం అయింది సార్.
అమర్: అంటే లోపలి నుంచే ఎవరో మీనన్ కు హెల్ప్ చేశారు
ఎస్సై శివ: సార్ సీసీ కెమెరా ఉంది కదా..? పుటేజీ చూసి ఎవరో కనిపెట్టవచ్చు.
అమర్: రాథోడ్ వెంటనే సీసీ టీవీ పుటేజీ తీసుకురా..
రాథోడ్: సరే సార్ తీసుకొస్తాను.
అమర్: ఇక లోపల ఉన్న మీనన్ ను పట్టుకోవడం కంటే ముందు మినిస్టర్ గారిని కాపాడాలి
ఎస్సై శివ: సార్ వాష్ రూం దగ్గర ఉన్న విండోను బ్రేక్ చేస్తే లోపలికి వెళ్లొచ్చు
అమర్: వద్దు శివ అది రిస్క్. మనం లోపలికి వెళ్లబోతున్నాం అన్న చిన్న డౌటు మీనన్‌కు వచ్చినా లోపల వాడు ప్రజల ప్రాణాలు తీసేస్తాడు.
రాథోడ్: సార్ స్నైపర్స్ పొజిషన్‌లో ఉన్నారు సార్. కానీ విండోస్ కు కర్టెన్స్ అడ్డం ఉండటం వల్ల లోపల ఏమీ కనిపించడం లేదు సార్
అమర్: ఎంత మంది వచ్చారో తెలియదు.. ఏం తీసుకొచ్చారో తెలియదు. కనీసం రౌడీలు ఉన్న పొజిషన్ తెలిస్తే అయినా ప్లాన్ రెడీ చేసుకుని అటాక్ చేయోచ్చు.. ఇప్పుడు ఏం చేయాలి
లోపల భాగీని మీనన్ షూట్ చేయబోతుంటే.. వద్దు నన్ను షూట్ చేయోద్దు అంటూ గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులు విన్న అమర్ షాక్ అవుతాడు. అయితే లోపల మీనన్ కాల్చింది భాగీని కాదు. ఆమె పక్కనే ఉన్న సెక్యూరిటీని. లోపల అందరూ భయపడుతుంటారు. గట్టిగా అరుస్తుంటారు. లోపలికి వాకీటాకీ ద్వారా అమర్ మాట్లాడతాడు.
అమర్: లోపల ఏ ఒక్కరి ప్రాణం పోయినా..మీలో ఏ ఒక్కరిని వదిలిపెట్టను. మీనన్: అయ్యో లేట్ చేశావు అమరేంద్ర. జస్ట్ ఇప్పుడే మీలో ఒకడు హీరో అవ్వడానికి ట్రై చేశాడు. షూట్ చేసేశా..? కానీ బతుకుతాడో లేదో గ్యారంటీ ఇవ్వలేను. కానీ ఇప్పుడు ఇక్కడున్న అందరూ బతుకుతారని గ్యారంటీ ఇవ్వగలను. దానికి బదులుగా నువ్వు నాకో చిన్న ఫేవర్ చేయాలి
అమర్: ఏంటది మీనన్..
మీనన్: ఈ మినిస్టర్ ను ఈ జనాల్ని నీకు అప్పగిస్తాను. దానికి బదులుగా నాకు కావాల్సిన మినిస్టర్ ను నా మనుషులను నాకు అప్పగించాలి.
అమర్: అది కుదరదని నీకు తెలుసు కదా మీనన్
మీనన్: అయితే నీకు పర్సనల్ గిఫ్ట్ పంపిస్తాను
రాథోడ్: సార్ లోపల మీ ఫ్యామిలీ ఉందని వాడికి తెలుసు సార్ వాళ్లను ఏమైనా చేస్తే
ఎస్సై శివ: పిల్లలను ఏమీచేయడు కాబట్టి భాగీని ఏమైనా చేయోచ్చు సార్.
అమర్ ఏ టెన్షన్ లేకుండా చూస్తుంటాడు.
ఎస్సై శివ: ఏమైంది సార్ మీనన్ మీ ఆవిడను చంపబోతున్నాడు. మీరేంటి సార్ చాలా కూల్‌గా ఉన్నారు. నవ్వుతున్నారేంటి సార్
అమర్: మీకు భాగీ గురించి పూర్తిగా తెలియదు. ఇంక నా పిల్లలు అంటావా..? వాళ్లకు ప్రాబ్లమ్ వస్తే సొల్యూషన్ కోసం వెతుకుతారు తప్ప.. సైలెంట్‌గా కూర్చోరు. ఇందాకటి నుంచి లోపల ఎంత మంది ఉన్నారు. లోపలికి ఎలా వెళ్లాలి అని ప్లాన్ చేస్తున్నాము కదా..? ఇక ప్లానింగ్ ఏమీ అవసరం లేదు. అందరూ అటాక్ కు రెడీగా ఉండండి..
అని అమర్ చెప్పగానే.. ఎస్సై శివ షాకింగ్ గా చూస్తుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!