Nindu Manasulu Serial Today Episode ప్రేరణ కేఫ్‌ని ఎందుకు వదిలేశావ్ అని ఈశ్వరి గణని ప్రశ్నిస్తుంది. నీకు ప్రేరణ మాత్రమే కనిపిస్తుంది.. నేను మాత్రం దాని చుట్టూ ఉన్న అంతా కనిపెడుతున్నా.. కానిస్టేబుల్‌తో సెల్యూట్ కొట్టించుకొని పబ్లిక్‌ని భయపెట్టడం పవర్‌ కాదమ్మా.. పులి ముందు సింహం నిల్చొని చేతులు కట్టుకుంటే అది పవర్ అని అంటాడు. మనిషిని కాకుండా మనసు అనే ఆయుధం అందరికంటే పవర్ ఫుల్ దాంతో మనుషుల్ని వాళ్ల జీవితాలను సంతోషాన్ని చంపేయొచ్చు.. ఆ ఆయుధం దక్కించుకునే పనిలో ఉన్నా కాస్త ఓపిక పట్టు అని సాహితి గురించి ఇన్‌డైరెక్ట్‌గా చెప్తాడు.

Continues below advertisement

విజయానంద్ కేఫ్‌కి వచ్చి ప్రేరణతో మాట్లాడుతాడు. సిద్ధూ నీతో మాట్లాడినట్లు మా ఎవరితో మాట్లాడడు.. నువ్వు వాడి జీవితంలోకి వచ్చిన తర్వాత వాడిలో చాలా మార్పు వచ్చింది..ఇదంతా నీ వల్లే సాధ్యమైంది.. వాడిలో వచ్చిన మార్పు మంచి వైపు నడవాలి అన్నా మా వైపు వాడు రావాలి అన్నా అది నీ వల్లే సాధ్యమవుతుంది. మాకు నచ్చింది వాడు చేయలేదు.. ఇచ్చింది తీసుకోవడం లేదు.. అమ్మ ప్రేమ వద్దని నా ఆప్యాయత వద్దని మాకు దూరంగా ఉన్నాను.. ఇప్పుడు ఆ దూరాన్ని నువ్వే చెరిపేయాలి.. నువ్వు చెప్తే వాడు వింటాడు.. నువ్వు చెప్పివాడిని మా దగ్గరకు రప్పిస్తే మాకు చాలా మేలు చేసిన దానివి అవుతావు అంటాడు.

ప్రేరణ విజయానంద్‌తో మీరు చాలా వింతగా మాట్లాడుతున్నారు సార్.. మీ నమ్మకం నిజమైంది కాదు.. సిద్ధూ ఆత్మాభిమానం ఒప్పుకోదు సార్. ఇన్నేళ్లు మీరు చెప్తే వినని అతను నా మాట వింటాడు అని మీరు ఎలా అనుకుంటున్నారు సార్.. అని అంటుంది. మా ప్రేమ వాడికి విషం అయిపోయింది. నువ్వే వాడిని మార్చాలి అంటాడు విజయానంద్. నా వల్ల కాదు సార్ అది మీరే ప్రయత్నించండి అని ప్రేరణ అంటుంది. మీ మధ్య తప్పులు ఒప్పులు అన్నీ ఉంటాయి అవి మీరే మాట్లాడుకోండి.. అని అంటుంది. మా అదృష్టం ఇంతే అని విజయానంద్‌ వెళ్లిపోతాడు. సిద్ధూ ఎదురై ఎందుకు వచ్చావ్ అని అడుగుతాడు. అర్జెంట్ మీటింగ్ ఉందని విజయానంద్ వెళ్లిపోతాడు.

Continues below advertisement

సిద్ధూ ప్రేరణతో ఆయన ఎందుకు వచ్చాడు అంటే నీ కోసమే వచ్చాడు.. నువ్వు తిరిగి మీ ఇంటికి వెళ్లాలి అంట.. శాశ్వతంగా మీ అమ్మానాన్నలతోనే ఉండాలి అంట ఆ విషయంలో నన్ను సాయం చేయమని అన్నారు అని అంటుంది. మరి నువ్వేం అన్నావ్ అని సిద్ధూ అడుగుతాడు. ఏదైనా మీ అబ్బాయితో మీరే మాట్లాడాలి.. ఇందులో సిద్ధూ నిర్ణయం తీసుకోవాలి కానీ నేను చెప్పేది ఏం లేదు అన్నాను.. ఒకరు చెప్తే వినే అంత చిన్న పిల్లాడివి కాదు నువ్వు అని అంటుంది. మా ఇద్దరికీ చాలా కరెక్ట్‌గా చెప్పావ్.. నన్ను బాగా అర్థం చేసుకున్నావ్ అని సిద్ధూ అంటాడు.

విశ్వాసం విజయానంద్‌తో మీరు ఏంటి సార్ ఇంత దిగజారిపోయారు..ఇలా చెప్పారేంటి అని అడిగితే సిద్ధూకి ఇప్పుడు ప్రేరణ వేరులా తయారైందిరా అందుకే వాళ్లిద్దరినీ విడదీయాలి.. వాడికి ఎవరి సపోర్ట్ లేకుండా చేయాలి.. అయినా నా టార్గెట్ వాళ్లని విడదీయడం కాదురా. సిద్ధూని వాడి తల్లికి శాశ్వతంగా దూరం చేయడం..ఇప్పుడు నేను వేసిన ఈ భీజం ఎప్పుడో ఒక రోజు మహా వృక్షంలా మారి సిద్ధూ, ప్రేరణని విడదీస్తుంది అప్పుడు నేను అనుకున్నది జరుగుతుంది అని అంటాడు. సిద్ధూని ఎదగనివ్వకుండా చేయడానికి ఎన్ని అడ్డుదారులైనా తొక్కేస్తా ఎవరినైనా వాడేస్తా అని అంటాడు.

సాహితి తన ఫోన్ పోయింది అని కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్తుంది. కానిస్టేబుల్ సాహితిని వెళ్లమ్మా ఇప్పుడే కాదు అని అంటాడు. అది మా అన్నయ్యా ఇచ్చిన ఫోన్ సార్ వెతికి ఇవ్వండి అని అంటే కంప్లైంట్ ఇచ్చి వారం తర్వాత రా అని కానిస్టేబుల్ అనేస్తాడు. ఇక గణ దూరం నుంచి సాహితిని చూసి వెతకబోయిన తీగ కాలికే దొరికినట్లు ఈ పిల్ల ఇక్కడికే వచ్చింది అనుకుంటాడు. విషయం మొత్తం వినేసి ఏం తెలీనట్లు వెళ్తాడు. సాహితి గణని చూసి హాయ్‌ సార్ అని విషయం అడుగుతాడు. ఫోన్ పోయింది సార్ అది నా సెంటిమెంట్ అని అంటుంది. ఆడపిల్లకి మర్యాద ఇవ్వాలి అని గణ తిడతాడు. మీ ఫోన్‌ నేను వెతికి పెడతాను అని గణ అంటాడు. అందుకు ఫోన్ నెంబరు ఇవ్వమని గణ అంటాడు. ఫోన్‌ పోయింది సార్ ఇంక నెంబరు ఎలా ఇస్తాను అని సాహితి అంటుంది. 12  గంటల్లో మీ ఫోన్ మీ చేతుల్లో ఉంటుందని గణ చెప్తాడు. కానిస్టేబుల్‌తో గంటలో ఆ ఫోన్ నా చేతిలో ఉండాలి అని చెప్తాడు.

సిద్ధూ గురించి ఆలోచిస్తూ ప్రేరణ వల్ల సిద్ధూ మారిపోతాడు ఏమో అని ఆలోచిస్తూ మంజుల కళ్లు తిరిగి పడిపోతుంది. సాహితి బయట నుంచి వచ్చి తల్లిని చూసి ఏడుస్తుంది. అమ్మని లేపుతుంది ఎవరూ ఇంట్లో ఉండరు.. కారు డ్రైవర్ కూడా బయటకు వెళ్లిపోతాడు. సాహితి సిద్ధూకి కాల్ చేసి  విషయం చెప్తుంది. నువ్వు ఏడ్వకు నేను వస్తున్నా అని సిద్ధూ అంటాడు. ఇక సిద్ధూ, ప్రేరణ ఇంటికి వెళ్తారు. సిద్ధూ గుమ్మం దాటడానికి ఆలోచిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.