Nindu Manasulu Serial Today Episode విజయానంద్‌కి విశ్వాసం కాల్ చేసి ప్రేరణ, సిద్ధూ బ్యాంక్‌కి వచ్చారని.. ఇద్దరూ కలిసి కాఫీ షాప్ పెట్టాలి అనుకుంటున్నారని లోన్ కోసం మేనేజర్‌తో మాట్లాడుతున్నారని చెప్తాడు. వాళ్లకి లోన్ రావాలి అంటే నేను వెంటనే రికమండేషన్ చేయాలి కదా అని అంటాడు.
బ్యాంక్ మేనేజర్ సిద్ధూ, ప్రేరణలతో లోన్ ఇవ్వడం కష్టం అని అంటాడు. సిద్ధూ చాలా బతిమాలుతాడు. ఇంతలో విజయానంద్ మేనేజర్‌కి కాల్ చేసి మీ దగ్గరకు వచ్చింది నా కొడుకు లోన్ ఇవ్వండి అని చెప్తాడు. మేనేజర్ సిద్ధూ వాళ్లతో సిద్ధార్థ్ నువ్వు ఎవరో ఏంటో చెప్పాలి కదా మీ నాన్న సిటీలోనే అంత పెద్ద బిజినెన్ మెన్ .. ఒక్క మాట చెప్పాలి కదా.. అయినా మీకు అంత డబ్బు ఉంది మీకు లోన్ ఎందుకు బాబు అని అడుగుతాడు. సిద్ధూకి మేటర్ అర్థమై చాలా కోపంగా ఉంటాడు. ఇక మేనేజర్ సిద్ధూకి లోన్ ఇస్తానని అంటాడు. అదేంటి సార్ ఇవ్వను అన్నారు ఇప్పుడు ఇస్తున్నారు అని ప్రేరణ అంటే ఇందాక వీళ్ల నాన్న కాల్ చేశారని చెప్తాడు. లోన్ ఇస్తాను అంటే సిద్ధూ వద్దని అంటాడు. ఒకరి రికమండేషన్ మీద వచ్చే లోన్ నాకు అవసరం లేదు అని సిద్ధూ వెళ్లిపోతాడు.
ఇందిర భర్తకి సేవలు చేస్తుంది. మందులు వేద్దామని చూసి ట్యాబ్లెట్స్ అయిపోయాయని అనుకుంటుంది. వెంటనే విషయం ఈశ్వరికి చెప్పాలని వెళ్తుంది. ఈశ్వరితో విషయం చెప్తుంది. ముందే చూసుకోవాలి కదా అని ఈశ్వరి చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను తెప్పిస్తా అని అంటుంది. గణ స్టేషన్‌కి వెళ్లడంతో ఈశ్వరి వచ్చేటప్పుడు మందులు తీసుకురమ్మని చెప్తుంది. తెప్పిస్తాను అని గణ వెళ్లిపోతాడు.
ప్రేరణ సిద్ధూతో మందు వెనకా ఆలోచించవా అతనితో మాట్లాడే పద్ధతా అది ఈ బిజినెస్ కోసం ఎంత ప్రయత్నించామో మర్చిపోయావా అని తిడుతుంది. ఏం జరిగిందో చూశావు కదా అని సిద్ధూ అంటాడు. లోన్ రాదు అని అన్నవాడు ఎవరో రికమండేషన్ చేయగానే మర్యాదతో పాటు లోన్ ఇస్తాడంట అని సిద్ధూ అనగానే.. ఎవరో ఏంటి ఎవరో మీనాన్నే కదా రికమండేషన్ చేసింది లోన్ ఇప్పిస్తే తప్పేంటి అని అంటుంది. మందు వెనక తెలుసుకోకుండా మాట్లాడొద్దని సిద్ధూ అంటాడు. దానికి ప్రేరణ నీకు బేసిగ్‌గా ఈగో ఎక్కువ.. పైసాకి పనికి రాని పొగరు.. అందుకే కన్నతండ్రి సాయం చేస్తా అంటే ఒప్పుకోవడం లేదు అని అంటుంది. ఇన్నాళ్లు నీతో కలిసి ప్రయాణించినా నాకు అర్థం కాలేదు.. నువ్వు పనికి రాకుండా ఎందుకు ఉండిపోయావా అని.. కానీ ఇప్పుడు అర్థమైంది.. నీ పనులతో నీ ఫ్యామిలికీ దూరం అయిపోయావ్.. నీ అజాగ్రత్తతో లైఫ్ నాశనం చేసుకున్నావ్.. ఇదంతా ఎందుకో తెలుసా.. నీ పెంపకంలో లోపమో ఏమోకానీ నీకు తల్లి అంటే విలువ లేదు.. తండ్రి అంటే లెక్కలేదు.. నీ తండ్రే నీ పుట్టుకకు కారణం అని గుర్తు లేదు.. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో.. అని అంటుంది. ఆపుతారా నా గురించి ఏం తెలుసు అని జడ్జి చేస్తున్నారు. మనిషి గురించి తెలీకుండా సర్టిఫికేట్లు జారీ చేయడం సంస్కారం కాదు అది గుర్తు పెట్టుకోండి అని వెళ్లిపోతాడు.
ఇందిర రాజశేఖర్ దగ్గరకు వెళ్లి మందులు చూసి ఇలా ఉన్నాయ్ ఏంటి ఇవి వేరేలా ఉన్నాయ్.. ట్యాబ్లెట్స్ ఏమైనా మారిపోయావా అని అనుకొని మందుల బాక్స్ తీసుకొని ఈశ్వరి దగ్గరకు వెళ్తుంది. గణ అక్కడే ఉంటాడు. ఈ మందులు తేడాగా ఉన్నాయని ఈశ్వరికి చూపిస్తుంది. ఎవరు చెప్పారే నీకు ట్యాబ్లెట్స్ తేడాగా ఉండటం ఏంటి అని గణ కోప్పడతాడు. కంపెనీ మారింది అంతే ఫార్ములా సేమ్.. ఏదో గొప్ప విషయం కనిపెట్టినట్లు వెళ్లే అని పంపేస్తాడు. ఈశ్వరి కొడుకుతో తనకేం తెలుసురా.. చదువా సంధ్యానా ఏదో చూసి చెప్పింది అని ఈశ్వరి అంటుంది.
విజయానంద్, మంజుల, సాహితి భోజనానికి కూర్చొంటాడు. విజయానంద్ తినకపోవడంతో ఏమైందని మంజుల అడిగితే సహించడం లేదు మనసు బాధ మోస్తుందని అంటాడు. అయ్యాగారు నాటకం మొదలు పెట్టారు అని విశ్వాసం అనుకుంటాడు. సిద్ధూని మన కంపెనీలకు ఇప్పుడంటే ఇప్పుడు సీఈఓని చేయగలను కానీ వాడు చిన్న కాఫీ షాప్ పెట్టుకోవాలని బ్యాంక్‌కి లోన్‌కి వెళ్లాడని చెప్తాడు. మంజుల షాక్ అయి వాడు మన పరువు తీయాలి అనుకుంటున్నాడు అని అంటుంది. సాహితి తల్లితో అన్నయ్య బిజినెస్ చేయాలి అనుకుంటున్నాడు.. ట్రై చేస్తున్నాడు అని అంటుంది. నేను చాలా రికమండేషన్ చేశా బ్యాంక్‌కి ఫోన్ చేశా నాకు బాధ్యత ఉంది అని విజయానంద్ అంటాడు.
సాహితి తండ్రితో అన్నయ్యకి రికమండేషన్ నచ్చదు అని తెలిసి కూడా మీరు రికమండ్ చేయడం ఏంటి డాడీ అని సాహితి అంటుంది. మీ డాడీ చేసింది తప్పు కాదు అని మంజుల అంటే.. డాడీ సాయం చేస్తే అన్నయ్య తీసుకోడు సరే మరి నీకు ఏమైంది అమ్మ నువ్వు సాయం చేస్తే అన్నయ్య కాదు అంటాడని ఎప్పుడైనా ఆలోచించావా.. ఆ సాయం ఏదో నువ్వు చేయొచ్చు కదామ్మా అని సాహితి తల్లితో చెప్తుంది. చిన్న ఫెన్ నువ్వు గిఫ్ట్‌గా ఇస్తేనే ఆనందంగా దాచుకున్నాడు.. ఇప్పుడు నువ్వు సాయం చేస్తే కాదు అంటాడని నేను అనుకోవడం లేదని సాహితి అంటుంది. కూతురి మాటలకు విజయానంద్ బిత్తరపోతాడు. మంజుల సీరియస్‌గా నా సాయం వాడు తీసుకుంటాడు అంటే రేపే వాడికి డబ్బు ఇస్తా అని మంజుల అంటుంది. డాడీ మీ కోరిక తిరిపోయింది కదా అని సాహితి అంటుంది. షాక్‌లో ఉన్న విజయానంద్ తలూపుతాడు. కోపంతో రగిలిపోతాడు. ప్రేరణ సిద్ధూకి ఎన్ని సార్లు కాల్ చేసినా సిద్ధూ లిఫ్ట్ చేయడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.