Nindu Manasulu Serial Today Episode ప్రేరణ సిద్ధూ తల్లితో కలిసి మంగళ హారతి పాడుతుంది. అమ్మా ప్రేరణ ఎంత బాగా పాడిందో చూశావా అని సిద్ధూ అంటే మంజుల కాస్త ఫీలైపోతుంది. మంజుల కూతురికి ప్రసాదం ఇవ్వమని అంటే మినిస్టర్ వద్దని ప్రేరణ పాటతో కడుపు నిండి పోయిందని అంటాడు.

Continues below advertisement

గణ సాహితికి ఫోన్ ఇచ్చే వంకతో సాహితిని బుట్టలో వేసుకోవడానికి సిద్ధూ వాళ్ల ఇంటికి వస్తాడు.  అక్కడ మినిస్టర్ కారు చూసి ఇదేంటి మినిస్టర్ కూడా వచ్చాడా.. పండగ పూట విజయానంద్‌ ఇంటికి మినిస్టర్ వచ్చాడు అంటే ఏదో ఉంటుంది.. ఇలాంటి టైంలో ఇంటికి డైరెక్ట్‌గా వెళ్తే అనుమానపడతారు.. సాహితికి ఫోన్ ఇస్తాను అన్నా వాళ్ల అనుమానం పోదు కానీ వెళ్లాలి ఏం చేద్దాం అని అనుకుంటాడు.

విజయానంద్‌కి కాల్ చేస్తాడు. విజయానంద్‌కి కాల్ చేసి మీ కూతురు ఫోన్ పోయింది అని కంప్లైంట్ ఇచ్చారు.. ఎవరో ఒకర్ని పంపిస్తే ఫోన్ ఇస్తాను అంటాడు. దాంతో విజయానంద్‌ నువ్వు ఫోన్ ఇవ్వాలి అంటే నేను ఎవరినో నీ దగ్గరకు పంపాలా.. నువ్వే నా దగ్గరకు వచ్చి ఫోన్ ఇచ్చి వెళ్లు అని అంటాడు. గణ తన ప్లాన్ వర్కౌట్ అయింది అనుకుంటాడు. విజయానంద్‌ ఫోన్ పెట్టేసి నీ దగ్గరకు నా మనిషిని పంపాలా.. నువ్వే నా తొత్తివిరా నువ్వు వచ్చి ఇవ్వాలి అని అనుకుంటాడు. గణ తనలో తాను విజయానంద్‌ నీతో నీ ఇంటికి పిలిపించుకున్నా ఇక ప్రశ్నలు ఉండవు.. అని అనుకుంటాడు.

Continues below advertisement

ప్రేరణకు విజయానంద్ థ్యాంక్స్ చెప్తాడు. ఎందుకు సార్ అని ప్రేరణ అడిగితే నీ వల్లే మా ఇంటికి ఈ పండగ రోజు సంతోషం ఆనందం వచ్చాయి అవన్నీ సిద్ధూ రాకతో వచ్చాయి. నీవల్లే సిద్ధూ ఇంటికి వచ్చాడు అని అంటాడు. ఇందులో నేనేం చేయలేదు సార్ అని ప్రేరణ అంటుంది.

సిద్ధూకి వాళ్ల అమ్మ మీద ప్రేమ ఉంది.. మంచి ఏదో చెడు ఏదో తెలుసుకునే విచక్షణ ఉంది అందుకే వచ్చాడు కానీ నేను చెప్పడం వల్ల రాలేదు అని ప్రేరణ అంటుంది. విజయానంద్ అప్పుడే వచ్చిన మంజులని చూసి మంజు వినేలా సిద్ధూ ఇంటికి రావడం వల్ల తన తల్లి చాలా సంతోషపడింది.. కానీ తన ఆనందం వాడు కాసేపు కూడా ఉంచలేదు.. అమ్మ కోసం వచ్చానని చెప్పుంటే బాగుండేది అమ్మ నా భార్య సంతోషపడేది కానీ వాడు ప్రేరణ వల్ల మాత్రమే వచ్చాను అని చెప్పాడని అంటాడు. ప్రేరణ కూడా షాక్ అయిపోతుంది. సిద్ధూ అలా ప్రవర్తించడు అని ప్రేరణ అంటుంది. దానికి వాడి మనసు మార్చేసినదానివి నీకు తెలీదా.. వాళ్ల అమ్మ కూడా సిద్ధూని బలంగా నమ్మేస్తుందని లేనిపోని తగిలించేస్తాడు. మనిషి వచ్చాడు కానీ వాడి మనసు నీ దగ్గర ఆగిపోయింది.. బిజినెస్ పార్టనర్‌కి ఇచ్చిన విలువ పాలిచ్చి పెంచిన తల్లికి విలువ ఇవ్వలేదు అని అంటాడు.

ప్రేరణ విజయానంద్‌తో సిద్ధూ ఎవరు ఏం చెప్పినా వినడు సార్ తల్లి ప్రేమ కోసం మాత్రం వచ్చాడు.. తల్లి ప్రేమకి మాత్రమే లొంగుతాడు అని అంటుంది. ఇన్ని రోజులు మరి ఎందుకు రాలేదు అని విజయానంద్ అంటే మీరు సరైన ప్రయత్నం చేయలేదు ఏమో అంటుంది. సిద్ధూని సరిగా అర్థం చేసుకోలేదు అని అంటుంది. తప్పు మాదే అంటున్నావా అని విజయానంద్ అంటాడు. సిద్ధూతో కూర్చొండి మనసు విప్పి మాట్లాడండి అని ప్రేరణ అంటుంది. మంజుల విని హర్ట్ అయి వెళ్లిపోతుంది.

ప్రేరణ డైనింగ్‌ టేబుల్ మీద అన్నీ పెడుతుంది. నీకు ఎందుకు ఇవన్నీ అని సిద్ధూ అంటే పర్లేదులే అని ప్రేరణ చేస్తుంది. ఇక అక్కడే ఉన్న శైలు కుమార్ ఎక్కడా అని అనుకుంటుంది. ఇంతలో కుమార్ వస్తాడు. సిద్ధూతో మీ అమ్మ నాతో గొడ్డు చాకిరి చేయిస్తుందిరా అని అంటాడు. ఏం కాదులే చేసేయ్‌రా అని సిద్ధూ అంటాడు. ఇక శైలు కుమార్‌ని పువ్వులతో కొట్టి పిలిస్తే సిద్ధూ చూసి నీ జాన్ పూలతో కొట్టి పిలుస్తుందిరా అని చూపిస్తాడు.

కుమార్ తల బాదుకొని వామ్మో అదేమో సైగ చేస్తుంది. నాకు సెగలు వస్తున్నాయి,, వాళ్ల నాన్న గన్‌మెన్‌కి సిగ్నల్ ఇచ్చాడు అంటే నా బతుకుకి శుభం కార్డేరా అని అంటాడు. ఏం కాదులేరా అంత భయం అని సిద్ధూ, ప్రేరణ అంటారు. మీకేంటి మీరు ఎన్ని అయినా చెప్తారు మీరు నా ప్లేస్‌లో ఉంటే తెలుస్తుందని కుమార్ అంటాడు. వాళ్ల నాన్న కత్తి లేకుండా రక్తం తీసేస్తాడు. అలాంటి వాడి కూతుర్ని నాలాంటి వాడు ప్రేమించాడు అంటే నన్ను ఉంచుతాడా అని అంటాడు.

శైలు కుమార్ దగ్గరకు వెళ్లి బుగ్గ గిల్లుతుంది. అది మినిస్టర్ చూస్తాడు. కళ్లు పులుముకొని చూసే టైంకి కుమార్ పని చేసుకుంటూ ఉంటాడు. శైలు ఎప్పటిలా తండ్రి దగ్గరకు వెళ్లిపోతుంది. శైలుని  మినిస్టర్ వాడు నీకు తెలుసా అమ్మా అని అడిగితే తిరనాల్లో పీచు మిఠాయి అమ్ముకునే వాడిలా ఉన్నాడు వాడు నాకు తెలుసా అని అంటుంది. దాంతో హమ్మయ్యా నా కూతురే అని మినిస్టర్ అంటాడు.

సాహితి బయట గణని చూసి విష్ చేసి లోపలికి తీసుకొస్తుంటుంది. గణ లోపలికి వస్తుంటే సిద్ధూ చూసి ఆగు అని అరుస్తాడు. అందరూ షాక్ అయి దగ్గరకు వెళ్తారు. ఇక్కడేం పని నీకు ఎందుకు వచ్చావ్ ఇక్కడికి అని అడుగుతాడు. నేను డ్యూటీ మీద వచ్చా బాస్ అని గణ అంటాడు. నీ చెల్లి ఫోన్ తిరిగి ఇవ్వడానికి వచ్చాను.. ఫోన్ పోయింది అని నీ చెల్లి కంప్లైంట్ ఇచ్చారని చెప్తాడు. గణ సాహితిని కోపంగా చూస్తాడు. సాహితి అవును అని తలూపుతుంది. గణ ఫోన్ చూపిస్తాడు. ఇదో కొత్త నాటకమా అని సిద్ధూ అడిగితే అతను వచ్చింది సాహితికి ఫోన్ ఇవ్వడానికి అని విజయానంద్ అంటాడు. ఫోన్ ఇవ్వడానికే వచ్చారు అన్నయ్యా అని సాహితి ఫోన్ తీసుకొని చూపిస్తుంది. ఎందుకు తొందరపడతావ్ సిద్ధూ అని విజయానంద్ అంటే పర్లేదు సార్ నాకు మీరు మీ అమ్మాయే ముఖ్యం అని గణ అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.