Nindu Manasulu Serial Today Episode సిద్ధూ ఇంటికి వెళ్లడంతో మంజుల చాలా చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఎప్పటికీ ఇంటి నుంచి వెళ్లను అని తల్లికి మాటిస్తాడు. తర్వాత మంజులకు జ్యూస్ తాగిస్తాడు. సాహితికి అమ్మకోసం టిఫెన్‌ తీసుకురమ్మని చెప్తాడు. 

Continues below advertisement

ఇందిర, సుధాకర్ రాజశేఖర్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తారు. ఇందిర ఈశ్వరితో ఇంట్లో సరుకులు అయిపోయావి ఇప్పుడే తీసుకురావాలి అని అంటుంది. సుధాకి కాల్ చేసి చెప్తా అని ఈశ్వరి అంటే ఇప్పుడే నాకు ఇష్టం లేదు తర్వాత వెళ్తా అంటుంది. బయట ఉన్న సుధా దగ్గరకు ఇందిర వెళ్లి ఆవిడేంటిరా వెళ్లడం లేదు ఎలా అయినా మీ బావని తీసుకెళ్లాలి అని అంటుంది. గణకి పెళ్లి చేయాలని ఆవిడ తెగ ఆరాట పడుతుంది. దాన్ని అడ్డుపెట్టుకొని వెళ్దాం అని అంటుంది. 

సుధాకర్‌ని పెళ్లిళ్ల పేరయ్యలా ఫోన్ చేసి అమ్మాయి పక్కనే ఉందని చెప్పి ఆవిడను బయటకు తీసుకురమ్మని అంటుంది. ఆవిడ అంటేనే నాకు భయమే అంటూనే సుధాకర్ కాల్ చేసి పెళ్లిళ్ల పేరయ్యలా మాట్లాడి ఈశ్వరితో పెళ్లి సంబంధం గురించి చెప్తాడు. దాంతో ఈశ్వరి ఇప్పుడే వస్తాను అని లొకేషన్ పంపమని బయటకు వెళ్తుంది.  

Continues below advertisement

సిద్ధూ తల్లికి టిఫెన్ తినిపిస్తాడు. సిద్ధూ  ఇన్నేళ్లు ఎంత టెన్షన్ పెట్టావురా నన్ను అని మంజుల అంటుంది. దాంతో సాహితి మళ్లీ ఇళ్లు కదిలితే కాళ్లు విరగ్గొడతా అని అంటుంది. ఇద్దరూ చూస్తే అమ్మ డైలాగ్ అది అని అంటుంది. ఇంతలో ప్రేరణ కాల్ చేస్తుంది. సిద్ధూ కంగారు పడతాడు. సిద్ధూ కాల్ లిఫ్ట్ చేసి ఇంకా రాలేదు ఏంటి అని ప్రేరణ అడిగితే అది మరి అని సిద్ధూ తడబడుతూ మాట్లాడితే అదేంటి మాటలు చెప్పడం కాదు టైం సెన్స్ ఉండాలి అని ప్రేరణ అంటుంది. ఇప్పుడు వచ్చే పరిస్థితిలో రాలేను అని సిద్ధూ అంటే సాహితి ఫోన్ తీసుకొని ప్రస్తుతం మా అన్నయ్యా మా ఇంట్లో ఉన్నాడు.. అమ్మకి టిఫెన్ తినిపిస్తున్నాడు ఇప్పుడు ఎక్కడికీ రాలేడు అని అంటుంది. 

సిద్ధూ ఇంటికి వెళ్లాడా అని సంతోషపడుతుంది ప్రేరణ. ఇక సిద్ధూ కోచింగ్‌కి కేఫ్‌కి వెళ్లాలి అని తల్లితో చెప్పి నిన్ను ఇలా వదిలేసి వెళ్లాలాఅంటే వెళ్లురా నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను అని మంజు అంటుంది. సిద్ధూ కేఫ్‌కి వెళ్తాడు. 

సిద్ధూ బయటకు వెళ్తుంటే విజయానంద్ షాక్ అయి చూస్తూ ఉంటాడు. విశ్వాసం వచ్చి పరిస్థితులు పగ పట్టేశాయి సార్.. అని అంటాడు. ఈ మధ్య నేను బుర్ర వాడటం లేదు అందుకే ఈ బురద ఇంట్లోకి వచ్చేసింది అని సిద్ధూ గురించి అంటాడు. ఇంత సడెన్‌గా సిద్ధూ బాబు రావడం వెనక ఎవరో సిద్ధూ బాబుని మార్చేశారు అని అంటాడు. విజయానంద్‌ విషయం మనకు అనుకూలంగా మారిపోతుందిరా ఓ చిన్న డౌట్ క్లియర్ అవ్వాలి.. నా అనుమానం నిజం అయితే సిద్ధూ తల్లి ముందు దిగజారడం ఖాయం.. ఇంటి నుంచి వెళ్లడం ఖాయం నా చేతుల్లో వాడు దెబ్బలు తినడం ఖాయం అని అంటాడు.

ఇందిర సుధాకర్ రాజశేఖరాన్ని తీసుకొని హాస్పిటల్‌కి వస్తారు. డాక్టర్ చూసి ముందే తెచ్చుంటే పరిస్థితి మారిపోయేది ఇప్పటికీ అదే స్థితిలో ఉన్నారు.. ఈ రోజు నుంచి నెల రోజులు నేను ఇచ్చే మందులు వాడి వారానికి ఒక రోజు చెక్‌అప్‌కి తీసుకురండి అని అంటాడు. 

సిద్ధూ కేఫ్‌కి రావడంతో నువ్వు వచ్చావా అమ్మ పక్కనే ఉన్న కమ్మదనం ఆస్వాదిస్తున్నావ్ అనుకున్నా అని అంటుంది. బిజినెస్ డల్ అయింది ఏంటిఅని సిద్ధూ అంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా అనిఅంటుంది. నేను ఆ ఇంటికి వెళ్లడానికి కారణం నువ్వే అని సిద్ధూ చెప్తాడు. అమ్మ ప్రేమ కంటే ఆత్మాభిమానం గొప్పది కాదు అని వెళ్లిపోయా అంటాడు. మొత్తం విన్న కుమార్ ఇన్నిరోజులు అదే మాట నేను చెప్తే వెళ్లలేదు కానీ ప్రేరణ గారు చెప్తే వెళ్లిపోయావ్ మిత్ర ద్రోహి అని అంటాడు.

గణ కారులో వెళ్తుంటే సాహితి కాల్ చేస్తుంది. గణని సాహితి సార్ అంటే అలా పిలొద్దు అని అంటాడు. ఫోన్ గురించి సాహితి అడిగితే ఫోన్ ఎక్కడుందో తెలిసింది ఇప్పుడు వెళ్లి తీసుకురావడమే ఉంది అని అంటాడు. ఫోన్ మీకు తప్పకుండా ఇప్పిస్తా అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.