Nindu Noorella Saavasam Serial Today Episode: ఇంకా కోర్టు దగ్గరే ఉంటే అమర్ చూస్తాడన్న భయంతో మనోహరి వెళ్లిపోతుంది. అడ్డుగా వచ్చిన రణవీర్ కోపంగా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. రణవీర్ మాటలకు మనోహరి కోపంగా చూస్తుంది.
మనోహరి: నీ వల్ల ఇవాళ అమర్‌కు దొరికిపోయేదాన్ని.. ఇలా ఇన్ని సార్లు రమ్మంటే నేను రాలేను. ఇక నేను రాను
రణవీర్: మనోహరి నేను రమ్మని అడగడం లేదు. రమ్మని ఆర్డర్ వేస్తున్న.. లాయర్ నెక్ట్స్ హియరింగ్ డేట్ కనుక్కుని చెప్తాడు. బుద్దిగా కోర్టుకు వచ్చి జడ్జి ముందు నిలబడు పద లాయరు
అని చెప్పి రణవీర్ వెళ్లిపోతాడు.
మనోహరి: అమర్‌కు నా మీద అనుమానం మొదలైందని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో ఈ రణవీర్ గొడవేంటి నాకు పద వెళ్దాం
చిత్ర: ఆగు అటు వెళ్లకు.. అమర్ నుంచి తప్పించుకోవడానికి నువ్వు అటు వెళితే అమరేంద్ర సతీమణికి దొరికిపోతావు
మనోహరి: ఏంటి నువ్వు చెప్తుంది నిజమా.? భాగీ ఇక్కడకు వచ్చిందా..?
చిత్ర: వచ్చింది. నువ్వు లోపల రణవీర్‌తో విడాకుల కోసం జడ్జి ముందు నిలబడినప్పుడు నేనే నిన్ను సేవ్ చేశాను.
మనోహరి: భాగీ మమ్మల్ని కలిపి చూడలేదు కదా..? మా మీద ఏమీ అనుమానం రాలేదు కదా..?
చిత్ర: ఇప్పటి వరకైతే చూడలేదు.. అనుమానము రాలేదు. నిజం కూడా తెలియదు. కానీ నేను చెప్తే అన్ని జరిగిపోతాయి. చెప్పకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలో నీకు బాగా తెలుసు అనుకుంటా
చిత్ర మాటలకు ఏం చెప్పాలో అర్థం కాక మనోహరి కోపంగా చూస్తుంటుంది. కోర్టులో కరుణతో కలిసి క్లయింట్స్ తో మాట్లాడుతున్న భాగీ రణవీర్‌ను చూస్తుంది. రణవీర్ కోర్టులో ఉండటమేంటి..? చిత్ర చెప్పింది మనోహరి గురించా..? అయితే మను కూడా ఇక్కడే ఉందా..? అనుకుంటూ చిత్రను తీసుకుని ఇంకోవైపు వెళ్తుంది. అక్కడా ఎంత వెతికినా మనోహరి కనిపించదు. ఇంతలో అమర్ వస్తాడు.
అమర్: భాగీ ఇక్కడేం చేస్తున్నావు.. నువ్వు వచ్చిన పని అయిపోయిందా..?
భాగీ: ఇంతకుముందు ఇక్కడ కరుణ, మనోహరి గారిని చూశానంది అందుకే వెతుకుతున్నాం.
అమర్: మనోహరి ఇక్కడకు రావడం ఏంటి..? తను ఆశ్రమానికి వెళ్తున్నాను నాతో చెప్పింది.
భాగీ: లేదండి కరుణ చూసిందట..
కరుణ: అవును సార్ నేను మనోహరిగారిని ఇక్కడే చూశాను.
అమర్: అవునా.. అదేంటి ఇంతకు ముందు కూడా నాకు ఇక్కడ రణవీర్ కనిపించారు.
భాగీ: అయితే చిత్ర చెప్పింది మనోహరి గురించేనా..? రణవీర్, మను డివోర్స్ తీసుకుంటున్నారా..?
అని మనసులో అనుకుంటుంటే సరే వెళ్దాం పద ఇంటికి అంటాడు అమర్. అందరూ కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. అంతా గమనిస్తున్న మనోహరి టెన్షన్ పడుతుంది. మరోవైపు ఎలాగైనా భాగీని అమర్‌ను ఒక్కటి చేయాలనుకుంటుంది అనామికలో ఉన్న ఆరు. అందుకోసం పాలల్లో మత్తు మందు కలిపి అమర్‌కు ఇవ్వాలనుకుంటుంది. అందుకోసం పాలు తీసుకుని అమర్ దగ్గరుకు వస్తుంది.
అనామిక: సార్ ఈ పాలు మీ కోసమే తీసుకొచ్చాను.
అమర్: డిన్నర్ హెవీగీ చేశాను. ఇక పాలు తాగను.
భాగీ: ఆయన తాగకపోతే ఏం నేను ఉన్నాను కదా అనామిక గారు ఇటు ఇవ్వండి
అంటూ భాగీ పాలు తాగుతుంది. వెంటనే మత్తుగా మాట్లడుతూ పైకి రూంలోకి వెళ్లి అమర్‌ను గట్టిగా కౌగిలించుకుని మద్దు పెడుతుంది. ఐలవ్యూ చెప్తుంది. దీంతో అమర్ షాక్ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!